ఆచార్య హ్రుదయం – 58

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 57

చూర్ణిక – 58

అవతారిక

ఆళ్వారు యొక్క ప్రబంధములకు గల మూల కారణమునకు గల వైలక్షణ్యమున గొప్పతనమును చెప్పిన తరువాత గ్రంధకర్త వైలక్షణ్యమును బట్టి గొప్పదనము కలదని చెప్పదలచి నాయనార్లు ఋషులకు, ఆళ్వారుకు గల భేదమును ఇక్కడ ప్రతిపాదించుచున్నారు.

చూర్ణిక
ధర్మ వీర్య జ్ఞానత్తాలే తెళిన్దు హృష్టరాయ్ మేలేమేలే తొడుప్పారైప్పోలన్ఴే అరుళిన భక్తియాలే ఉళ్కలఙ్గి శోకిత్తు మువ్వాఴుమాసమ్ మోహిత్తు వరున్ది యేఙ్గి తాళ్ న్దశొఴ్కళాలే నూర్కిఴవివర్

సంక్షిప్త వివరణ
ధర్మ వీర్య జ్ఞానముతో (తపో బలము చేత) స్పష్టముగా తెలుసుకొని, ఆనందమును పొందిన తరువాత ప్రబంధములను రచించుటకై ఉపక్రమించిన ఋషుల వలె కాకుండా భగవానుడే అనుగ్రహించిన భక్తిచే దుఃఖించి, కరిగి పోయి మూడు సార్లు ఆరేసి(6) నెలల పాటు మూర్చిల్లి, శోకించి, ఆర్తితో మధురమైన శబ్దములతో నమ్మాళ్వారు ఈ ప్రబంధమును అనుగ్రహించినారు.

వ్యాఖ్యానము
అనగా – [ ధర్మ వీర్య జ్ఞానత్తాలే …] శ్రీ రామాయణము బాల కాండము 3.4 “హసితం భాషితం చైవ గతిర్యా యచ్ఛ చేష్టితం తత్సర్వం ధర్మ వీర్యేణ యధావ త్సమ్ప్ర పశ్యతి” (వారి నవ్వులను, వారి సంభాషణలను, వారి మాటలను మరియు వారి పనులను అన్నింటినీ వాల్మీకి బ్రహ్మ అనుగ్రహించిన యోగ బలముచే స్పష్టముగా దర్శించగలిగినాడు) అని చెప్పినట్టు తపో రూపమగు ధర్మముచే జ్ఞానమును పొందినారు. అట్టి జ్ఞానముచే ఏది అయితే తెలుసుకొనవలెనో దానిని స్పష్టముగా తెలుసుకొనిరి. తిరువాయిమొళి 7.2.7 “కణ్డుమ్ తెళిన్దుమ్”(చూడడము చేత, మరియు స్పష్టతను తెచ్చుకొనుట) అని చెప్పినట్టు తెలుసుకొనవల్సిన దానిని బాగా తెలుసుకొని ఆనందమును పొంది “న భోదాత్ అపరమ్ సుఖమ్” (జ్ఞానము కంటే గొప్పదైన సుఖము లేదు) అని చెప్పినట్టు అట్టి స్పష్టత మరియు ఆనందముతో మహర్షులు పదములను చేర్చిరి.

అరుళిన భక్తియాలే ఉళ్ కలన్గిచ్ చోకిత్తు మూవాఴు మాసమ్ మోహిత్తు
మహర్షుల వలె తమ తపో బలముచే పొందు జ్ఞానము మరియు అట్టి జ్ఞానము జ్ఞానమాత్రముగా ఉండి తిరువాయిమొళి 1.1.1 “మయఴ్వఴ మదినలమ్ అరుళినన్”(భక్తి రూపముగా మారు గొప్పదైన లోపము లేని జ్ఞానమును ఆ సర్వేశ్వరుడే నాకు కృప చేసినాడు) అని చెప్పినట్టు భగవానుని నిర్హేతుక కృప చేత వృద్ధి చెందిన జ్ఞానమైన భక్తిని ఆళ్వారు పొందినారు. అట్టి జ్ఞానమును సాక్షాత్తు భగవానుని ద్వారానే తనకి లభించినందు వలన మరియు మహర్షుల ఆనందమునకు, స్పష్టతకు(జ్ఞానము) విరుద్ధముగా ఉండడము చేత ఆళ్వారు బాధకు గురియై తిరువాయిమొళి 1.4.3 ” మదియెల్లామ్ ఉళ్ కలఙ్గి”(జ్ఞానము పూర్తిగా చెల్లాచెదురు అగుట) అని చెప్పినట్టు విరహ బాధచే మరియు తానూ అనుకున్న తావున భగవానుని అనుభవించలేక దుఃఖించి మూడు సార్లు మూర్చిల్లి పాశురములను ఇక ముందు చెప్పుటకు వీలు కానట్టిదై
ఇట్లు ఆలోచింపజేసినది “ఎంత అద్భుతం! ఎంత అద్భుతం” ఈ క్రింద చెప్పినట్టు :

– తిరువాయిమొళి 1.3.1 “ఎత్తిఴామ్” – సర్వాధికుడను (అందరికంటే గొప్పది) మరియు అవాప్త సమస్త కామ (అన్ని కామములు నెరవేరిన వాడు) అయిన వాడు తక్కువ స్థాయి చెపలుడిలా వెన్నను దొంగతనము చేసినాడు.
– తిరువాయిమొళి 5.10.1 “పిఴన్దవాఴుమ్” – అకర్మ వశ్యుడై (కర్మము అంటని వాడు) ఏదో కర్మ ఉన్న వాడి వలె జన్మించుట
– తిరువాయిమొళి 8.8.1 “కణ్గళ్ శివన్దు” – ఎలా అయితే ఆళ్వారుల కళ్లు మరియు నోరు భగవానునితో విశ్లేషము వల్ల ఎండిపోయాయో భగవానుని కళ్ళు మరియు నోరు కూడా ఆళ్వారుతో విశ్లేషముచేత ఎండిపోయి ఆ తరువాత భగవానుడు ఆళ్వారుతో కలిసాక తిరిగి తన ప్రకాశవంతమైన వర్ణమును పొందినాడు.

వరుంది
తిరువాయిమొళి 3.8.10 “వరుంది నాన్ వాసగ మాలై కొణ్డు”(దుఃఖించి, నీ కోసమే మాలికల వంటి పదములను నిన్ను కీర్తించుటకే అర్పించితిని) పెద్ద పర్వతమును ఎత్తినట్టు నేను ఒక్కొక్క పదమును పలుకుచున్నప్పుడు దుఃఖించితిని.

ఏంగి
తిరువాయిమొళి 8.5.3 “ఎన్ఴన్ఴేఙ్గి అళుదక్కాళ్” (నేను వెక్కి వెక్కి ఏడుస్తున్నాను) అని చెప్పినట్టు భగవదనుభవము కలుగక పోవుటచే దుఃఖించి దాని గురించే పలు విధములుగా చెప్పి వెక్కి వెక్కి యేడ్చుట.

తాళన్ద సొఴ్కళై నూఴ్కిర ఇవర్
తిరువాయిమొళి 8.5.11 “అన్గే తాళన్ద శొర్కళాల్ అన్దాణ్ కురుగూర్ చ్చడగోపన్” (ఆకట్టుకొనునదైనది మరియు అందమైనది అయిన ఆళ్వార్ తిరునగరి కి నాయకుడు అయిన ఆళ్వారు కృపతో మధురమైన పదములతో పలికితిరి.) అనియు తిరువాయిమొళి 8.5.10 ” ఎన్గే కాన్గేన్” (ఎక్కడ చూడగలను?) అని చెప్పినట్టు మనో వేదనతో గద్గద స్వరము గల శబ్దములతో ఆళ్వారు ఈ ప్రబంధమును చెప్పుచున్నారు తిరువాయిమొళి 4.5.10 “వణ్ తమిళ్ నూఴ్క నోత్తేన్” (విలక్షణమైన మరియు అందరిచే ఆచరింపబడినది అయిన ఈ గొప్ప ద్రావిడ ప్రబంధమును చెప్పుటకు పుణ్యమును పొందితిని.)

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/04/20/acharya-hrudhayam-58-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment