ఆచార్య హ్రుదయం – 36

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 35

అవతారిక
ఇక మీద కర్మ నిష్ఠులకు మరియు కైంకర్య నిష్ఠుల ఇరువురికి ప్రధానమైన పూర్వీకులను తెలుపుచున్నారు.

చూర్ణిక
విప్రర్ క్కు గోత్రచరణసూత్రకూటస్థర్ పరాశర పారాశర్య బోధాయనాధికళ్ ప్రపన్నజనకూటస్థర్ పరాజ్కుశ పరకాల యతివరాదికళ్

సంక్షిప్త వివరణ
బ్రాహ్మణుల యొక్క గోత్ర, చరణ మరియు సూత్రమునకు ప్రధాన పూర్వులు పరాశర, వ్యాస, బోధాయన మొదలగు వారు. ప్రపన్నులకు
ప్రధాన పూర్వులు నమ్మాళ్వార్లు, తిరుమంగై ఆళ్వార్లు, శ్రీ రామానుజులు మొదలగు వారు.

వ్యాఖ్యానము
అనగా – “అన్దణర్”  మరియు “మఴైయోర్” గా పిలువబడు బ్రాహ్మణులకు వారి గోత్రమునకు ప్రధాన పూర్వులు పరాశర మొదలగు వారు. గోత్రము అనగా వంశము యొక్క పరంపర. అమర కోశము “సంతతిర్ గోత్ర జనన కులాని అభిజన అన్వయౌ”(సంతతి, గోత్రము, జనన, కులము, అభిజనము, అనవయము అన్నీ ఒక్కటే). అట్టి గోత్రములు అనేకములు మరియు ప్రతీ గోత్రమునకు పూర్వులు అయిన వశిష్ఠ, కాశ్యప, భారద్వాజ, వత్స వేరు అయిన కారణము చేత ప్రధానముగా పరాశర మొదలగు అని చెప్పబడినది.

చరణ పూర్వులు పారాశర్య(వ్యాస) మొదలగు వారు. చరణములు అనగా వేద శాఖలు. వేద శాఖలను అధ్యయనము చేయువారిని కూడా చరణ అని సంభోదించెదరు. “చరణ శబ్దః కాటక కాలపాది శాఖా విశేషేషు ముఖ్యః తత్ అధ్యాయిషు గౌణః”(చరణ అను శబ్దము ప్రధానముగా వేద శాఖలు అయిన కాటకం, కాలపాది మొదలగు వాటిని సూచించును. గౌణ రూపములో ఆ శాఖలను అధ్యయనము చేయు విద్యార్థులను సూచిస్తుంది.) ఇక్కడ చరణ శబ్దం వేద శాఖలనే సూచిస్తోంది. ప్రధానముగా ఈ వేద శాఖలను ప్రవర్తింపచేసినది వ్యాసుల వారు అయినా ఒక్కొక్క శాఖను ప్రత్యేకముగా ప్రవర్తింపచేసిన వారు కఠ , కలాప, కణ్వ మొదలగు వారు. అందుచేత చరణ కూటస్థలుగా వ్యాసులు మొదలగు వారిని చెప్పుదురు.

సూత్రమునకు పూర్వులు బోధాయన మొదలగు వారు. సూత్రములు అనగా కర్మానుష్ఠానములను తెలుపు కల్పము. శ్రీ రంగరాజా స్తవము 2.15 మొదలు “శీక్షాయాం వర్ణ శిక్షా”(పదముల యొక్క శబ్దములు శిక్షలో చెప్పబడినవి) అని చెప్పినప్పుడు “కల్పేనుష్ఠానమ్ ఉక్తమ్”(కల్ప సూత్రములలో కర్మానుష్ఠానము చెప్పబడినది). ఇవి కూడా అనేకములై అనేకులు అయిన ఆపస్తంబ, అశ్వలాయన మొదలగు వారు ప్రకాశింపజేయుట చేత బోధాయనలు మొదలగు సూత్ర కూటస్థలుగా తెలుస్తున్నది. బ్రాహ్మణులకు వీరు ప్రధాన పూర్వులు.

అడియార్ మరియు తొణ్డర్ గా పిలువబడి ప్రపన్నులకు ప్రధాన పూర్వులు ఆళ్వార్లు అయిన నమ్మాళ్వార్లు, తిరుమంగై ఆళ్వార్లు మొదలగు వారు మరియు ఆచార్యులైన ఎమ్బెరుమానార్లు మొదలగు వారు. పరాంకుశాష్టకము 4 “పత్యుః శ్రియః ప్రసాదేన ప్రాప్త సార్వజ్ఞ్య సంపదం ప్రపన్న జన కూటస్థం ప్రపద్యే శ్రీ పరాంకుశం”(శ్రీమన్నారాయణుని దివ్య కృప చేత దివ్య జ్ఞానమును సంపదగా పొందిన నమ్మాళ్వార్లకి ప్రపత్తి చేయుచున్నాను).

కూటస్థర్ అనగా మూల పురుషులు. ప్రపత్తి మార్గమును ఇతరులకు ఉపదేశించి ఆచరించి వృద్ధి పరచడము చేత వీరిని(నమ్మాళ్వార్లను) కూటస్థలుగా పేర్కొన్నారు.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-36-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment