శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం – యుద్ధ కాండం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం

<< కిష్కిందా కాండం

సీత అమ్మవారి జాడ తెలియగానే, వారు అమ్మవారిని కాపాడే ప్రయత్నాన్ని మొదలు పెట్టారు. మొదట సుగ్రీవుడు, వివిధ దిక్కులల్లో వెళ్లిన వానరులు అందరికి సందేశం పంపించగా, వారు అందరు కిష్కిందా చేరగానే, వారంతా దక్షిణ దిక్కులోని సముద్ర తీరం చేరారు. ఆ సమయంలో శ్రీ రాముడు మరియు ఇతరులు ఈ సముద్రం ఎలా దాటాలి అని ఆలోచనలో నిమగ్నం అయ్యారు.

ఆ సమయమున విభీషణుడు, రావణుడిని సీతమ్మవారిని శ్రీరాముడు వద్ద చేర్చమని అని సూచించాడు. ఇది విన్న రావణుడు మరియు ఇంద్రజిత్తు కోపముగా విభీషణుడిని దూషించారు. ఇది విన్న విభీషణుడు వెంటనే నలుగురు మంత్రులతో కలిసి ఆకాశ మార్గాన బయలుదేరి, శ్రీరాముడు ఉన్న చోటికి చేరగా, మొదట సుగ్రీవాదులు వారిని సంహరించాలి అని అనుకున్నారు,. ఆ సమయంలో, తాను శ్రీ రాముడికి శరణాగతి చెయ్యటానికి వచ్చాను అని చెప్పగా, అది విన్న శ్రీరాముడు, ఈ స్థితి గురించి సుగ్రీవాదుల అభిప్రాయం అడగగా, విభీషణుడిని స్వీకరించకుండా సంహరించాలి అని సూచించారు, హనుమంతుడు మాత్రం, మంచివాడు కాబట్టి విభీషణుడిని స్వీకరించాలి అని చెప్పాడు. అన్నీ విన్న శ్రీరాముడు, తాను దుష్టుడు అయినా, శరణాగతి అని వచ్చిన వారిని స్వీకరిస్తాను అని చెప్పారు. విభీషణుడిని తీసుకుని రమ్మని సుగ్రీవుడిని పంపించి, శరణాగతిని స్వీకరించారు. అంత మాత్రమే కాక, శ్రీరాముడు విభీషణుడిని తమ్ముడిగా స్వీకరించి, లంకాధిపతి గా పట్టాభిషేకం చేశారు.

ఆ తర్వాత విభీషణుడు, శ్రీరాముడిని సముద్రరాజునికి శరణాగతి చెయ్యమని సూచించాడు. ఆ ప్రకారంగా, శ్రీరాముడు, స్నానం ఆచరించి, సముద్రరాజుకు శరణగతి చేసి సముద్ర తీరన 3 రోజులు శయనించారు. సముద్రరాజు అయినను రాని కారణముగా, శ్రీరాముడు, ధనుర్భానాలను పట్టుకురమ్మని లక్ష్మణుడిని ఆదేశించి, సముద్రుడిని ఆవిరిచేస్తాను అని బాణాన్ని సంధించగా, భయపడ్డ సముద్రుడు పరుగున వచ్చి, క్షమించమని కోరాడు. శ్రీరాముడు అప్పుడు ఆ బాణాన్ని సముద్రుడి శత్రువుల పైన వదిలిపెట్టరు. సముద్రుడు సేతుబంధనానికి అంగీకరించాడు. వానరుల ద్వారా సేతుబంధనం చేసి, అందరు లంకా నగరం చేరారు. వారి రాకను రావణుడికి తెలిపి యుద్ధానికి సిద్ధపడ్డారు.

యుద్ధం ఆరంభమైంది. శ్రీరాముడు శరవర్షం కురిపించి రావణుడి సైన్యాన్ని నశింపచేశారు. ఒక్కొక్కరిగా కుంబ, నికుంబ, ఇంద్రజిత్, కుంభకర్ణుడు మొదలైన వారు అందరు సంహరింప పడ్డారు. ఆ తర్వాత విభీషణుడి సలహామేరకు, శ్రీరాముడు, రావణుడి తలలు త్రుంచి, సంహరించారు. అలా శ్రీరాముడు జయించగా, బ్రహ్మ రుద్రాది దేవతలు అందరు అక్కడికి వచ్చి పుష్పవృష్టి కురిపించి, స్తుతించారు.

శ్రీరాముడు, విభీషణుడు ద్వారా సీతమ్మవారిని రప్పించి, అందరితో కలిసి పుష్పవిమానం అధిష్ఠించి, శ్రీ అయోధ్య వైపు ప్రయాణించారు. మార్గమధ్యమున భరద్వాజ ఆశ్రమం చేరి, శ్రీరాముడు హనుమంతుడిని, తన రాక కోసం వేచి చూస్తున్న భరతునికి, శ్రీరాముడు వేంచేస్తున్నారు అన్న శుభవార్త తెలిపారు. ఆ విధముగా వారు శ్రీ అయోధ్య చేరి ఆలింగనం తో భరతుని బాధని నివారించారు.

ఆ తర్వాత, వశిష్ఠుడు పట్టాభిషేకానికి ఏర్పాటు చేస్తారు. అన్ని దిక్కులలో ఉన్న పుణ్య నదీ జలాలు తెప్పించారు. సీతమ్మవారిని మరియు శ్రీరాముడిని పట్టు పీతాంబరాలు, పూల మాలలు మరియు గంధాదుల తో అలంకరించారు. వారు ఇద్దరు సింహాసనాన్ని అధిష్ఠించగా, భరత, లక్ష్మణ, శత్రుజ్ఞ, సుగ్రీవ, విభీషణ, దేవతలు, మరియు ఋషుల సమాక్షములో, పట్టిభిషేకం గావించారు. ఆ సమయంలో విచ్చేసిన అతిథులకు శ్రీరాముడు మర్యాద సత్కారములు చేశారు.

ఆ తర్వాత, శ్రీరాముడు, శ్రీ అయోధ్య లో వేంచేసి, జనరంజకముగా రామరాజ్యాన్ని స్థాపించారు.

సారం

  • మన సంప్రదాయంలో, “కడర్కరై వార్తై” (సముద్ర తీరం మాటలు) చాలా విశేషం. వేళ్ వెట్టి పిళ్లై అనే ఒక్క శ్రీవైష్ణవులు, నంపిళ్ళై స్వామిని ఇలా అడిగారు, “శ్రీరాముడు, అన్ని నియమాలని పాటిస్తూ శరణాగతి చేశాడు, కానీ విభీషణుడు, ఏ నియమం లేకుండా శరణాగతి చేశారు కదా, ఏది సరియైనది?”. నంపిళ్ళై స్వామి చెప్పారు “వీటిలో అనుష్ఠానమో, లేమియో, ఏదీ ముఖ్యం కాదు, మంచి అనుష్ఠానం ఉన్న వారు అనుష్ఠానంతో, అదీ లేని వారు లేకుండా శరణాగతి చెయ్యాలి, శరణాగతి వాటిలో ఏది ఆశించదు.” అనగా మనం శరణాగతి చేసేటప్పుడు భగవంతుడు ఏది మనలో ఆశించాడు.
  • శ్రీరాముడు అభయప్రదానం చేసే సమయం లో విభీషణుడిలో మరియు రావణుడిలో అనేక దోషాలు ఉన్నపటికీ, శ్రీరాముడు ఏ సంకోచం లేకుండా స్వీకరించాడు, ఇది వారిలోని వాత్సల్యాన్ని దర్శింప చేస్తుంది.
  • విభీషణుడు, శ్రీరాముడికి చేసిన శరణాగతి ఫలించింది. అదే విధానం పాటించమని సూచించాడు, కానీ శ్రీరాముడు సర్వేశ్వరుడు మరియు సముద్రరాజు కళ్యాణ గుణ పూర్ణుడు కానీ చేత, శరణాగతి ఫలించలేదు.
  • రావణుడు చేసిన అనేక అపచారాలు కారణంగా, శ్రీరాముడు చేతిలో హింసించపడి, అతని బంధు-మిత్రులు చనిపోయారు, ఏకాకిగా మిగిలాడు, చివరిగా సంహరించబడ్డాడు, కానీ భాగవత అపచారం కారణంగా శ్రీ రాముడి ఆగ్రహానికి గురి అయ్యి, క్రూరమైన మరణాన్ని పొందాడు.
  • శ్రీరాముడు యుద్ధం అయిన వెంటనే పుష్పక విమానం అధిరోహించి, శ్రీ అయోధ్య దగ్గర ఉన్న భరద్వాజ మహర్షి ఆశ్రమం వద్దకి చేరాడు, కాబట్టి శ్రీరాముడు, రామేశ్వరం వద్ద లింగానికి పూజ చెయ్యటం అప్రామాణికమైనది అయినది. రామావతారం ప్రయోజనమే రావణ సంహారం, కావున రావణ సంహారం వల్ల పాపం కలిగింది అనటం తగని వాదన.
  • రామ రాజ్యం అనగా ఎల్లప్పుడూ న్యాయం జరిగే పాలన. జనులు అంతా ధర్మాన్ని పాటిస్తూ సుఖముగా జీవించారు.

మూలం — https://granthams.koyil.org/2024/11/30/srirama-leela-yudhdha-kandam-english/

అడియేన్ ఆకాశ్ రామానుజ దాసన్

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment