ఆచార్య హ్రుదయం – 28

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 27

అవతారిక
వీటికి ఆశ్రయములను వివరించుచున్నారు

చూర్ణిక
మణ్డినారుమ్ మత్తైయారుమ్ ఆశ్రయమ్

సంక్షిప్త వివరణ
కర్మమునకు గల ఆశ్రయము ఇతరులైనవి మరియు కైంకర్యమునకు గల ఆశ్రయము దివ్యదేశములు.

వ్యాఖ్యానము
అనగా – తిరుక్కురుందాండగం 19 “కణ్డియూర్ అరంగమ్ మెయ్యమ్ కచ్చిపేర్ మల్లై ఎన్ఴు మణ్డినార్”(తిరక్కండియూర్, శ్రీరంగము, తిరుమెయ్యమ్, కాంచీపురము, తిరుప్పేర్ నగర్, తిరుక్కడల్ మల్లై  ఇత్యాది దివ్యదేశముల యందు ప్రీతీ గల వారు) అని చెప్పినట్టు ఆ సర్వేశ్వరుడు ప్రీతితో వేంచేసి ఉన్నట్టి దివ్యదేశముల యందు అభినివేశమును కలిగి ఉన్న ప్రపన్నులు కైంకర్యపరులు. తిరుక్కురుందాండగం 18  “విళక్కినై విధియిల్ కణ్ బార్(శాస్త్రములో చెప్పబడిన విధుల ద్వారా భగవానుని ఉపాసించువారు) లో చెప్పినట్టు తక్కిన వారైన ఉపాసకులు కర్మమునకు ఆశ్రయము.

దీనితో కర్మానుష్ఠానపరులను, కైంకర్యపరులను వివరించడము జరిగినది.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-28-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment