ఆచార్య హ్రుదయం – 61

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 60

చూర్ణిక – 61

అవతారిక
“ఈ విధముగా నమ్మాళ్వారు ప్రాపంచిక విషయముల పట్ల బంధము పోయి కేవలము ఆ భగవానుని విషయములో అభినివేశము కలిగి ఉండి అట్టి సర్వేశ్వరుని అనుభవము దూరము అయినప్పుడు దుఃఖించెదరు. కాని ఋషులు అట్టి బంధములను విడువలేక పోవడము చేత వారు ఆ బంధములకు దూరమైనప్పుడు దుఃఖించెదరు” అని నాయనార్లు వివరించుచున్నారు.

చూర్ణిక
అళునీర్ తుళుమ్బక్కడలుమ్ మలైయుమే విశుమ్బుమ్ తుళాయ్ తిరుమాలెన్ఴు ఎఙ్గే కాణ్గేన్ ఎన్నుమివర్ అలమాప్పు అవర్ కళక్కు పుత్రవియోగత్తిలే

సంక్షిప్త వివరణ
ఆ సర్వేశ్వరుని యెడబాసి (విడిచి) ఒక్క క్షణము కూడా ఉండలేక నమ్మాళ్వార్లు పడిన బాధ, వేదన ఋషులు తమ సంతానమును విడిచిపెట్టు విషయములలో కనిపించును.

వ్యాఖ్యానము
అనగా భగవానుని వియోగము చేత ఈ క్రింద చెప్పిన విధముగా నమ్మాళ్వార్లు కన్నీటి పర్యంతులై భగవానుని కోసము బుద్ధికి గోచరము కాని సముద్రములో,  ఎతైన పర్వత శిఖరములలో, ఆకాశములో వెతుక సాగుచూ తన హృదయములో మధన పడిన వాడై “ఓ శ్రీమన్నారాయణ!” అని పిలుస్తూ ఆ శ్రియః పతిని గుర్తించుటకై దుఃఖ పడితిరి.

-అళునీర్ తుళుమ్బ – తిరువిరుత్తం 2 “చేయరిక్కాణ్ అళునీర్ తుళుమ్బ అలమఴుగిన్ఴన”(అందమైన నీటితో నిండియున్న కొలనులో అటు ఇటు తిరుగు చేప వలె ఎవరి కళ్ళు కన్నీరు కార్చుచూ దుఃఖముతో బాధపడుచున్నవో)
-కడలుమ్ మలైయుమే విశుమ్బుమ్ తుళాయ్ – తిరువాయిమొళి 2.1.4 “కడలుమ్ మలైయుమే విశుమ్బుమ్ తుళాయ్” (ఆ సర్వేశ్వరుని సముద్రము(క్షీరాబ్ధి), పర్వతము(తిరుమల) మరియు ఆకాశము(పరమాకాశముగా చెప్పబడు పరమపదము)లో పొందగోరి)
-తిరుమాలెన్ఴు – తిరువాయిమొళి 9.8.10 “శెన్దై కలన్గిత్ తిరుమాల్! ఎన్ఴళైప్పన్”(నేను దుఃఖపడిన హృదయముతో “ఓ శ్రీమాన్!” అని పిలుచుచున్నాను)
-ఎఙ్గే కాణ్గేన్  – తిరువాయిమొళి 8.5.11 “ఎఙ్గే కాణ్గేన్! ఇన్ తుళాయ్ అమ్మాన్ తన్నై” (మంచి భోగ్యమైన తులసీ మాలను ధరించిన ఆ సర్వేశ్వరుని నేను ఎక్కడ దర్శించగలను?)

ఇట్టి దుఃఖము ఋషులు అయిన శ్రీ వశిష్ఠ భగవాన్, శ్రీ వేదవ్యాస భగవాన్ మొదలగు వారు తమ సంతానంతో వేరుబడి వారి కోసము అన్ని చోట్ల గాలించుచూ తిరుగుచున్న సందర్భములలో కనిపించును.

పుత్ర వియోగముతో శ్రీ వశిష్ఠ భగవానుడు దుఃఖించి పర్వతమును ఎక్కి అక్కడి నుండి దూకెను, నిప్పులో దూకెను, రాయిని మెడకు కట్టుకొని సముద్రములో దూకెను.

స మేరు కూటాత్మానం ముమోచ భగవానృషిః
శిరస్తస్య శిలాయాఞ్చ తులారాశా వివాపతత్
న మమార చ పాతేన తదా స మునిసత్తమః
తదాగ్ని మిధ్వా భగవాన్ స వివేశ మహావనే
తం తదా సు సమిద్ధోపి న దదాహ హుతాశనః
దీప్యమానో ప్యమిత్రఘ్నం శీతోగ్ని రభవాత్తదా
స సముద్ర మభిప్రేత్య శోకావిష్ఠో మహామునిః
కణ్ఠే బధ్వా శిలాం గుర్వీం నిపపాత తదమ్భసి

అట్టి వశిష్ఠ భగవానుడు మేరు పర్వత శిఖరము పైనుంచి దూకెను. అతని తల పత్తి రాయి పైన పడ్డట్టు నేల పైన పడెను. అయినప్పటికీ ఋషులలో శ్రేష్ఠుడైన ఆతను మరణమును పొందలేదు. ఓ ఋషి! అట్టి వశిష్ఠ భగవానుడు చితిని వెలిగించి అందులోకి ప్రవేశించెను, ఆ చితి ఎంతగానో మండుతున్నా అతనిని దహించలేక పోయినది. అట్టి వశిష్ఠుడు దుఃఖంలో మునిగిపోయి మెడకు ఒక రాయిని కట్టుకొని సముద్రములో దూకెను.

పుత్ర వియోగమును సహించలేని శ్రీ వేదవ్యాస భగవానుడు దుఃఖముతో “ఓ పుత్రా!” అని ఏడుస్తూ అంతటా తిరుగుతూ శ్రీ భాగవతము 1.2.2 “ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి” అని చెప్పినట్టు తన పుత్రుడు అయిన శుకుని వియోగము తాళలేక శుకుని కోసము ఏడవ సాగెను. 

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/04/20/acharya-hrudhayam-61-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment