ఆచార్య హ్రుదయం – 37

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 36

అవతారిక
ఇక మీద కర్మ నిష్ఠులకు బ్రాహ్మణత్వము మరియు కైంకర్య నిష్ఠులకు వైష్ణవత్వము ఎలా సిద్ధించునో నాయనార్లు వివరించుచున్నారు.

చూర్ణిక
అధ్యయన జ్ఞానానుష్ఠానజ్గళాలే బ్రాహ్మణ్యమాకిఴా పోలే శన్దజ్గళాయిరముమ్ అఴియక్కత్త వల్లారానాల్ వైష్ణవత్వసిద్ధి

సంక్షిప్త వివరణ
ఎలా అయితే వేదాధ్యయనము, వేదార్ధములను గ్రహించి ఆ వేద సూత్రములను జీవితములో ఆచరించడము ద్వారా బ్రాహ్మణత్వము సిద్ధిస్తుందో అలానే తిరువాయిమొళి అధ్యయనము, ఆ ప్రబంధము యొక్క అర్ధములను గ్రహించి జీవితములో వాటిని ఆచరించడము ద్వారా వైష్ణవత్వము సిద్ధించును.

వ్యాఖ్యానము
అనగా – “స్వాధ్యాయోధ్యేతవ్యః”(వేదమును అధ్యయనము చేయవలెను) అని వేదములో చెప్పినట్టు ఆచార్యుని వద్ద చెప్పించుకొని తర్వాత శిష్యుడు ఆచార్యుడు ఉఛ్చరించిన రీతిలోనే దానిని అవలంబించవలెను. తదుపరి మీమాంసా శాస్త్రము మొదలగు వాటిని ఆలకించి వేదార్ధములను గ్రహించి తదనంతరం అట్టి అభ్యాసమును నిజ జీవితములో అవలంబించవలెను. ఈ విధముగా తిరువాయిమొళి 10.9.11 “సందన్గళ్ ఆయిఴమ్”(వివిధ ఛందస్సులో ఉన్న వేయి పాశురములు) పాశుర రూపములో ఉన్న తిరువాయిమొళి “అధ్యేతవ్యం ద్వజశ్రేష్ఠైర్వేద రూపమిదం కృతం”(వేద రూపములో ఉన్న తిరువాయిమొళిని బ్రాహ్మణులు అభ్యసించవలెను) మరియు తిరువాయిమొళి 5.5. 1 “అఴియాక్ కత్తు వల్లార్ వైట్టణవర్”(ఎవరు అయితే ఈ పత్తును నేర్చి ఆ అర్ధములను ఉపాసిస్తారో అట్టి వారి జ్ఞానము ప్రకాశించి ఆ సర్వేశ్వరునితో విశిష్ఠ సంబంధము ఏర్పడి సుఖముగా జీవించగలరు) అని చెప్పినట్టు ఎవరు ఆచార్యుని వద్ద సంత చెప్పించుకుని ఆచార్యుడు ఉఛ్చరించినట్టు ఉఛ్చరించి ఆచార్య ముఖోపదేశము ద్వారా దాని అర్థములను తెలుసుకుంటారో అట్టి వారికి  వైష్ణవత్వము సిద్ధించును.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-37-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment