శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవ సంప్రదాయం లో, శ్రీ రామాయణం ఒక ముఖ్యమైన శాస్త్రం గా కీర్తించారు. దీనిలో భగవానుడి, శ్రీ మహాలక్ష్మి మరియు వారి భక్తుల వైభవం చక్కగా చూపబడింది. శరణాగతి తత్వము చాలా స్పష్టముగా వివరించిన కారణముగా, దీనిని శరణాగతి శాస్త్రం గా కీర్తించారు.

శ్రీమన్నారాయణుడు, శ్రీ మహలక్ష్మి భర్త, దేవతల మొరలు ఆలకించి, ఈ లోకంలో దశరథ చక్రవర్తికి దివ్య కుమారుడిగా అవతరించాడు. ఈ విధముగా అవతరించిన వారు, తను కళ్యాణ గుణాలతో, మానవులలో ఒకరి గా జీవించాడు. సాధారణముగా, గుణవంతుడు అయిన మానవుడిని స్తుతిస్తారు. తాను స్వయముగా భగవంతుడు, సర్వేశ్వరుడు, సృష్టించే వాడు, కాపాడువాడు, లోకాలను లయం చేయువాడు, సన్మార్గం చూపి, సమస్త లోకములోని మానవులకు మోక్షం ఇచ్చు వాడు, శ్రీ రామావతారంలో, తన సుగుణాల చేత మరియు తన అందము చేత ఈ లోకాల వారిచే కీర్తింపబడి పూజింపబడ్డాడు.

శ్రీ రాముని దివ్య చరితం ఆది కావ్యముగా వాల్మీకి భగవానునిచే రచింపబడింది. బ్రహ్మ యొక్క అనుగ్రహం చేత వాల్మీకి భగవానుడు, ఆ రామచంద్ర మూర్తి యోక్క ప్రతీ క్రియను ఎంతో అందముగా వివరించారు. ఇదే మనకు తెలిసిన శ్రీ రామాయణం. మన ఆచార్య పరంపరలో, అత్యంత కరుణ కలిగిన వారు పేరియవాచ్చాన్ పిళ్లై, వ్యాఖ్యాన చక్రవర్తి గా కీర్తి గడించారు, శ్రీ రాముల వారి చరిత్రను ఒక్క అందమైన వచనకావ్య ప్రబంధం, ఆఴ్వార్ పాశురాలలోని దివ్య పదాలతో రచించనదే ‘పాశురప్పడి రామాయణం’. ఈ ప్రబంధంను అనుసరించి, మనం శ్రీ రాముని లీలను మరియు వాటి వెనుక ఉన్న సారం అనుభవిద్దాం.

మూలం – https://granthams.koyil.org/srirama-leela-english/

అడియేన్ ఆకాశ్ రామానుజ దాసన్

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment