అవతారిక
శాస్త్రము అగుట చేత, భగవానుని ఆజ్ఞ అగుట చేత, ఎటువంటి దోషములను కలుగనిది అగుట చేత, శృతి అగుట చేత సత్యమైనది మరియు అనాది ఇత్యాది వైభవములను కలిగిన వేదము వలే నమ్మాళ్వార్ల ప్రబంధములకు కూడా ఇట్టి వైభవము కలదా అని అడుగగా దానికి సమాధానముగా నాయనార్లు ఈ చూర్ణికలో వివరించుచున్నారు.
చూర్ణిక
వేదనూల్ ఇరుందమిళ్ నూల్ ఆజ్ఞై ఆళై వశైయిల్ ఏతమిల్ శురుతిశెవిక్కినియ ఓతుకిన్ఱ తుణ్మై పొయ్యిల్ పాడల్ పణ్డై నిఱ్కుమ్ మున్దై అఱివిల్లా ఎన్ఱుమ్ లక్షణఙ్గళొక్కుమ్
సంక్షిప్త వివరణ
వ్యాఖ్యానములో తెలుపబడు వాక్యముల చేత వేదములకు ఎటువంటి వైభవము కలదో నమ్మాళ్వారుల ప్రబంధములకు కూడా అట్టి వైభవము కలదని తెలుస్తున్నది.
వ్యాఖ్యానము
అనగా —
— ఎలా అయితే వేదము ఎటువంటిదో తిరుమాలై 3 “వేద నూల్” (శాస్త్రము వేదముగా పిలువబడినది), ఈ తిరువాయిమొళి కూడా పెరియ తిరుమొళి 1.7.10 “ఇరున్దమిళ్ నూల్” అని చెప్పినట్టు గొప్ప తమిళ శాస్త్రము.
— ఎలా అయితే వేదము ఎటువంటిదో శ్రీ పాంచరాత్రము “శృతిః స్మృతిః మమైవాఙ్ఞా”(శృతి మరియు స్మృతి నా ఆజ్ఞలు) లో చెప్పినట్టు ఇవి భగవానుని ఆజ్ఞ, ఈ తిరువాయిమొళి కూడా తిరువాయిమొళి 6.3.11 “ఆణై ఆయిరమ్” లో చెప్పినట్టు భగవానుని ఆఙ్ఞయే
— ఎలా అయితే వేదము ఎటువంటిదో పెరియ తిరుమొళి 5.3.2 “వాసైయిల్ నాన్మఱై” లో చెప్పినట్టు నాలుగు వేదములు విప్రలంబ మొదలగు దోషములు లేనిది. ఇది కూడా తిరువాయిమొళి 1.6.11 “ఏదమిళ్ ఆయిరమ్” లో చెప్పినట్టు తిరువాయిమొళి లో ఎట్టి దోషములూ లేవు.
— ఎలా అయితే వేదము ఎటువంటిదో తిరువాయిమొళి 1.1.7 “సుడర్ మిగు సురుది” (గొప్ప ప్రకాశమును కలిగిన శృతి) లో మరియు “శ్రూయతే ఇతిశృతిః” (వినదగినది అగుట చేత దీనిని శృతి అందురు) అని చెప్పినట్టు పూర్వాచార్యులే ఉఛ్చరించిన రీతిలో వేదములు వినదగినవి అలానే ఇది కూడా వినడానికి ఆహ్లాదకరముగా తీయగా ఉండును. తిరువాయిమొళి 10.6.11 “సేవిక్కినియ సెంజొల్లే” (మధురమైన పదములను కలిగి వినడానికి చెవులకు ఎంతో తీయగా ఉండును).
— ఎలా అయితే వేదము ఎటువంటిదో తిరుచ్ఛంద విరుత్తమ్ 72 “వేదనూల్ ఓదిగన్ఱాదు ఉణ్మై” (వేదములో ఏది అయితే చెప్పబడినదో అది సత్యము) లో చెప్పినట్టు వేదములో ఎక్కడా అసత్యము లేదు. ఇది కూడా తిరువాయిమొళి 4.3.11 “పొయ్యిల్ పాడల్” లో చెప్పినట్టు చిన్న అసత్య వాసనను కూడా దరికి చేరనీయనిది(ఉపేక్షించనిది).
— ఎలా అయితే వేదము ఆది అంతము లేనటువంటిదో పెరియ తిరుమొళి 5.7.1 “పణ్డై నాన్మఱై”(అనాది, నాలుగు వేదములు) మరియు తిరువాయిమొళి 6.5.4 “నిఱ్కుమ్ నాన్మఱై” (ఎప్పటికీ ఉండు నాలుగు వేదములు) అని చెప్పినట్టు ఇది కూడా ఆది అంతము లేనిదై తిరువాయిమొళి 6.5.11 “మునై ఆయిరమ్” (అనాది అయినా వేయి పాశురములు) మరియు తిరువాయిమొళి 9.7.1 “అళివిల్లా ఆయిరమ్” (అనుభవించు వారి మనసులను విడువనివైన వేయి పాశురములు).
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-45-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org