చూర్ణిక – 72
అవతారిక
అయితే వేదమునకు అధ్యయన కాల నియమము మరియు అధికారి నియమములు కలవు కదా మరి అట్టి వేదము యొక్క అవతారము అయిన ఈ ప్రబంధములకు అటువంటి నియమములు ఎందుకు వర్తించవు అని అడిగినచో దానికి నాయనార్లు సమాధానమును కృప చేయుచున్నారు.
చూర్ణిక
మేఘమ్ పరుకిన సముద్రామ్బుపోలే నూఴ్కడల్ శొల్ ఇవర్ వాయినవాయ్ తిరున్దినవాఴే సర్వదా సర్వోపజీవ్యమామే
సంక్షిప్త వివరణ
ఎలా అయితే మేఘముచే తిరగబడిన సముద్ర జలములు ఎప్పుడూ అందరికీ ఉపకరించునో అదే విధముగా వేదము ఆళ్వార్ల తిరు వాక్కుల నుండి దివ్య ప్రబంధములుగా అవతరించాక ఎప్పుడు అందరికి ఆధారమగును కదా!
వ్యాఖ్యానము
మేఘమ్ పరుకిన సముద్రామ్బుపోలే –
అనగా ఉప్పగా ఉండు సముద్ర జలములు దానిలో ఉండు జీవరాశికి మాత్రమే ఉపయోగపడును, బయట ఉండు వారు అట్టి సముద్ర జలములను పర్వ దినములలో తప్ప తక్కిన దినములలో స్పృశింపకూడని నియమము కలదు. మేఘము ఆ సముద్ర జలములను త్రాగినందువలన ఆ జలములకు వైరస్యము(ఉప్పాదనము) పోయి అన్ని వేళలా అందరికి భోగ్యమగును,
నూఴ్కడల్ –
వేద విద్యా సముద్రముగా పిలువబడు వేదమునకు మూండ్రామ్ తిరువందాది 32 “నూఴ్కడల్” (విస్తారమగు సముద్రము వంటి శాస్త్రములు) 1) అధ్యయన కాల విధి(వేదమును అభ్యసించుటకు కాల నియమము కలదు) మను స్మృతి 4.95 “శ్రావణ్యమ్ ప్రౌష్టపద్యాం వా ఉపాకృత్య యధావిధి యుక్తశ్చన్దాం స్యధీయీత మాసాన్ విప్రోర్ధ పంచమాన్”(శ్రావణము లేదా బాధ్రపద మాసములో కాని శాస్త్రము ప్రకారము బ్రాహ్మణుడు ఉపాకర్మను ఆచరించి నాలుగున్నర నెలల పాటు వేదాధ్యయనమును చేయవలెను) అనియు మను స్మృతి 4.98 “అత ఊర్ధ్వం తు ఛన్దాంసి శుక్లేతు నియతః పఠేత్ వేదాంగాని రహస్యంచ కృష్ణ పక్షేతు సమ్పఠేత్”(అటు పిమ్మట సత్ప్రవర్తనతో శుక్ల పక్షము లో వేదమును, కృష్ణ పక్షంలో వేదాంగాలను, ఉపనిషత్తులను అధ్యయన నియమము మరియు మొదటి మూడు వర్ణములకే అధికార నియమము ఉండుట వలన అట్టి వేదము ఆళ్వార్ల తీరు వాక్కులను పొంది తిరువాయిమొళి 6.5.7 “ఇవళ్ వాయన్గళ్ తిరున్దవే”(ఇంకా స్వచ్ఛము అగుటకు ఆమె చే పలుకుబడి) అని చెప్పినట్టు ఆళ్వార్ల వాక్కును పొంది కాల నియమ, అధికార నియమములను అపేక్షించని స్థితిని పొందినదై అందరికి యోగ్యదాయకమై శ్రీ పాంచరాత్రము “అధ్యేతవ్యం ద్విజ శ్రేష్ఠైః వేద రూపమ్ ఇదమ్ కృతమ్ స్త్రీభి శ్శూద్రాదిభిశ్చైవ తేషామ్ ముక్తిః కరే స్థితా”(వేదముగా రచింపబడినట్టి ఈ తిరువాయిమొళి ప్రబంధము శ్రేష్ఠములగు బ్రాహ్మణుల చేతను, స్త్రీ ల చేతను, శూద్రుల చేతను చదువతగినది. దీనిని సేవించిన వారికి పరమపదము అరచేతిలో ఉండును.)
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/06/21/acharya-hrudhayam-72-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org