ఆచార్య హ్రుదయం – 40

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 39

అవతారిక
“సరే వేదములో వివిధ శాఖలు/విధములు ఉండవచ్చును. కానీ అవి అన్నీ ఒకే భాషలో ఉండవద్దా? సంస్కృతము మరియు ద్రావిడము(తమిళము) భిన్నమైన భాషలు కదా? అని అడిగితే దానికి నాయనార్లు సమాధానము ఇచ్చుచున్నారు.

చూర్ణిక
ఇతిల్ సంస్కృతమ్ ద్రావిడమెన్గిఴ పిరివు ఋగాదిభేదమ్బోలే

సంక్షిప్త వివరణ
ఎలా అయితే వేదములో ఋగ్, యజుర్, సామ, అధర్వణ అను శాఖలు ఉన్నాయో అలానే సంస్కృత వేదము మరియు ద్రావిడ వేదము అను విభాగములు కలవు.

వ్యాఖ్యానము
అనగా – ఈ విధముగా వేదములో అనేక విధములు కలవో, సంస్కృత వేదము మరియు ద్రావిడ వేదము అను విభాగము సంస్కృత వేదములో గల ఋగ్, యజుర్, సామ, అధర్వణ విభాగముల వలెనే. ఈ రీతిలో వేదము ఒక్కటే అయినా సంస్కృత భాషలోనే ఋగ్ మొదలగు విభాగములు కలిగినట్లు భాషా భేదమును ఆధారముగా చేసుకొని ఈ విధమైన విభాగములు కలిగి ఉన్నవి.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-40-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment