శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం
అతి బలవంతుడు అయిన హనుమంతుడు మహా సముద్రాన్ని దాటి, అనేక కోట గోడల కలిగిన లంక లోని అశోక వనంలో ప్రవేశించి సీత అమ్మవారిని చేరారు. వైదేహి( సీతమ్మ )ను కలిసి రామ చరితాన్న విపులముగా వివరించి, ఉంగరాన్ని సమర్పించారు. అమ్మవారికి హనుమంతుడు వివరించిన సంఘటనలు ఇవి:
- ఒక్కసారి శ్రీఅయోధ్యలో, సీత అమ్మవారు మరియు శ్రీరాముడు సుఖముగా ఉన్న సమయంలో, ఒక్క విశేషమైన రాత్రి, అమ్మవారు, స్వామిని మల్లె పూల దండ తో కట్టివేశారు.
- శ్రీ రాముడి పట్టాభిషేకం నిర్ణయించిన సమయంలో, గూని మంథర, కైకేయి మనసుని కలిచివేసింది. కైకేయి, దశరథ చక్రవర్తిని, భరతుని పట్టాభిషేకం, రాముని వనవాసం అను రెండు వారాలు కోరగా, అది విన్న చక్రవర్తి శోకముతో, రాముడిని “వనానికి వెళ్ళు” అని వారిని సాగనంపగా. సీత లక్ష్మణ సమేతముగా శ్రీరాముడు వన వాసానికి వెళ్లారు.
- గంగా నది తీరమున, బోయవారి నాయకుడు అయిన గుహుడిని ప్రాణస్నేహితుడిగా స్వీకరించాడు.
- చిత్రకూట పర్వతం పైన ఉండగా, భరతుడు వచ్చి శ్రీరాముడికి శరణాగతి చేసి, అయోధ్యకు తిరిగి రమ్మని కోరగా, శ్రీరాముడు నిరాకరించి తన పాదుకలను అనుగ్రహించాడు.
- అసుర ప్రవృత్తి కలిగిన కాకి ఒక్కటి, సీతమ్మ వడిలో శ్రీ రాముడు విశ్రమిస్తుండగా, సీతమ్మవారి వక్షస్థలం పైన పొడవగా, ఉగ్రుడైన శ్రీరాముడు, ఆ కాకి పైన బ్రహ్మాస్త్రం సంధించగా, ముల్లోకాలు తిరిగి శ్రీ రాముడి పాదపద్మల వద్ద పడగా. అమ్మవారి పురుషకారంతో దాని కన్ను మాత్రమే నశింప చేశాడు.
- శూర్పణక ప్రోత్బలం కారణముగా రావణుడు మారీచున్ని బంగారు లేడీగా పంపగా. అదీ చూసిన అమ్మవారు దాన్ని మోహించగా, అమ్మవారి పైన ప్రేమ తో , కోదండంతో దాన్ని వెంబడించగా, కాసేపటికి లక్ష్మణుడు అమ్మవారి నుండి వేరు పడ్డాడు.
ఈ విధముగా, హనుమంతుడు అమ్మవారికి, శ్రీరాముడు చెప్పిన విషయాలు తెలపుతూ, ఉంగరాన్ని అందించారు. అందమైన కురులు కలిగిన సీతమ్మ, ఆ ఉంగరాన్ని చూసి, ఆనందముగా ఆ ఉంగరాన్ని తలపైన ఉంచి. హనుమంతుడు చెప్పిన గుర్తులు నిజము అని అంగీకరించారు.
అటుపిమ్మట, రాక్షసులు, అతి బలవంతుడు అయిన, హనుమంతుడి పైన దాడి చెయ్యగా, హనుమంతుడు వారిని సులువుగా సంహరించాడు. మరియు రావణుడి కుమారుడు అయిన అక్షుడిని చంపగా. ఇంద్రజిత్తు, హనుమంతుడిని బంధించి రావణుడి ముందర ప్రవేశ పెట్టాడు. అప్పుడు హనుమంతుడు రావణుడికి మంచి మాటలు చెప్పగా. హనుమంతుడిని చంపమని ఆదేశాలు జారి చేశాడు. దానితో వారు హనుమంతుడి తోకకు నిప్పు అంటివ్వగా. ఆ నిప్పుతోనే హనుమంతుడు లంకను దహింప చేశాడు.
అప్పుడు, హనుమంతుడు అశోక వనానికి వెళ్లి, సీత అమ్మవారిని, మోసుకుని వెళ్లి శ్రీరాముడి వద్ద చెరుస్తాను అని చెప్పగా,అమ్మవారు నిరాకరించారు. ఒకవేళ శ్రీ రాముడు ఒక్క మాసంలో తన వద్దకు రాక పోతే, ప్రాణా త్యాగం చేస్తాను అని తెలిపింది.
హనుమంతుడు, అక్కడనుండి బయలుదేరి సముద్రం దాటి, వానరులు వేచి ఉన్న చోటికి చేరి వారు అందరు ఎదురు చూస్తున్న శుభవార్తను తెలిపాడు. వారు కిష్కిందా వైపు బయలుదేరి మార్గ మధ్యమున సుగ్రీవుడికి ఇష్టమైన, మధువనం, అనే వాటికలో విశ్రమించి దాన్ని కొల్లగొట్టారు. చివరగా వారు శ్రీరాముడు ఉండే చోటకు చేరి, హనుమంతుడు సీతమ్మవారిని చూసాను అని శుభవార్తను శ్రీరాముడికి విన్నవించి, శ్రీరాముడిని సంతోష పరిచాడు.
సారం
- ఈ కాండానికి సుందరకాండం అని పేరు, ఈ కాండం సీత అమ్మవారి మరియు హనుమంతుడి వైభవం తెలపడం చేతనే, వారు ఇద్దరు సుందరమైన రూపం మరియు సుందరమైన వాక్కు కలిగిన వారు.
- హనుమంతుడు చక్కని వాక్దాటి కలిగిన వాడు. తాను అమ్మవారి దుఃఖం తీరే విధముగా మరియు వారి ఆత్మహత్యా ప్రయత్నాన్ని ఆపే విధముగా మాట్లాడాడు.
- హనుమంతుడు, కార్య సాధనకు గొప్ప ఉదాహరణ. అమ్మవారి జాడ కనిపెట్టడం మొదటి లక్ష్యం అయినప్పటికీ, లంక దహనం చేసి, రావణుడి హృదయంలో భయం నెలకొలిపి, శ్రీరాముడి సంకల్పానుసారం వ్యవహరించాడు.
- ఎప్పుడైతే హనుమంతుడు, అమ్మవారిని మోసుకుని శ్రీరాముడి వద్దకు చేరుస్తాను అని అడగగా, అమ్మవారు నిరాకరించారు. శ్రీరాముడు వచ్చి లంకను ద్వంసం చేసి, తనను రక్షించాలి అని దృఢంగా చెప్పారు.
- హనుమంతుడు, సీతాన్వేషణ ద్వారా, అమ్మవారిని రక్షించాడు. తత్ ద్వారా అమ్మవారే సర్వస్వముగా భావించే శ్రీరాముడిని, శ్రీరాముడి కారణముగా జీవించే లోకాన్ని కాపాడాడు.
అడియేన్ ఆకాశ్ రామానుజ దాసన్
మూలం — https://granthams.koyil.org/2024/11/25/srirama-leela-sundhara-kandam-english/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org