ఆచార్య హ్రుదయం – 27

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 26

అవతారిక
కర్మమును కైంకర్యమును ఏవి కలుగచేయునో ఇక్కడ వివరించుచున్నారు

చూర్ణిక
ఇవత్తుక్కు విధి రాగజ్గళ్ ప్రేరకజ్గళ్

సంక్షిప్త వివరణ
విధి మరియు కోరిక ఈ స్థితులను కలుగచేయును

వ్యాఖ్యానము
అనగా – శాస్త్రములో చెప్పబడిన విధులైన యజుర్ వేదం “యజేత” (యజ్ఞమును చేయవలెను), కర్మ మీమాంస “జుహుయాత్” (హవిస్సును అర్పించు) అనునవి కర్మమును కలుగజేయునవి. శరణాగతి గద్యములో చెప్పబడిన కోరిక “అశేష శేషతైక రతి”(ఏ ఒక్క కైంకర్యమునూ వదలకుండా అన్ని విధముల కైంకర్యములను చేయుటకు గల కోరిక)అనునది కైంకర్యమును కలుగజేయునది. కైంకర్యము అనగా    శరణాగతి గద్యములో ” భగవదనుభవ జనిత ప్రీతి కారిత” అని చెప్పినట్టు (భగవదానుభవము చేత కలుగు భగవద్ ప్రీతి వలన కలుగునది కైంకర్యము). తిరువాయిమొళి 10.8.10 “ఉగన్దు పణి సెయ్దు” (కోరికతో కైంకర్యములో నిమగ్నమవుట).

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-27-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment