ఆచార్య హ్రుదయం – 46

ఆచార్యహ్రుదయం

<< చూర్ణిక – 45

అవతారిక 
కానీ వేదములాగా ఇవి (ఆళ్వార్ల ప్రబంధములు) కూడా ఎవరిచేతా రచించబడనివి కావలెను కదా? దీనిని ఆళ్వార్లు చెప్పడం చేత నిత్యత్వము(అనాది) మరియు అపౌరుషేయత్వం(ఎవరి చేత రచించబడనివి) అనేవి వర్తించవు కదా అని అడుగగా దానికి నాయనార్లు వివరించుచున్నారు.

చూర్ణిక
శొల్లప్పట్ట ఎన్ఱతిల్ కర్తృత్వమ్ స్మృతియత్తై స్వయమ్బూపడైత్తాన్ ఎన్ఱతుపోలే

సంక్షిప్త వివరణ
తిరువాయిమొళికి కర్తృత్వము తిరువాయిమొళి 8.10.11 “సొల్లప్పట్ట” (పలుకబడిన/చెప్పబడిన) అని చెప్పినట్టు బ్రహ్మ వేదమునకు కర్త అని చెప్పడం వంటిదే.

వ్యాఖ్యానము
అనగా — ఆళ్వార్లకు గల కర్తృత్వము తిరువాయిమొళి 8.10.11 “సడగోపన్ శొల్లప్పట్ట ఆయిరమ్” (శఠకోపులు అయిన నమ్మాళ్వార్లచే పలుకబడిన వేయి పాశురములు) లో చెప్పినట్టు స్మృతి “అనాది నిదనా హ్యేషా వాగుత్సృష్టా స్వయంభువా” (ఆది, అంతము లేని వేద వాక్యాలు బ్రహ్మచే రచింపబడ్డాయి) బ్రహ్మచే వేదము సృష్టించబడినది వంటిదే. నాయనార్లు “స్వయమ్భూ సృష్టిత్తాన్” కి బదులుగా “స్వయమ్భూ పడైత్తాన్” అని చెప్పుటకు గల కారణము ఆళ్వార్ల దివ్య వచనములను బయలుపరచుటకు, పెరియ తిరుమడల్ “మున్నమ్ తిసై ముగనైత్తాన్ పడైక్క – మత్తవనుమ్ మున్నమ్ పడైత్తనన్ నాన్మఱైగళ్” (సృష్టి సమయమున బ్రహ్మను తాను (ఎంపెరుమాను) సృష్టించినట్టు, ఆ బ్రహ్మ కూడా నాలుగు వేదములను పొందినాడు(ఆ పరమాత్మ నుంచి)). ఎలా అయితే ఎప్పటికీ ఉన్న వేదరాశి బ్రహ్మ నోటి నుంచి వచ్చిన కారణము చేత బ్రహ్మకి కర్తృత్వము ఆపాదించబడినదో అలానే (అదే రీతిలో) తిరువాయిమొళిలోనే చెప్పినట్లు ఆళ్వార్ల కర్తృత్వము అటువంటిదే. దీని వలన నిత్యత్వమునకు, అపౌరుషేయత్వమునకు ఎట్టి విఘాతమూ లేదు. 

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-46-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment