చూర్ణిక – 67
అవతారిక
“నేర్పు గల పండితులు ఈ ప్రబంధము తిరువాయిమొళిని ఉపయోగించి శాస్త్రార్థములను నిర్ణయించునట్టి అన్ని ఉపబ్రాహ్మణముల కంటే పేరు గడించినదై అంత మాత్రమే కాకుండా ఇంతక ముందు చెప్పిన ప్రకారము ద్రావిడ వేదమైనదై (తమిళ వేదము) సంస్కృత వేదముతో సమానమైనదిగా ఉండడము చేత ఎక్కువ విశ్వసనీయత మరియు ప్రామాణికతను కలిగినది. కానీ అట్టి ఈ ప్రబంధములో నమ్మాళ్వారు దీని విశ్వసనీయతను నిర్ధారించుటకై వేరే ఇతరత్రా ప్రమాణములను ఎందుకు ఉటంకించుచున్నారు?” అన్న సందేహమును నాయనార్లు కృపతో నివృత్తి చేయుచున్నారు.
చూర్ణిక
ఆప్తిక్కు ఇవర్ శురుతి మార్కణ్డేయన్ పార్ధన్ ఎన్గిఴ ఇవై వ్యాస మను బ్రహ్మవాదిగళై వేదమ్ శొల్లుమాప్పోలే
సంక్షిప్త వివరణ
వేదము ఎలా అయితే వ్యాసుని, మనువు మరియు బ్రహ్మమును తెలిసిన వారి గురుంచి ఉటంకించిందో అదే విధముగా ఆళ్వారు శృతి, మార్కణ్డేయ, అర్జున మొదలగు వారి గురుంచి విశ్వసనీయత కోసము ఉటంకించుచున్నారు.
వ్యాఖ్యానము
అనగా – ఆళ్వారు తన ప్రబంధములలో చెప్పబడిన సూత్రములకు విశ్వసనీయతను తేవడము కోసము వేదమును, మార్కణ్డేయ మరియు పార్ధుని గురుంచి ఉటంకించెను. తిరువాయిమొళి 1.1.7 “ఉళన్ సుడర్ మిగు సురుదియుల్” (గొప్పదైన వేదమునకు తానే ముఖ్య ప్రతిపాద్య వస్తువు) అని చెప్పినట్టు మరియు తిరువాయిమొళి 5.2.7 “మార్కణ్డేయనుమ్ కరియే”(భగవానుని పరత్వమునకు మార్కణ్డేయ మహర్షి సాక్షి)అనియు తిరువాయిమొళి 2.8.6 “పార్థన్ తెళిన్దు ఒళిన్ద” (అర్జునుడు శ్రీ కృష్ణుని పరత్వమును స్థిరపరిచెను) అని చెప్పినట్టు ఇది గొప్ప విశ్వసనీయత కలిగిన వేదము మనువు, మరియు బ్రహ్మమును తెలిసిన వారి గురుంచి దాని విశ్వసనీయత కోసము ఉటంకించడము వంటిదే ఆరణం “సహోవాచ వ్యాసః పారాశర్య” (పరాశర ముని కుమారుడైన వ్యాసుడు చెప్పెను) అనియు యజుర్ వేదము ” యద్వై కిన్చ మనురవదత్ తత్ భేషజమ్”(ఏదైతే మనువు చేత చెప్పబడినదో అది ఔషధము వంటిది) అనియు యజుర్ వేదము “బ్రహ్మవాదినో వదన్తి”(బ్రహ్మమును తెలిసిన వాళ్ళు పలికెను)
ఈ విధముగా గొప్ప ఆదరమును కలిగిన వారిని ఉటంకించడము తక్కువదైన అంశము కాకపోగా అది విశ్వసనీయతను పెంచుటకు ఉపకరించును. దీనితో ఇంతక ముందు తిరువాయిమొళి వేదం సామ్యము చెప్పినప్పుడే చెప్పవలసియుండి అప్పుడు చెప్పనందున దానిని ఇప్పుడు నాయనార్లు చెప్పిన వారు అయ్యిరి.
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/06/17/acharya-hrudhayam-67-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org