ఆచార్య హ్రుదయం – 38

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 37

అవతారిక
వేదాధ్యయనము(సంస్కృత వేదము) చేసిన వారికి(అర్ధములను గ్రహించి ఆచరణలో పెట్టిన వారికి) ఈ ద్రావిడ వేదమందు ప్రవేశము(అభినివేశము) లేకపోయినచో వారికి వైష్ణవత్వము సిద్ధించదు కానీ బ్రాహ్మణత్వమునకు ఎట్టి లోపమూ రాదా? అని అడుగగా దానికి బదులు ఇచ్చుచున్నారు.

చూర్ణిక
ఇన్ద వుట్పొరుళ్ కత్తుణర్ న్దు మేలైత్తలై మఴైయోరాకాతారై అయల్ శతు ప్పేతిమాఴెన్ఴు ఉత్పత్తి నిరూపిక్కుమ్

సంక్షిప్త వివరణ
వేద సారమును అధ్యయనము చేయనివారు అనగా ద్రావిడ వేదము యొక్క అర్ధాలను ఆచార్యుల ద్వారా అధ్యయనము చేయకుండా మరియు ఉత్కృష్ఠమైన వేదాంతులు కాని వారి జన్మము బట్టి వారు అట్టి వేదమునకు పరాయి వారే అవుతారు.

వ్యాఖ్యానము
అనగా – ఉపనిషత్తుల యొక్క రహస్యార్ధములుగా చెప్పబడు ద్రావిడ వేదమును తప్పనిసరిగా ఒకరు అధ్యయనము చేయవలెను. కణ్ణిణుమ్ సిఱుత్తాంబు 9 “మిక్క వేదియర్ వేదత్తిన్ వుత్పొరుళ్”(ఉత్కృష్ఠమైన వైదికులు అధ్యయనము చేసినట్టు వేదము యొక్క సారము) ఆచార్య ఉపదేశముగా అభ్యసించి ముదల్ తిరువందాది 66 “కత్తుణర్ న్ద మేరైత్ తలైయఴైయోర్”(వేదమందు గొప్ప నేర్పును కలిగిన వైదికులు)లో చెప్పినట్టు గొప్ప వేదాంతులు కావలెను. ఆలా అభ్యసించకుండా ఉత్కృష్ఠమైన వేదాంతులు కాని వారు తిరుమాలై 39 “అయల్ సదుప్పేదిమార్”(నాలుగు వేదములను అభ్యసించు వైదికుల కంటే భిన్నులైన వారు). అది ఎందుకు అనగా వేదాభ్యాసానికి ముఖ్య ప్రయోజనమైన ఈశ్వరుని కైంకర్యమే స్వరూపానికి సరిపడు పురుషార్ధమని తెలుసుకొనుట, అట్టి జ్ఞానము లేని యెడల వారు నాలుగు వేదములను అభ్యసించినప్పటికీ వాటితో సంబంధము లేని వారిగానే పరిగణింపబడుదురు. ఈ కారణము చేత అటువంటి వారి జన్మము బట్టి వారిని బ్రాహ్మణులుగా పరిగణించడము కుదరదు. పద్మ పురాణము “విష్ణు భక్తి విహీనోయఃస్వశాస్త్రార్ధ వేద్యాపిః బ్రహ్మణ్యమ్ తస్య త భవేత్ తస్యోతిపత్తి ర్నిరూప్యతామ్”(ఒకడికి వేద శాస్త్రము బాగా తెలిసినప్పటికీ విష్ణు భక్తి లేనిచో వాడు బ్రాహ్మణుడిగా పిలువబడడు. వాడి జన్మ విశ్లేషించబడవలెను). అది కాక “యః పుత్రః పితరమ్ ద్వేషితమ్ విద్యాతన్య రేతసం యో విష్ణుం సతతమ్ ద్వేషితం విద్యాత్ అంత్యరేతసం”(తండ్రిని ద్వేషించు కొడుకును ఆ తండ్రికి కాక వేరొకరి ద్వారా పుట్టిన వాడిగా తెలుసుకొనవలెను; విష్ణువును ద్వేషించు వాడిని చండాలునికి పుట్టిన వాడిగా తెలుసుకొనవలెను).

చూర్ణిక 26 ” కర్మ కైంకర్యంగళ్ ….” మొదలుకొని ఇక్కడ వరకు ఈ క్రింద విషయములు వివరింపబడినవి.

– కర్మము మరియు కైంకర్యములు వేటికి తగినవో
– కర్మము, కైంకర్యమందు ప్రేరేపించు విషయములు ఏవి అట్టి వాటికి ఆశ్రయములు, లక్ష్యములు ఏమిటి?
– కర్మము సాధారణము, కైంకర్యము విశిష్ఠమగు విషయము
– విశిష్ఠమైన కైంకర్యము యందు నిమగ్నమైనప్పుడు సాధారణ విషయమగు కర్మము విడిచిపోవును
– కర్మ నిష్ఠులకు కైంకర్య నిష్ఠులకు సంబంధము పొసగదు
– దానికి కారణము – వారి జన్మమును చెప్పు ప్రధాన పూర్వులు వేరగుట చేత
– వీరికి బ్రాహ్మణత్వము, వైష్ణవత్వము కలుగుటకు గల కారణములు
– ద్రావిడ వేదార్ధము యందు జ్ఞానము లోపించుట చేత వారు అధ్యయనము చేసిన వేదముతో సంబంధమును కోల్పోయి అల్ప బుద్ధి వారగును.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-38-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment