చూర్ణిక – 68
అవతారిక
నమ్మాళ్వార్ల ప్రబంధములను ఉపబ్రాహ్మణముగా చెప్పినచో అది వేదమునకు వివరణ అవ్వును. కానీ అభియుక్తులచే ఉటంకించుబడినట్టి “వేద రూపం ఇదం కృతం”(ఈ తిరువాయిమొళి వేదం రూపములో చెప్పబడినది) అనియు శ్రీ రంగరాజ స్తవము 1.6 “ద్రావిడీమ్ బ్రహ్మ సంహితాం”(తమిళ భాషలో ఉన్న బ్రహ్మమును గూర్చిన పాశురములు) అనియు శ్రీ రంగరాజ స్తవము 1.16 “ద్రావిడ వేద సూక్తైః”(తమిళములో వేదం సూక్తములు) తిరువాయిమొళికి వేదత్వము ఎలా సిద్ధించును? అను ప్రశ్నకు సమాధానమును నాయనార్లు ఇక్కడ కృప చేయుచున్నారు.
చూర్ణిక
భారత గీతైకళిన్ వేదోపనిషత్తవమ్బోలే ఇతవుమ్ వ్యాఖ్యైయానాలుమ్ వేద రహస్యమామ్
సంక్షిప్త వివరణ
ఎలా అయితే మహాభారతమును మరియు భగవద్గీతను వేదముగా మరియు ఉపనిషత్తుగా కొనియాడబడునో అదే విధముగా ఇది (తిరువాయిమొళి)వేదమునకు వివరణ అయినప్పటికి ఇది కూడా వేద రహస్యము.
వ్యాఖ్యానము
అనగా – వేదమునకు ఉపబ్రాహ్మణము అయిన మహాభారతము మరియు మహాభారతమునాకు సారము అయిన శ్రీ గీత వేదము మరియు ఉపనిషత్తుగా చెప్పబడినవో శ్రీ విష్ణు పురాణము “వేదాన్ అధ్యాపయామాస మహాభారత పంచమాన్”(పంచమ వేదము అయిన మహాభారతమును ఆయన ఉపదేశించెను) అనియు “భగవత్ గీతాసు ఉపనిషత్సు” (శ్రీ గీత అనుబడు ఉపనిషత్తులో)
అదే విధముగా తిరువాయిమొళి వేదమునకు వివరణగా ఉండు ఉపబ్రాహ్మణము అయినప్పటికీ ఇది రహస్య వేదము కూడా. వేద రహస్యము అనగా ఉపనిషత్తు అనగా వేదము యొక్క రహస్య భాగము. ఇంతక ముందు కూడా ఈ తిరువాయిమొళిని ఛాందోగ్య ఉపనిషత్తుకు సామ్యముగా చెప్పబడినది. అందుచేత ఈ విషయమున కూడా తిరువాయిమొళికి ద్రావిడ వేదత్వము కలిగి ఉండుటలో ఎట్టి లోపము లేదు.
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/06/21/acharya-hrudhayam-68-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org