ఆచార్య హ్రుదయం – 57

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 56

చూర్ణిక – 57

అవతారిక
వారు(పురాణ, ఇతిహాస గ్రంథకర్తలు) ఋషులచే అనుగ్రహించబడినారు అని స్వయముగా వారి వాక్కులచే శ్రీ రామాయణము బాల కాండము 2.30 “మచ్ఛన్దాదేవ” (ఓ వాల్మీకి, ఓ బ్రాహ్మణ! నీ ఈ వాక్కులు న ఇచ్ఛ వలననే వచ్చాయి) అనియు శ్రీ విష్ణు పురాణము 1.1.25 “పురాణ సంహితా కర్తా”(నీవు పురాణములను మరియు సంహితములను రచించబోవుచున్నావు) అని చెప్పినట్టు అదే విధముగా నమ్మాళ్వార్ల ప్రబంధములకు మూలము భగవదనుగ్రహమే అని ఆళ్వారు తమంతట తామే చెప్పియున్నారా? అని అడిగితే దానికి సమాధానమును నాయనార్లు ఇక్కడ చెప్పుచున్నారు.

చూర్ణిక
కరువుళ్ వేఴలామై అరనయనెన చ్చెయ్యుమవై పోలే మూవురు వామతల్వన్ తుప్పరవాలే పరమకవికళాయ్ పాడువియాతు నేర్ పడచ్చొల్లుమ్ నీర్మైయిలా ఎన్నైతన్నాక్కి ఎన్ నాముతల్ వన్దుపుకున్దు తప్పుతలఴ త్తన్నై వైకున్దనాక త్తన్ శొల్లాల్ తానే తుడిత్తు మలక్కు నావియిల్ మొయ్యశొల్లార్ శొల్లవల్లే నెన్ఴు నానుమ్ శొల్లి నాడుమ్ కైయెడుక్కుమ్బడి ఎన్శొల్లాల్ యాన్శొన్ఴ ఇన్ కవి ఎన్బిత్తాన్ ఎన్ఴారిఴే

సంక్షిప్త వివరణ
బ్రహ్మ, రుద్రులలో అంతర్యామిగా ఎమ్పెరుమానుడే ఉండి సృష్ఠి, సంహారము వారి సొంతముగానే చేసినారు అని అందరిని ఎలా అయితే నమ్మించాడో అదే విధముగా గొప్ప స్వామి అయ్యి తన సామర్ధ్యముతోనే నాలో ప్రవేశించి తన కీర్తిని ప్రకాశింపజేయుటకు నాతో ఈ ప్రబంధములను పలికించినాడు. ఏ అర్హతా లేని నాలో వేంచేసి ఉండి ఈ సంసారములోని వారి చేత తమ చేతులను ఎత్తించి అంజలి ముద్రతో నా పట్ల కృతజ్ఞతా భావముతో ఉండేట్టు చేసినాడు అని ఆళ్వారే చెప్పి యున్నారు.

వ్యాఖ్యానము

కరవుళ్ వేరలామై…
అనగా విష్ణు ధర్మము 69.50 “సృష్ఠింతతః కరిష్యామి త్వామావిశ్య ప్రజాపతే” (ఓ బ్రహ్మా! నేను నీలో ప్రవేశించి సృష్టిని చేసెదెను) అనియు “కల్పాంతే రుద్రరూపీ యో గ్రసతే సకలం జగత్” (కల్పాంతమున రుద్రుని రూపములో సమస్తమునూ ఉపసంహరించువాడు) అనియు మహాభారతము కర్ణ పర్వము “విష్ణురాత్మా భగవతో భావస్వామిత తేజసః”(గొప్ప తేజస్సును కలిగి ఉన్న రుద్రునకు విష్ణువు అంతర్యామి) అనియు తిరువాయిమొళి 5.10.8 “తిశైముగన్ కరువుళ్ వీత్తిరిన్దు పడైత్తిట్ట కరుమంగళుమ్” (అట్టి చత్రుముఖ బ్రహ్మ లోపల ఉండి నీవు ఎలా సృష్ఠి చేసావు?) అనియు త్రియువాయిమొళి 5.10.4 “వెళ్ళనీర్ చ్చడైయానుమ్ నిన్నిడై వేఴలామై విళఙ్గ నిన్ఴదుమ్”(గంగను తన జడలలో ఉంచుకున్న రుద్రుడు నీకు శరీరముగా వేరుగా ఉండక అనునది శాస్త్రము ద్వారా స్పష్టముగా తెలుస్తున్నది) అన్నట్టు చతుర్ముఖ బ్రహ్మ, రుద్రునికి అంతరాత్మగా ఉంటూ సృష్ఠి, సంహారాదులను చేయించినట్టు ఈ సంసారములోని జనులను బ్రహ్మ రుద్రాదుల చేతనే సృష్ఠి, సంహారాదులు, వేదమును చెప్పుట మొదలగు పనులు జరిగాయని నమ్మించినట్టు తిరువాయిమొళి 1.1.8 “అరణయ నెనవుళకలిత్త మైత్తుళనే”(సమస్తమును ఉపసంహరించుట, సృష్ఠిని తిరిగి ఆరంభించుట, దేవతలకు జ్ఞానమును ప్రసాదించుట అనునవి ఆయా దేవతా మూర్తులు అయిన బ్రహ్మ, రుద్ర  మొదలగు వారిలో అంతర్యామిగా ఉండి చేయుట)

మూవురువా ముదల్వన్
అలానే తన కార్యములను తనకు తానే చేయునప్పుడు తిరువాయిమొళి 7.9.2 “మూ ఉరువాయ్ ముదల్వనే” (మూడు రూపములు కలిగిన కారణభూతుడైన ఒక్కడు) అని చెప్పినట్టు కారణభూతుడు అయినట్లు బ్రహ్మ రుద్రాదులకు కూడా తానే కారణభూతుడై వారిని తన శరీరముగా కలిగి ఉండి సృష్ఠి మొదలగు వాటిని తానే చేసి ఆ బ్రహ్మ రుద్రాదులే స్వయముగ చేసినట్టు ప్రసిద్ధి చేయువాడు.

తుప్పరవాలే
తిరువాయిమొళి 7.9.9 “తిఴత్తుక్కే తుప్పరవాయ్”(తానూ చేయు కార్యములలో వాటికి పోలిన శక్తిని కలిగిన వాడు) అని చెప్పినట్టు తాను చేయు కార్యములను ఒక గడ్డి పోచతో కూడా సంపూర్ణము చేయునట్టి గొప్ప శక్తిని కలిగిన వాడై ఉండుట వలన.

పరమ కవిగళల్ పాడువియాదు
తిరువాయిమొళి 7.9.6 “ఇన్ కవి పాడుమ్ పరమ కవిగళాల్ తాన్ కవి తాన్ తన్నైప్పాడువియాదు”(మధురమైన కవిత్వమును చెప్పునట్టి గొప్ప కవులైన పరాశర, పారాశర(వ్యాస), వాల్మీకి మొదలగు వారి చేత తాను తన విషయమున కవిత్వమును చెప్పించుకొనక) అని చెప్పినట్టు తనని కవిత్వము ద్వారా ఒకరి చేత కీర్తింపచేయవలసినప్పుడు అందుకు అవసరమైన జ్ఞాన శక్త్యాదులకు ఎట్టి లోటు లేనివారై గొప్ప కవిత్వమును చెప్పువారైన వ్యాస, పరాశర, వాల్మీకి మరియు మధురముగా ద్రావిడమున(తమిళము) కవిత్వమును చెప్పగల ముదళ్ ఆళ్వార్లు ఉండియుండగా “శెన్దమిళ్ పాడువార్”(గొప్ప ద్రావిడ కవులు), వారితో కాకుండా

నేర్పడచ్ చొల్లుమ్ నీర్మయిలా ఎన్నైత్ తన్నాక్కి ఎన్నా ముదల్ వందు పుగందు
తిరువాయిమొళి 7.9.5 “నేర్ పడయాన్ సొల్లుమ్ నీర్మయిలా మైయిల్” (కీర్తించుటకు కావాల్సిన జ్ఞానము మొదలగు లేకుండుట) అని చెప్పినట్టు ఆయనని తగిన విధముగా కీర్తించుటకు కావలసిన జ్ఞానము నాకు లేనప్పటికీ తనలో(సర్వేశ్వరుని) ఉన్న అట్టి జ్ఞాన శక్త్యాదులను నాకు అనుగ్రహించి తిరువాయిమొళి 7.9.5 “ఏర్విలా ఎన్నైత్ తన్నాక్కి” (ఎందుకూ పనికి రాని నన్ను తనలా చేసాడు) అని చెప్పినట్టు నా కవిత్వమునకు కారణభూతుడిగా ప్రవేశించి తిరువాయిమొళి 7.9.3 “ఎన్ నా ముదల్ వందు పుగందు” (మొదట న జిహ్వమున(నాలుక) ప్రవేశించినాడు)

తప్పుదలఴాత్ తన్నై వైకుందనాగత్ తన్ సొల్లాల్ తానే తుడిత్తు
తిరువాయిమొళి 7.9.4 “ఎన్నాగియే తప్పుదలన్ఴి” (నాలో ఉండి ఎట్టి దోషము లేకుండా) అని చెప్పినట్టు నన్ను సాధనంగా చేసుకొని కవిత్వమును చెప్పునప్పుడు న దోషములు ఏవీ నీకు అంటకుండా.

తిరువాయిమొళి 7.9.7 “వైకుందనాగప్ పుగళ”(తనని శ్రీ వైకుంఠనాధునిగా నేను కీర్తించగా) అని చెప్పినట్టు నేను కీర్తించుటచే తాను శ్రీ వైకుంఠనాధుడై ఐశ్వర్యమును లభించిన వాడిగా.

తిరువాయిమొళి 7.9.2 “తన్ సొల్లాల్ తాన్ తన్నైక్ కీర్తిత్త” (తన యొక్క సూక్తులచే తనను తాను ప్రతిపాదించుకొనునట్టి) అని చెప్పినట్టు మరియు తిరువాయిమొళి 10.7.2 “తన్నైత్ తానే తుడిత్తు” (తనను తానే స్తుతించుకొని) అని చెప్పినట్టు “కవిత్వమ తనది, పాడినవాడు తానే, పడినది తన గురించియే” అన్నట్టు ఆళ్వారులో తాను అంతర్యామిగా ఉండి తనను తానే స్తుతించుకొని

మలక్కు నావియల్ మొయ్య సొల్లాల్ సొల్ల ఎన్ఴు నానుమ్ సొల్లి నాడుమ్ కైయెడుక్కుమ్బడి ఎన్ సొల్లాల్ యాన్ సొన్న ఇన్ కవి ఎన్బిత్తాన్ ఎన్ఴారిఴే
తిరువాయిమొళి 6.4.9 “వలక్కై ఆళి ఇడక్కైచ్ చంగమ్ ఇవై ఉడై మాల్ వణ్ణనై మలక్కు నావుడైయేర్కు”(కుడి చేతిలో సుదర్శనమును, ఎడమ చేతిలో పాంచజన్యమును కలిగిన వాడు మరియు నీలి వర్ణమును కలిగిన వాడైన ఎమ్పెరుమానుకు ఆనందాన్ని మరియు దిగ్భ్రాంతిని కలిగించే శక్తివంతమైన నాలుకను కలిగి ఉన్న నాకు) అని చెప్పినట్టు దేని వలననూ మార్పు చెందని భగవానునికి ఆనందమును ఇచ్చునట్టి గొప్ప శక్తివంతమైన నాలుకను కలిగిన నాకు, తిరువాయిమొళి 4.5.4 “నావియలాల్ ఇశై మాలైగళ్ ఏత్తి నణ్ణప్పేత్తన్” (నా నాలుక నుండి పాటల రూపములో వెలువడే పద సమూహములను నా నోటితో అర్పించి స్తుతించే కైంకర్యమున నిమగ్నమైనాను) అని చెప్పినట్టు నా బుద్ధి యొక్క ప్రేరణ లేకుండా కేవలము నా వాక్కులతో ఆ సర్వేశ్వరుని స్తుతించే కైంకర్యములో నిమగ్నమయ్యాను(అభినివేశమును పొందాను). తిరువాయిమొళి 4.5.2 “మొయ్య సొల్లాల్ ఇశై మాలైగళ్ ఏత్తి ఉళ్ళప్పెత్తేన్”(ఈ విశాల ప్రపంచములో వేంచేసి ఉండి ఆయన తాలూకు ఆనందాన్ని నా మనస్సులో అనుభవిస్తూ క్లేశమును కలిగించు సమస్త దుఃఖములను పటాపంచలు చేయునట్టి సర్వేశ్వరుని పూమాలికల వంటి పద సమూహములను ఒక దగ్గర చేర్చి ఆయనను స్తుతించితిని) అని చెప్పినట్టు గొప్ప శబ్దములు మరియు స్వరమును(నాదము) కలిగినటువంటి మాలికలతో ఆయన గురుంచి మననము(ఆలోచన) చేసి స్తుతించితిని.

తిరువాయిమొళి 4.5.9 “వానక్ కోనైక్ కవి సొల్ల వల్లేఴ్కు”(నిత్యసూరులచే ఆనందింపబడు గొప్పతనమును కలిగిన అట్టి సర్వేశ్వరుని పాటలతో స్తుతించ గలిగిన నాకు) అని చెప్పినట్టు ఆ శ్రీ వైకుంఠనాధుని నా కవిత్వముతో కీర్తించగలను.

నేనే పడుతున్నానని తలచి నేను చెప్పగా తిరువాయిమొళి 2.2.11 “శడగోపన్ సొల్” (శఠకోపులచే పాడబడిన పాశురములు) అని చెప్పినట్టు నేనే చెప్పినాని తలచి ఈ లోకులు నాకు అంజలిని సమర్పించునట్టు

తిరువాయిమొళి 7.9.2 “ఎన్ సొల్లాల్ యాన్ సొన్న ఇన్ కవి ఎన్బిత్తుత్”(నేనే ఈ మధురమైన కవిత్వమును చెప్పినానని ఆ సర్వేశ్వరుడు నన్ను ప్రసిద్ధపరచి) అని అన్నట్టు “నా యొక్క వాక్కులను నేనే చెప్పునట్టి మధురమైన కవిత్వముని లోకమున ఆ సర్వేశ్వరుడే ప్రసిద్ధ పరచినాడు గదా అని ఆళ్వారే కృపతో చెప్పియున్నారు.” అందుచేత ఆ సర్వేశ్వరుని కృప చేతనే ఆళ్వారు తిరువాయిమొళిని కృప చేసినారు అని వ్యక్తమవుచున్నది.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/04/20/acharya-hrudhayam-57-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment