ఆచార్య హ్రుదయం – 63

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 62

చూర్ణిక – 63

అవతారిక
“ధర్మ వీర్య..” అను 58వ చూర్ణిక నుండి ఇక్కడి దాకా ప్రబంధ గ్రంధకర్త యొక్క గొప్పతనమును వివరించారు. ఇప్పుడు ఈ ప్రబంధము (తిరువాయిమొళి) యొక్క గొప్పతనమును వివరించుచున్నారు.

చూర్ణిక
రామాయణమ్ నారాయణకథైయెన్ఴు తొడఙ్గి గఙ్గాగాఙ్గేయ సమ్భవాది అసత్కీర్తనమ్ పణ్ణిన ఎచ్చిల్ వాయే శుద్ధి పణ్ణామల్ తిరుమాలన్ కవి ఎన్ఴ వాయోలైప్పడియే మాత్తఙ్గళాయ్న్దు కొణ్డ ఉరియశొల్ వాయిత్త ఇతు వేదాదికళిల్ పౌరుష మానవ గీతా వైష్ణవఙ్గళ్ పోలే అరుళిచ్చెయలిల్ సారమ్

సంక్షిప్త వివరణ
శ్రీ రామాయణమని, నారాయణ కథ చెప్తాము అని అక్కర్లేని విషయములైన గంగా, గాంగేయ(భీష్మ) జన్మ వృత్తాన్తములను చెప్పి ఎంగిలి నోటిని పరిశుద్ధము చేసుకోనక్కర్లేకుండా శ్రీమన్నారాయణుని లీలను కవిత్వముగా చెప్పగలిగిన సరైన కవి తానే అని తిరువాయిమొళి అను తన ప్రబంధమున ఆళ్వారు అట్టి శ్రీమన్నారాయణుని గురుంచే పాడారు. అట్టి తిరువాయిమొళి, ఎలా అయితే వేదము యొక్క సారము పురుష సూక్తమో, ధర్మ శాస్త్రము యొక్క సారము మను స్మృతియో, మహాభారతము యొక్క సారము భగవద్గీతయో, పురాణముల యొక్క సారము విష్ణు పురాణమో అలానే తక్కిన దివ్య ప్రబంధములకు సారము.

వ్యాఖ్యానము

అనగా –

రామాయణమ్…
శ్రీ రాముని గొప్పతనము చెప్పెదను అని ప్రకటించి శ్రీ రామాయణమును ఆరంభించి శ్రీ రామాయణము బాల కాండము 2.42 “కావ్యం రామాయణం కృత్స్నామ్ ఈదృశైః కరవాణ్యహమ్”(నేను రామాయణము అను కావ్యమును వివరించుటకై ఈ శ్లోకములను రచించుచున్నాను) అని చెప్పినట్టు గంగ పుట్టుక గురించి , సుబ్రహ్మణ్య పుట్టుక గురించి మరియు పుష్పక విమానమును గురించి విశదీకరముగా చెప్పి అసత్కీర్తనమును చేసిన శ్రీ వాల్మీకి భగవానుని నోటికి అపరిశుద్ధి కలిగినది.

శ్రీ మహాభారతము ఆది పర్వము “నారాయణ కథామ్ ఇమామ్”(నేను నారాయణుని కథను చెప్పబోవుచున్నాను) అని చెప్పినట్టు “నేను నారాయణుని కథను చెప్పుచున్నాను” అను వాక్యంతో ఆరంభించి సంభవ పర్వములో శ్రీ వేదవ్యాస భగవానుడు గంగ పుత్రుడు అయిన భీష్ముని పుట్టుక గురుంచి మరియు ఎంతో మంది గురుంచి విస్తారముగా చెప్పి మరియు “పూసల్ పట్టోళై” గా పిలువబడు మహాభారత యుద్ధమును విస్తారముగా వర్ణించుట వలన అతని నోరు అపరిశుద్ధమయ్యెను. అసత్కీర్తనము ఎక్కువగా చేసి హరివంశము “అసత్కీర్తన కాన్తార పరివర్తనపాంసులామ్ వాచం శౌరి కథాలాప గంగైవ పునీమహే”(అసత్కీర్తన రూపమగు అరణ్యమున సంచరించుట చేత దుమ్ము కొట్టుకుని ఉన్న నా నోరును శ్రీమన్నారాయణుని కథా సంకీర్తన రూపమగు గంగచే పరిశుద్ధము అయినది.) అని వేదవ్యాసుడు తన నోటిని పరిశుద్ధము చేసికొనెను.

ఈ విధముగా వాల్మీకి భగవానుడు తన నోరు పరిశుద్ధము అయ్యేలా ప్రాయశ్చిత్తము చేయనందుకు ఈ తర్కము నాయనార్లకు కూడా ఆపాదించబడుతుంది అని తనని(నాయనార్లని) కూడా ఈ విధముగా పేర్కొనినారు.

అందు చేత ఈ విధముగా మొదలుపెట్టి సరిగ్గా చెప్పక అసత్కీర్తనము చేసి నోటిని అపరిశుద్ధముగా చేసుకొని దానిని మరలా పరిశుద్ది చేసుకోనక్కర్లేకుండా

తిరుమాల్ అవన్ కవి
తిరువిరుత్తం 48 “తిరుమాల్ అవన్ కవి యాదు కత్తేన్”(ఆయనని కీర్తించు ఆ పదములు అన్నియూ ఆ శ్రీమన్నారాయణుని నుంచే నేర్చుకున్నాను) అని చెప్పినట్టు ఆళ్వారు తిరుమాల్ (శ్రీమన్నారాయణుని) యొక్క కవి అని మరియు ఈ ప్రబంధము భగవానుని తప్ప వేరొక దానిని చెప్పనటువంటి పదములతో చెప్పబడినది అని తన వాక్కులతో ప్రమాణము చేసెను. తిరువాయిమొళి 6.8.11 “మాత్తన్గళ్ ఆయన్దు కొణ్డు” (విలక్షణమైన పదములను కూర్చి) అని చెప్పినట్టు భగవానునికి సరిపడు పదములతోనే చెప్పబడెను అనియు తిరువాయిమొళి 4.5.6 “ఉరియ శొల్లాల్ ఇశై మాలైగళ్ ఏత్తి”(ఆయనను కీర్తించుటకు సరిపడ పదములచే కూర్చిన మాలికల వంటి పాటలు) అని చెప్పినట్టు ఆ సర్వేశ్వరుని కోసమే చెప్పబడిన ప్రబంధము అనియు తిరువాయిమొళి 2.2.11 “వాయ్ త్తు ఆయిరమ్” (భగవానుని లబ్ది)

వేదాదిగళిల్ …
“వేదేషు పౌరుషమ్ సూక్తమ్ ధర్మ శాస్త్రేషు మానవమ్ భారతే భగవద్గీతా పురాణేషు చ వైష్ణవమ్”( పురుష సూక్తము వేదము యొక్క సారము, మను స్మృతి అనునది ధర్మ శాస్త్రము యొక్క సారము, భగవద్గీత మహాభారతము యొక్క సారము, శ్రీ విష్ణు పురాణము పురాణముల యొక్క సారము) అని చెప్పినట్టు ఎలా అయితే పురుష సూక్తము వేదము యొక్క సారమో, మనువు యొక్క వాక్కులు ధర్మ శాస్త్రము యొక్క సారమో, శ్రీ భగవద్గీత మహాభారతము యొక్క సారమో మరియు శ్రీ విష్ణు పురాణము పురాణముల యొక్క సారమో, విషయాంతరాలకు తావు లేనిది, కేవలము భగవానుని కీర్తించు అరుళేచ్చియల్(దివ్య ప్రబంధము)కి తిరువాయిమొళి సారము.

దీనితో ఋషుల చేత రచించబడిన ప్రబంధముల కంటే గొప్పదైన మరియు ఇతరత్రా విషయములను చెప్పెడి దోషమును లేనిది తిరువాయిమొళి 8.2.11 “తీదిల్ అన్దాది”(అందాదిలో కూర్చిన ఎట్టి దోషములూ లేని వేయి పాశురములు) అనియు , తక్కిన ఆళ్వార్ల ప్రబంధములకు సారమైనది అగుట చేత ఈ ప్రబంధము(తిరువాయిమొళి) యొక్క గొప్పతనము ప్రకటించబడినది.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/06/11/acharya-hrudhayam-63-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment