అవతారిక
ఈ లక్షణములేనా వీరికి తగినవి? ఊరు, వంశము మొదలగు వాటి గురించి ఏమిటి అని అడుగగా నాయనార్లు వాటి గురించి చెప్పుచున్నారు.
చూర్ణిక
ఒరుతలైయిల్ గ్రామకులాది వ్యపదేశమ్ కులన్దరుమ్ మాశిల్కుడి ప్పళయెన్ఴు పతియాక క్కోయిలిల్ వాళుమ్ ఎన్బర్ కళ్
సంక్షిప్త వివరణ
కర్మ నిష్ఠులు తమకి తాము వారి ఊరు, వంశముతో గుర్తింపబడతారు. కైంకర్య నిష్ఠులు ఊరి పేరు, వంశమును పక్కనపెట్టి తమకి తాము దివ్యదేశములతో గుర్తింపబడతారు.
వ్యాఖ్యానము
అనగా – ఒక పక్క దేహ సంబంధములైన ఊరు, వంశముతో కర్మ నిష్ఠులు తమకి తాము గుర్తింపబడగా మరో పక్క భగవానునితో తమకు గల సంబంధాన్ని గ్రహించడము చేత పెఱియ తిరుమొళి 1.1.8 “కులమ్ తరుమ్” (నారాయణుని దివ్య నామము గొప్ప వంశములో జన్మించేట్టు చేస్తుంది)అని చెప్పినట్టు దేహ సంబంధములైన గుర్తులు దోషముగా తలచి దాస వృత్తికి అట్టి దోషములు లేకుండుట మరియు శేషత్వమునకు విరోధమైన అహంకారమును తలచి(దేహమే ఆత్మా అని భ్రమపడుట) మూన్డ్రామ్ తిరువందాది 10 “మాసిల్ కుడి” (ఎట్టి దోషమూ లేనట్టి వంశము) తమకి తాము భగవానుని సంబంధమును కలిగి ఉన్న దివ్యదేశములతో గుర్తించెదరు. నాచ్చియార్ తిరుమొళి 8.9 “వేంగడత్తైప్ పదియాగి వాళ్ వీర్గళ్” (తిరువేంగడమును నివాసముగా కలవారు) మరియు పెరియాళ్వార్ తిరుమొళి 5.1.3 “కోయిలిల్ వాళుమ్ వైట్టణవన్”(నీ ఆలయములో నివాసి) అని చెప్పినట్టు ఇది భగవద్ సంబంధము మరియు భగవానుని సొత్తుగా తమని తాము భావింపబడుటకు ఒక ప్రతీకి.
శ్రీ విష్ణు పురాణము “ఏకాన్తీ వ్యపదష్టవ్యో నైవ గ్రామ కులాదిభిః విష్ణునా వ్యపదేష్టవ్యః తస్య సర్వం స ఏవహి”(ఒక ప్రపన్నుడు తమ యొక్క పుట్టిన ఊరు, వంశముతో వ్యవహరింపబడ కూడదు. అతను విష్ణు సంబంధముతో తెలియును కదా? అతనికి ఊరు, వంశము మొదలగు అన్నియూ విష్ణువే కదా!)
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-35-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org