ఆచార్య హ్రుదయం – 48

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 47

అవతారిక 

ఇంకా ఆళ్వార్ల ప్రబంధమునకు అనాదిత్వమును తెలుపు విషయమును నాయనార్లు చూపించుచున్నారు.

చూర్ణిక 

“పడైత్తాన్ కవి ఎన్ఱ పోది ఇదువుమ్ యథాపూర్వ కల్పనమామే”    

సంక్షిప్త వివరణ 

ఎలా అయితే తిరువాయిమొళి 3.9.10 “పడైత్తాన్ కవి”(జగమును సృజించిన వాడైన ఎన్బెరుమానుని కవి అయిన నేను(ఆళ్వారు)) చెప్పినట్టు ఇది(ఆళ్వార్ల ప్రబంధములు) కూడా పూర్వము ఉన్నదియున్నట్టుగానే సృజింపబడినదే

వ్యాఖ్యానము 

అనగా – ఆళ్వారు “ఉలగమ్ పడైత్తాన్ కవి”(జగత్తును సృజించిన వాడైన ఎమ్బెరుమానుని కవి అయిన నేను(ఆళ్వారు)) అని చెప్పినట్టు అదే పాశురములో సూచించబడు “ఒన్ఱి ఒన్ఱి ఉలగమ్ పడైత్తాన్” ఈ జగత్తును సృజించు ఎమ్బెరుమాను, తైత్తిరీయ ఉపనిషత్తు “సూర్యా చంద్రమసౌ ధాతా యధా పూర్వమ్ అకల్పయత్”(చతుర్ముఖ బ్రహ్మ సూర్య చంద్రులను పూర్వమున్నట్లు సృజించెను) అన్నట్లు ఈ ప్రబంధము సృష్టితో కూడా పూర్వముండియున్నట్టిదిగానే పరంపరగా వచ్చినదని తోచుట.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-48-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment