అవతారిక
ఆళ్వార్లు ఇది వరకే ఉన్న పాశురములను దర్శించి వాటిని ప్రకాశింపచేశారు అని ఇక్కడ నాయనార్లు చెప్పుచున్నారు.
చూర్ణిక
నాల్ వేదమ్ కణ్డ పురాణఋషి మంత్రదర్శికళైప్పోలే ఇవరైయుమ్ ఋషి-ముని-కవి యెన్నుమ్
సంక్షిప్త వివరణ
ఎవరైతే నాలుగు వేదములను, పురాణములను మరియు మంత్రములను దర్శించారో వారిని ఎలా అయితే ఋషి, ముని మరియు కవి అని చెప్పబడ్డారో అలానే ఆళ్వార్లు కూడా అలానే పిలువబడుతారు.
వ్యాఖ్యానము
అనగా నాల్ వేదమ్ కణ్డ పురాణఋషిపెరియ తిరుమొళి 8.10.1 “నాల్ వేదమ్ కణ్డానే” (నాలుగు వేదములను దర్శించినవారు)లో చెప్పినట్టు ఎలా అయితే ఈశ్వరుడు మొట్టమొదట తాను దర్శించాడో, వేద వ్యాసుడు కూడా నాలుగు వేదములను మరియు అష్టాదశ పురాణములను ఒక క్రమములో దర్శించాడు. “అష్టాదశా పురాణామ్ కర్తా సత్యవతీ సుతః” అని చెప్పినట్టు (సత్యవతీ పుత్రుడు అయిన వ్యాసుడు అష్టాదశ పురాణములను రచించాడు), అట్టి వేదవ్యాసుని గూర్చి ఇక్కడ చెప్పుచున్నారు. “నాల్ వేదమ్ కణ్డాన్” లో ఎమ్బెరుమానుడు తనంతట తానుగా కాకుండా వ్యాసుని రూపములో తానే నాలుగు వేదములను దర్శించి ఉండవచ్చును అని నాయనార్ల మరొక భావము. వ్యాసుడే సాక్షాత్తు భగవానుడు అని భగవానుని ఆవేశ అంశముగా “సంకీర్ణ బుధ్ధమో దేవాః బ్రహ్మ రుద్ర పురస్సరాః| శరణ్యం వరణం జగ్ముః నారాయణమనామయం| తైర్వి జ్ఞాపిత కార్యస్తు భగవాన్ పురుషోత్తమః అవతీర్ణో మహాయోగీ సత్యవత్యామ్ పరాశరాత్” (ఎట్టి దోషములూ లేని మరియు సర్వలోక శరణ్యుడు అయిన శ్రీమన్నారాయణుని శరణు కోరిన బ్రహ్మ, శివ మొదలగు దేవతలు, వారి మొరలను ఆలకించిన అట్టి పురుషోత్తముడు గొప్ప ఋషిగా పరాశర మరియు సత్యవతులకు కుమారుడిగా అవతరించెను) మరియు మహాభారతము “కృష్ణ ద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణమ్ ప్రభుమ్” (కృష్ణద్వైపాయనుడుగా పిలువబడు వ్యాసుడిని సాక్షాత్తూ నారాయణునిగా తెలుసుకొనుము). అట్టి వేదవ్యాస భగవానుడు వేదములను పూర్వము ఉన్న క్రమములోనే దర్శించి బయలుపరచెను. “దర్శనాత్ ఋషిః” అను అర్థమును బట్టి (ఎవరు అయితే దర్శిస్తారో అతను ఋషి) మనన శీలః మునిః (ఎవరు ధ్యానిస్తారో అట్టివారు ముని) మరియు కవిః క్రాంతి దర్శీ (కవి అనువాడు కొత్త వాటిని చూస్తాడు) అతను ఋషి, ముని మరియు కవిగా చెప్పబడ్డాడు. మహాభారతము “శ్రూయతామ్ సింహనాతోయం ఋషేస్తస్య మహాత్మనః ధర్మే ఛార్తే చ కామే చ మోక్షే చ భరతర్షభ” (ఓ జనమేజయా! ధర్మ, అర్థ, కామ, మోక్ష విషయములలో సింహగర్జన వంటి వేదవ్యాసుని మాటలను వినుము). మహాభారతం “ఏవం విధం భారతం తు ప్రోక్తం యేన మహాత్మనా| సాయం నారాయణ స్సాక్షాత్ వ్యాసరూపీ మహామునీ”(ఎట్టి మహాత్మునిచే మహాభారతము చెప్పబడిందో అట్టి వ్యాసుడు అట్టి గొప్ప ముని) మరియు మహాభారతం “సాక్షాల్లోకాత్ భావయమానః కవి ముఖ్యః పారాశర్యః (ఈ లోకమును ఉద్ధరించు కవులయందు మొట్టమొదటి వారైన వ్యాసులు). మంత్రములను దర్శించిన వారు వేదములో చెప్పినట్టు “నమ రిషిభ్యో మంత్ర కృత్భ్యః”(మంత్రమును దర్శించిన అట్టి ఋషులకు నమస్సులు), “భగవాన్ శౌనక మునిః (భగవానుడు అయిన శౌనక ముని) ఇంతకు పూర్వమే ఉన్నదానిని వారు దర్శించి వారు లోకానికి చెప్పిరి అని అర్ధము. వీరి విషయమున కవి అని ప్రయోగించి ఉంటే అవి (ఆ సూచనలను) ఎక్కడ ప్రయోగించారో చూడండి.
అందుచేత ఈ విధముగా వీరిని గురించి చెప్పిన విధముగా, పూర్వము ఉండు ద్రావిడ పాశురములను దర్శించిన ఆళ్వార్ కూడా ఋషి, ముని మరియు కవి అని, ఉన్న వాటిని దర్శించి చెప్పడం చేత చెప్పబడినది. శ్రీ రంగరాజ స్తవం 1.6 “ఋషింజుషామహే కృష్ణాతృష్ణా తత్త్వ మీవోదితం | సహస్ర శాఖాం యోద్రాక్షీత్ ద్రావిడీం బ్రహ్మ సంహితా౦ | | “(ఆ పురుషోత్తముని గురించి వేయి పాశురములు గల తిరువాయిమొళి అను ఉపనిషత్తును తెలిసిన కృష్ణునియందు కోరిక పూర్తిగా కలిగి అవతరించిన అట్టి ఋషిని అర్చిస్తున్నాను), పరాంకుశ అష్టకము “శఠకోప మునిమ్ వందే శఠానామ్ బుద్ధిదూషకమ్| అజ్ఞానం జ్ఞాన జనకం తింత్రిణీ మూల సంశ్రయం| (శఠుల యొక్క దుష్టబుద్ధిని పోగొట్టువారును, జ్ఞాన హీనులకు జ్ఞానమును కలుగజేయువారును చింతచెట్టు కింద వేంచేసియుండువారును శఠకోపులు అనబడు మునిని అర్చిస్తున్నాను) మరియు తిరువాయిమొళి 3.9.10 “ఉలగం పడైత్తాన్ కవి ఆయినేఱ్కు”(జగత్తును సృజించిన సర్వేశ్వరునకు కవి అయిన).
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-47-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org