ఆచార్య హ్రుదయం – 29

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక-28

అవతారిక
వాటికి గల లక్ష్యములను వివరించుచున్నారు

చూర్ణిక
అరుళ్ ముడియనిఴుత్తి అడైయనిన్ఴతుమ్ నల్లతోర్అరుళ్ తన్నాలే నన్ఴుమ్ ఎళియనాకిఴతుమ్ విషయమ్

సంక్షిప్త వివరణ
ఆ సర్వేశ్వరుని కృప చేత నియమితులై ఆయనని అంతర్యామిగా కలిగి ఉండు దేవతలు కర్మమునకు లక్ష్యము. తన కృప చేత అత్యంత సులభుడుగా ఉన్న ఆ సర్వేశ్వరుని అర్చావతారము కైంకర్యమునకు లక్ష్యము.

వ్యాఖ్యానము
అది ఏమి అనగా – నాన్ముగన్ తిరువందాది 2 “ఎత్తవమ్ శెయ్దార్కుమ్ అరుళ్ ముడితాళి యాన్బాల్”(ఎవరైతే వారి శక్తికి తగ్గ తపమును ఆచరించునో అట్టి వారికి ఫలమును ఇచ్చువాడు చక్రధారి అయిన ఆ సర్వేశ్వరుడే) అని చెప్పినట్టు తనను ఆశ్రయించినందున ఫలము తన అనుగ్రహము వలనే కలుగునట్లు తిరువాయిమొళి 5.2.8 “తన్ మూర్తి నిరుత్తినాన్ దైవంగళాక” (తన యొక్క వివిధ రూపాలను/శరీరములను పూజింపబడు దేవతలుగా చేసినవాడు) అని చెప్పినట్టు అట్టి చేతనులు ఆయా దేవతలను శాస్త్రము ప్రకారము ఆశ్రయించుట చేత ఫలమును పొందును. ఆయా ఫలములను ఆయా దేవతామూర్తులలో తానే అంతర్యామిగా ఉండి ఇచ్చుట కర్మమునకు గల విషయము. (లక్ష్యము)  

తిరుమాలై 10 “నల్లదోర్ అరుళ్ తన్నాలే కాట్టినాన్ తిరువరంగమ్” (అతని యొక్క సాటిలేని కృప చేత శ్రీరంగమున చూపించెను) అనియు తిరువాయిమొళి 3.6.11 “కరుతుక్కు నన్ఱుమే ఎళియనాయ్” (హృదయమున అనుభవించుటకు గల కారణము) తన కృప చేత అత్యంత సులభుడై  అర్చావతారమున ఉండుట కైంకర్యమునకు గల విషయము. (లక్ష్యము)  

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-29-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment