చూర్ణిక – 71
అవతారిక
అపౌరుషేయమైన(ఎవరిచే రచించబడని) వేదము వేరొక అవస్థను(ద్రావిడ ప్రబంధములుగా) పొందినచో అది కలుషితమైనదై అర్ధములను తెలుపు విషయమున సామర్ధ్యమును కోల్పోదా ? అని ప్రశ్నించినచో దానికి బదులుగా నాయనార్లు వక్తృ విశేషము చేత అది వేరొక విధముగా (అది శుద్ధి పొంది అర్ధములను బాగా ప్రకాశింపచేయగలదు)అగును అని ఉదాహరణతో కృప చేయుచున్నారు
చూర్ణిక
మణ్ణాడిన సహ్యజలమ్ తోతవత్తి చ్ఛఙ్గణితుఴైయిలే తుకిల్ వణ్ణ త్తెణ్ణీరాయ్ అన్తస్థత్తై కాట్టుమాపోలే కలక్కిన శ్రుతి నన్జ్ జ్ఞానత్తుఴైశేర్ న్దు తెలివుత్తు ఆళ్ పొరుళై అఴివిత్తతు
సంక్షిప్త వివరణ
మట్టితో చేరి కలుషితమై సహాయ పర్వతము నుండి ప్రవహించు జలము రేవులలోకి వచ్చినప్పుడు స్వఛ్చ జలమై లోపల ఉండు వాటిని ప్రకాశింపజేసినట్లు అల్పజ్ఞులచే (తక్కువ బుద్ధి కలిగిన వారు) దూషితముగా చేయబడిన వేదము యదార్ధ జ్ఞానమునకు ఆశ్రయమగు ఆళ్వార్లను చేరి తేటపడి దోషరహితమై సమస్త అర్థములను తెలుపును.
వ్యాఖ్యానము
మణ్ణాడిన సహ్యజలమ్ –
అనగా ఎత్తు ప్రదేశము నుండి జలము వేగముతో వచ్చి భూమి మీద పడుటచే మట్టితో కలసి కలుషితమై
తోతవత్తి చ్ఛఙ్గణితుఴైయిలే –
అట్టి జలము రేవులకు చేరగా పెరియాళ్వార్ తిరుమొళి 4.8.1 “తోతవత్తిత్తూయ్ మఴైయోర్ తుఴై”(నిర్మలమై పవిత్రమైన బ్రాహ్మణులు స్నానమాడి రేవులు) అనియు తిరువాయిమొళి 10.3.11 “పొరునల్ శఙ్గణి తుఴై”(శంఖములచే అలంకరించియున్న తామ్రపర్ణీ తీరము) అని చెప్పినట్టు ఆ రేవులకు గల వైశిష్ఠ్యము చేత
తుకిల్ వణ్ణ త్తెణ్ణీరాయ్ అన్తస్థత్తై కాట్టుమాపోలే –
స్వఛ్చమైన జలము కావడము చేత తిరువాయిమొళి 7.2.11 “తుగిల్ వణ్ణత్తుూ నీర్” (తెల్లని వస్త్రము వలె నిర్మలమైన జలము) అనియు పెరుమాళ్ తిరుమొళి 1.10 “తెణ్ణీర్ ప్పొన్ని”(స్వచ్ఛమైన జలములు కలిగిన కావేరి) అని చెప్పినట్టు వాటిలో ఉన్న వస్తువులను ప్రకాశింపజేయును.
అదే విధముగా,
అల్పశ్రుతర్ కలక్కిన శ్రుతి –
బార్హస్పత్య స్మృతి “బిభేత్యల్పశ్రుత్ వేదో మామయం ప్రతరిష్యతి”(తమను అపార్థము చేయునని వేదము అల్ప బుద్ధిగల వారిని చూసి భయపడుచున్నది) అని అన్నట్టు వేదము అల్ప సారులను చూసి భయపడినట్లు దానిని తెలియక వాదములు చేయువారగు అల్ప జ్ఞానులు ఒక వాక్యము యొక్క అర్ధము చెప్పదలచి దానికి విరుద్ధముగా “ఇది ద్వైతమును చెప్పుచున్నది” అని కొందరు “ఇది అద్వైతమును చెప్పుచున్నది” అని కొందరు “ఇది ద్వైతాద్వైతమును చెప్పుచున్నది” అని మరికొందరు చెప్పి , ఈ విధముగా విరుద్ధ వాదములచే దూషితమైనట్టి వేదము
నన్జ్ జ్ఞానత్తుఴైశేర్ న్దు –
యదార్ధమైన జ్ఞానమునకు ఆశ్రయమైన ఈ ఆళ్వారును చేరి తిరువిరుత్తం 93 “నన్జ్ జ్ఞానత్తుఴై”(విలక్షణమైన జ్ఞానము అను రేవు)
తెళివుత్తు –
తిరువాయిమొళి 7.5.11 “తెళివుత్త ఆయిరమ్”(జ్ఞానప్రదమైన వేయి పాశురములు) అని చెప్పినట్టు మునుపటి దోషములు పోయి తేటపడి
ఆళ్ పొరుళై అఴివిత్తతు –
నాన్ముగన్ తిరువందాది 1 “అఴివిత్తేన్ ఆళ్పొరుళై” (తెలుసుకొనుటకు కష్టమైన వాటి అర్థములను ఉపదేశించి) అని చెప్పినట్టు నిగూడార్ధములను, రహస్యార్థములను అన్నింటినీ తెలిపినది అని.
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/06/21/acharya-hrudhayam-71-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org