అవతారిక
ఇక మీద తిరువాయిమొళిని వేదముగా చూపించదలచి తిరువాయిమొళి 10.9.11 “సన్దజ్గళ్ ఆయిరమ్”(భిన్నమైన ఛందస్సు కలిగిన వేయి పాశురములు)అని చెప్పినట్టు మొదట అట్టి ద్రావిడ వేదము ఉన్నదా అన్న సందేహమును నివృత్తి చేయుచున్నారు.
చూర్ణిక
ఎవ్వులకత్తెవ్వవైయుమ్ ఎన్గైయాలే వేదమ్ బహువిధమ్
సంక్షిప్త వివరణ
తిరువాయిమొళి 3.1.6 “ఓదువార్ ఒత్తెల్లామ్ ఎవ్వులగత్తు ఎవ్వెవైయుమ్(ఋగ్, యజుర్, సామ మొదలగు బేధములను కలిగి ఉన్న వేదములు ఆ శాఖలకు చెందిన అధికారుల చేత అధ్యయనము చేయు భేదమును బట్టి లోకములో ఉన్న బేధములను బట్టి వేదము అనేకము) అని చెప్పినట్టు వేదము అనేక విధములు.
వ్యాఖ్యానము
అనగా – తిరువాయిమొళి 3.1.6 “ఎవ్వులగత్తు ఎవ్వెవైయుమ్” (అన్ని లోకములలో కలది)లో చెప్పినట్టు వేదాధ్యయనము చేయు అధికారులను బట్టి మరియు లోకములను బట్టి వేదము బహు విధములు. అందుచేత ఈ ద్రావిడ వేదము కూడా అందులో ఒక విధమైనది.
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-39-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org