అవతారిక
వేదమునకు అంగములు, ఉపాంగములు కలవు మరి తిరువాయిమొళికి అలాంటివి ఏవైనా ఉన్నాయా? అని అడిగితే దానికి సమాధానమును ఇక్కడ వివరించుచున్నారు.
చూర్ణిక
వేదచతుష్టయ అజ్గోపాజ్గజ్గళ్ పతినాలుమ్బోలే ఇన్నాలుక్కుమ్ ఇరున్దమిళ్ నూల్పులవర్ పనువలాఴుమ్ మత్తై యెణ్మర్ నన్మాలైకలుమ్
సంక్షిప్త వివరణ
ఎలా అయితే నాలుగు వేదములకు మొత్తం పదునాలుగు(14) అంగములు మరియు ఉపాంగములు కలవో అలానే ఈ నాలుగింటికి (తిరువిరుత్తం, తిరువాశిరియం, తిరువాయిమొళి, పెఱియ తిరువందాది)లకు ఇరున్దమిళ్ నూల్ పులవర్(గొప్ప ద్రావిడ భాష కవివర్యులు అయిన తిరుమంగై ఆళ్వార్) ల ఆరు(6) ప్రబంధములు మరియు తక్కిన ఎనిమిది(8) ఆళ్వార్ల యొక్క విలక్షణమైన ప్రబంధ మాలికలు కలవు.
వ్యాఖ్యానము
అది ఏమి అనగా – నాలుగు వేదములు అయిన ఋగ్, యజుర్, సామ, అధర్వణ లకు శిక్షా, వ్యాకరణము, నిరుక్తి , ఛందస్సు, కల్ప మరియు జ్యోతిష్యము అను ఆరు అంగములు మరియు మీమాంస, న్యాయ. పురాణ, ధర్మ శాస్త్ర మొదలగు ఉపాంగములు కలవు.
(గమనిక: ఆయుర్వేదము, ధనుర్వేదము, గంధర్వవేదము, శిల్ప/అర్ధ శాస్త్రము ఉపవేదముల క్రింద విభాగము చేయబడి విద్యా స్థానములలో చేర్చబడి ఉన్నవి).
అదే విధముగా ఈ నాలుగు ద్రావిడ వేదముల(తిరువిరుత్తం, తిరువాశిరియం, తిరువాయిమొళి, పెఱియ తిరువందాది)కు తిరుమంగై ఆళ్వార్ల చే ఆనతి ఇచ్చిన విధముగా శాస్త్ర రూపకముగా ప్రబంధములు కలవు. పెఱియ తిరుమొళి 2.4.10 “కలియన్ వాయోలి సెయ్ ద పనువల్”(పూమాలికలు వంటి ఈ తమిళ పాశురములను స్వరముతో కూర్చి కృప చేసిన తిరుమంగై ఆళ్వార్లు). ఎవ్వరికీ శక్యము కానిది తిరుమంగై ఆళ్వార్లు ద్రావిడ వేదములను సంపూర్ణముగా దర్శించారు. పెఱియ తిరుమొళి 1.7.10 “ఇరున్దమిళ్ నూల్ పలవర్ మంగైయాలన్” (తిరుమంగై ఆళ్వార్లు విలక్షణమైన తమిళ శాస్త్రమందు గొప్ప విద్వాంసులు మరియు తిరుమంగై అను ప్రాంతమునకు రాజు). నాలుగు ద్రావిడ వేదములకు తక్కిన ఎనిమిది మంది ఆళ్వార్లచే గానము చేయబడిన విలక్షణమైన ప్రబంధములు కలవు. నాయనార్లు “నన్మాలైగళ్” అని చెప్పుటకు గల కారణము చక్కదనము కలిగి ఉన్న ముదలాళ్వార్ల ప్రబంధము ముదల్ తిరువందాది 57 “నయ నిన్ఴ నన్మాలై” (అందమైన మాలికా రూపముగల శాస్త్రములు) అన్ని ప్రబంధములకు పొసగును అని తెలుపుట కొరకు.
ఈ క్రింద ఉండు సామ్యము చేత తిరుమంగై ఆళ్వార్ల ప్రబంధములను నమ్మాళ్వార్ల ప్రబంధములకు అంగములుగా గుర్తించడమైనది. అవి ఏమి అనగా
– ఎలా అయితే మొట్ట మొదట నమ్మాళ్వార్లు యాధృచ్ఛికమైన దోషములను చెప్పారో అనగా తిరువిరుత్తం 1 “పొయ్నిన్ఴ జ్ఞానమ్” (అసత్యమైన జ్ఞానము) అలానే తిరుమంగై ఆళ్వార్లు కూడా మొట్ట మొదట దుఃఖముతో యాధృచ్ఛికమైన దోషములను పలికితిరి.
– పెఱియ తిరుమొళి 1.1.1 “వాడినేన్ వాడి” (నేను ఎంతో దుఃఖ పడ్డాను)
– భగవానుని పట్ల వల్లమాలిన ప్రేమ
– అందునా, అర్చావతారము పట్ల అత్యంత ప్రావణ్యమును కలిగి ఉండుట
– కలసి ఉండుట మరియు వియోగము చెందుట ఒక దాని తరువాత ఒకటి కలిగి ఉండుట
– వేరొకరి ఉపదేశముగ మాట్లాడుట
– అందునా, రాత్రి పూట దుఃఖము కలుగుట, దూతను పంపుట, భగవానుని అనుకరించుట మొదలగు, మడల్ చేయుట, స్నేహితురాలు, తల్లి, నాయిక వంటి స్థితులు కలిగి ఉండుట.
– ఇంద్రియముల వలన భయపడుట
– సర్వేశ్వరుని నిరంకుశ స్వాతంత్య్రము వలన భయపడుట
– ప్రపత్తిని పలు మార్లు చేయుట
– భరించలేని ఖేదము
– ఇతరుల బాధలను చూసి సహించలేకుండుట, పదే పదే ఇతరులకు ఉపదేశము చేయుట(హితము పలుకుట)
తక్కిన ఆళ్వార్ల ప్రబంధములు కూడా నమ్మాళ్వార్లు అనుగ్రహించిన ప్రబంధముల అర్ధములకు సరితూగుతూ మరియు వీటి అర్ధములను నిర్ణయించుటలో అనుకూలముగా ఉండడము చేత వాటిని వీటికి ఉపాంగములుగా తెలియబడుచున్నవి.
అందుచేత శ్రీ రంగరాజ స్తవము 2.18 “శీక్షాయాం వరిణ శిక్షా పద సమధిగమో వ్యాక్రియా నిర్వచోభ్యామ్ ఛందః ఛందః చితౌస్యాత్ గమయతి సమయం జ్యోతిషం రంగనాధ కల్పేనుష్ఠానముక్తమ్ హ్యుచిత గమితయోర్ న్యాయ మీమాంసయోస్యాత్ అర్థవ్యక్తిః పురాణ స్మృతిషు తదనుగస్త్వాం విచిన్వన్తి వేదాః” (ఓ శ్రీ రంగనాధ! వేదాంగమయిన శీక్షా లో వేదాక్షరములను ఎలా ఉచ్చరించాలో చెప్పబడినది. వ్యాకరణము మరియు నిరుక్తములో పదముల గురుంచి చెప్పబడినది. ఛందస్సులో గాయత్రి ఛందస్సు మొదలగు వాటి వ్యాకరణము చెప్పబడినది. ఏ కాలములో ఏ కర్మలను ఆచరించాలో జ్యోతిష్యములో చెప్పబడినది. కల్ప సూత్రములలో ఏమి ఆచరించాలో చెప్పబడినది. తర్కము మరియు మీమాంసలో సరియైన అర్ధములను చెప్పబడినవి. పురాణములు మరియు స్మృతిలలో వివరణ ఉదాహరణములతో చెప్పబడినది. అట్టి అంగములను కలిగిన వేదము నిన్ను అనుసరించుచున్నది. ఎలా అయితే అంగములు మరియు ఉపాంగములు వేదములకు ఉపకారకముగా ఉండునో అలానే తక్కిన ఆళ్వార్ల ప్రబంధములు ఈ నాలుగు ద్రావిడ వేదములకు ఉపకారకములుగా ఉండును.
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-43-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org