ఆచార్య హ్రుదయం – 59

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 58

చూర్ణిక – 59

అవతారిక

“శ్రీ నమ్మాళ్వార్లు కేవలము సర్వేశ్వరుని పట్ల ప్రేమను బట్టి ఋషుల కంటే గొప్పవారు కాక ఇతర విషయాంతరముల యందు వైరాగ్యమును కలిగి ఉండుటను బట్టి కూడా ఋషుల కంటే గొప్పవారు” అని నాయనార్లు చెప్పుచున్నారు.

చూర్ణిక
స్వాధ్యాయ యోగఙ్గళై క్కత్తుమ్ తెళిన్దుమ్ కణ్డమెయ్మైప్పాలే ఓతియుణర్ న్ద అవర్ ఇన్ఴుమ్ ఆశాపాశబద్ధర్ అవన్ వళఙ్గుమ్ దివ్య చక్షుస్సాలే నేరే కార్శెఴిన్ద నీఴాడి కట్కరియ అరుమ్బొరుళై క్కణ్డపోతే యాముఴామై ఎన్నుమ్బడి ఇవర్కు వన్ పాశఙ్గళ్ నీఙ్గిత్తు

సంక్షిప్త వివరణ
వేదాధ్యయనమును  మరియు యోగమును అభ్యసించడము ద్వారా ఒకరికి స్పష్టత ఏర్పడి తెలుసుకొనిన వారు అవుతారు. అయినప్పటికీ వారు ప్రాకృతిక, లౌకిక సుఖములకు బద్ధులై ఉందురు. సర్వేశ్వరుడే కృప చేసిన దివ్య నేత్రములతో ఎవ్వరికి దర్శింప శక్యము కాని ఆ భగవానుని దివ్య మంగళ విగ్రహమును ఆళ్వార్లు దర్శించి బాహ్య విషయ సంబంధముల నుండి విముక్తులు అయ్యారు.

వ్యాఖ్యానము

స్వాధ్యాయ…
అనగా శ్రీ విష్ణు పురాణము 6.6.2 మరియు 6.6.3 “స్వాధ్యాయాత్ యోగమాసీత యోగాత్ స్వాధ్యాయ మామనేత్ స్వాధ్యాయ యోగ సంపత్యా పరమాత్మ ప్రకాశతే తదీక్షణాయ స్వాధ్యాయః చక్షుర్యోగ స్తథాపరం న మాంస చక్షుషా ద్రష్టుమ్ బ్రహ్మభూత స్స శక్యతే”(వేద్దార్ధములను గ్రహించిన తర్వాత అష్టాంగ యోగమును పొందవలెను. అట్టి యోగముతో వేదాధ్యయనము చేయవలెను. స్వాధ్యాయము మరియు యోగముతో పరమాత్మ సాక్షాత్కారము కలుగును. అట్టి పరమాత్మను మాంసపు నేత్రములతో దర్శించుట శక్యము కాదు) అని చెప్పినట్టు ఒకరు పరమాత్మను మాంసపు నేత్రములతో కాక కేవలము యోగము మరియు వేదము అనబడు దివ్య నేత్రములతోనే దర్శింపగలడు. స్వాధ్యాయముతో చెప్పబడు వేదాధ్యయనము మరియు యమ, నియమ మొదలగు వాటిని కలిగియున్న అష్టాంగ యోగమును అభ్యసించుట ద్వారా ఈ రెండింటికీ విషయము అయిన భగవానుని సాక్షాత్కారము చేసుకొనుట మరియు స్పష్టముగా ఆయన స్వరూపమును తెలుసుకొనుట, ఈ విధముగా స్పష్టతతో కూడిన అట్టి దర్శనమును “ఓది ఉణర్ న్దవర్” గా పిలువబడు ఋషులు వేదమును నేర్చుకొని ఏది త్యాజ్యము(విడువ వలసినది) మరియు ఏది ఉపాధేయము(పొంద వలసినది) అని తెలుసుకొని శ్రీ భగవద్గీత 16.12 “ఆశాపాశతైర్బద్ధాః” (వందలాది కోరికలు అనబడు తాళ్లతో కట్టబడి(బంధింపబడి)) అని చెప్పినట్టు వారు ప్రాపంచిక విషయములు అను వందలాది తాళ్లతో కట్టబడి ఉండువారు.

అవన్ వళఙ్గుమ్
శ్రీ భగవద్గీత 11.8 “దివ్యం దదామి తే చక్షుః”(నీకు దివ్య నేత్రములను ఇచ్చెదను) అని చెప్పినట్టు దివ్య జ్ఞాన రూపములో ఉన్న మరియు ఆయనను చూడగలిగి ఆయనచే ప్రసాదింపబడిన దివ్య నేత్రములతో ఆళ్వారు చూసారు.

నేరే
ఆయనని దర్శించడము శక్యము కానిది అని ముదల్ తిరువందాది 56 “నేరే కడిక్కమలత్తుళ్ ఇరుందుమ్ కాణ్గిలాన్” (ఎమ్పెరుమానుని నాభిలోంచి వచ్చిన గొప్ప పరిమళమును కలిగి ఉన్న తామర పుష్పము పై ఆ సర్వేశ్వరునికి అత్యంత సమీపముగా ఉన్న చతుర్ముఖ బ్రహ్మకు ఆయన గురుంచి తెలియదు)

కార్శెఴిన్ద
నాన్ముగన్ తిరువందాది 73 “కార్ శెఴిన్ద కణ్డత్తాన్ ఎణ్కణ్ణన్ కాణాన్”(నీల కంఠమును కలిగిన శివుడు మరియు ఎనిమిది నేత్రములను కలిగి ఉన్న నాన్ముగన్(బ్రహ్మ) కు తెలియదు).

నీఴాడి
నాన్ముగన్ తిరువందాది 27 “నీఴాడి తాన్ కాణ మాట్టాద తారకలశేవడి” (భస్మమును తన ఒంటి మీద పూసుకొని ఉన్న రుద్రునకు దర్శింప శక్యము కాని పుష్పములతో అలంకరించిన ఆ సర్వేశ్వరుని వ్యాప్తి చెందు శ్రీ పాదములు)

కట్కరియ
తిరువాయిమొళి 7.7.11 “కట్కరియ పిరయన్ శివన్ ఇందిరన్ ఎన్ఴివర్కుమ్ కట్కరియ కణ్ణన్”(మనుష్యులు మొదలగు వారి నేత్రములచే దర్శింప శక్యము కాని బ్రహ్మ, రుద్ర, ఇంద్ర మొదలగు వారికి వారి నేత్రములతో కృష్ణుని దర్శింప శక్యము కాదు) అని చెప్పినట్టు ఇంతక ముందు పేర్కొనిన వారి కంటే జ్ఞాన శక్త్యాదులు అధికముగా కలవారై తిరువాయిమొళి 2.7.12 “దామోదరనైత్ తని ముదల్వని జ్ఞానం ఉణ్డవనై ఒరువర్కుత్తరం అఴియలామో”(అద్వితీయ కారణమగు, భూమిని మ్రింగిన వాడు అయిన దామోదరుని మహిమ ఇతరులకు తెలియ శక్యమా?) అని తమకు తప్ప ఇతరులకు ఎవ్వరికీ తెలుసుకొనుట అశక్యము అని నిశ్చయించుకొని ఉండు బ్రహ్మ రుద్రాదులకూ తెలిసికొనుటకు అశక్యుడై అని అన్నట్టు.

అరుమ్ పొరుళై

తిరువాయిమొళి 9.3.3 “అఴిన్దన వేద అరుళ్ పొరుళ్ నూల్గళ్ అఴిన్దెన కొళ్గ అరుమ్ పొరుళాదల్”(“వేదాహమేదమ్” అని చెప్పబడు వేదము ఎంత గొప్పదైనప్పటికీ వేదము ద్వారా తెలుసుకొనుట వీలు కాని కొన్ని వస్తువులను బ్రహ్మ సూత్రము, ఇతిహాసము, పురాణములు మొదలగు శాస్త్రముల ద్వారా తెలుసుకొనబడుటకు ఉపకరించును) అనియు కేనోపనిషత్తు “యస్యామతమ్ తస్య మతమ్”(ఎవడికి బ్రహ్మము ఇంత మాత్రము అని తెలియదో వాడికి బ్రహ్మము తెలుసును) అని చెప్పినట్టు వేదముల ద్వారా కూడా తెలుసుకొనుట శక్యము కాని భగవానుడు నాన్ముగన్ తిరువందాది 60 “కేట్టార్కు అరుమ్ పొరుళాయ్ నిన్ఴ” (స్వప్రయత్నముచే తెలుసుకొను వారికి దుర్లభమైన వస్తువైన ఓ శ్రీ రంగా!) అనియు కఠోపనిషత్తు “నాయమాత్మా ప్రవచనేన లభ్యో నమేధయా న బహునా శృతేనా”(ఈ పరమాత్మ బుద్ధి చేత గాని, మననము చేత గాని మరియు వినుట చేత గాని పొందబడని వాడు) అని చెప్పినట్టు తన అనుగ్రహముచే తప్ప స్వప్రయత్నము తో శ్రవణము చేయువారికి పొందుటకు శక్యము కాని ఆ సర్వేశ్వరుడు.

కణ్డపోదే
ఆయనకి ఆయన అనుకోని చూపించినచో స్పష్టముగా తెలియబడినవాడు తిరువాయిమొళి 10.4.9 “కణ్డేన్ కమల మల్ పాతమ్” (పరమ ఉత్క్రుష్టమైన తామర పువ్వు వంటి అనుభవ యోగ్యమయిన ఆ సర్వేశ్వరుని శ్రీ పాదములను చూచితిని)

యామఴమై ఎన్నుమ్బడి
తిరువిరుత్తం 1 “పొయ్ నిన్ఴ జ్ఞానముమ్ పొల్లా ఒళుక్కుమ్ అళుక్కుడమ్బుమ్ ఇన్నిన్ఴ నీర్మై ఇనియామ్ ఉఴామై ఉయిర్ అళిప్పాన్ ఎన్నిన్ఴ యోనియుమ్ ఆయ్ప్పిఴన్దాయ్ ఇమైయోర్ తలైవ మెయ్ నిన్ఴు కేట్టరుళాయ్ అడియేన్ సెయ్యుమ్ విణ్ణప్పమే”(సమస్త జీవములను కాపాడుటకు ఎన్నో జన్మలు దాల్చిన వాడా, ఓ నిత్యసూరి నాయకుడా! అసత్యవాచ్యమైన అచేతనమందు ఆత్మ అనెడి జ్ఞానమును, సాంసారిక దుష్కర్మ ప్రవృత్తి ఇక మీద పోవునట్లు చేయుమా అని దాసుడు అయిన నా విన్నపమును వినుమా) అని చెప్పినట్టు అవిద్యాదుల నుండి విడుదల చేయమని ఎమ్పెరుమానుని శ్రీ పాదములను ఆళ్వారు శరణు చేయునట్లు.

ఇవర్కు వన్ పాశఙ్గళ్ నీన్గిత్తు
తన ప్రయత్నముచే నివర్తింపచేసికొని అవసరము లేకుండా బాహ్య విషయ సంబంధములు తిరువాయిమొళి 8.2.11 “మత్త వన్ పాశఙ్గళ్”(విషయాంతరాల పట్ల ప్రబలమైన కోరికలు కలిగియుండుట) అని చెప్పినట్టు ఆ సర్వేశ్వరుని అనుగ్రహము వలననే విడిపోయినవి . తిరువాయిమొళి 7.8.5 ” పాశఙ్గళ్ నీక్కై” (పాశములను దూరము చేసి (లేకుండా చేసి)).

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/04/20/acharya-hrudhayam-59-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment