చూర్ణిక – 60
అవతారిక
ధారకాది(తనకు తాను నిలబెట్టుకొనుటకు) వైలక్షణ్యమును బట్టి కూడా ఋషుల కంటే ఆళ్వారు యొక్క గొప్పతనమును నాయనార్లు కృప చేయుచున్నారు.
చూర్ణిక
అవర్ కళక్కు కాయోడెన్నుమవైయే ధారకాదకళ్ ఇవర్కెల్లామ్ కణ్ణనిఴే
సంక్షిప్త వివరణ
ఋషులకు పండని ఫలములు మొదలగు ధారకములు, ఆళ్వారుకు అన్నియూ కృష్ణుడు
వ్యాఖ్యానము
అవర్ కళక్కు…
అనగా ఋషులకు పెఱియ తిరుమొళి 3.2.2 “కాయోడు నీడు కని ఉణ్డు వీసు కడున్గాల్ నుకర్ న్దు” (పండినవి మరియు ఎండిన ఫలములు తినుట, గాలిని తీసుకొనుట) అనియు పెఱియ తిరుమాడల్ “వీళ్కనియుమ్ ఉళ్ ఇలై ఎన్నుమ్ ఇవైయే నుకర్ న్దు” (క్రింద రాలిన ఫలములను మరియు ఎండిపోయిన ఆకులను తినుట) అని చెప్పినట్టు ఫలములు, మూలములు, ఆకులు, గాలి మరియు నీరు దారకములు అయ్యెను.
ఇవర్కెల్లామ్ కణ్ణనిఴే
పరాంకుశాష్టకం “ఋషిమ్ జుషామహే” (ఋషి అయిన నమ్మాళ్వారును నేను ఆరాధిస్తున్నాను) అని చెప్పినట్టు ఆళ్వారును కూడా ఋషిగ చెప్పినప్పటికీ, ఆళ్వార్ల ధారకము అది కాదు. “కృష్ణ తృష్ణా తత్త్వమ్” గా పిలువబడి ఆళ్వారుకు ధారక, పోషక, భోగ్యములు అన్నీయు కృష్ణుడే. తిరువాయిమొళి 6.7.1 “ఉణ్ణుమ్ శోఴు పరుగు నీర్ తిన్నుమ్ వెత్తిలయుం మెల్లామ్ కణ్ణన్” (వసుదేవుని కుమారుడైన న స్వామి కృష్ణా శ్రీ భగవద్గీత 7.19 “వాసుదేవ సర్వమ్” అని చెప్పినట్టు స్వీకరించుచున్న ప్రసాదము, త్రాగుచున్న తీర్థమును, నములుచున్న తాంబూలమును అన్నియూ నీవే) అని చెప్పినట్టు శ్రీ నమ్మాళ్వార్లకు ధారకము, పోషకము, భోగ్యము అన్నీ కృష్ణుడే!
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/04/20/acharya-hrudhayam-60-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org