శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం – నిగమనం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం

<< యుద్ధ కాండం

కొంత కాలానికి, సీత అమ్మవారు గర్భవతి అయ్యారు. ఆ సమయంలో, రాజ్యంలోని ఒక పౌరుడు అన్నాడు, అమ్మవారు కొంత కాలం రావణుడి కొలువులో ఉన్నారు అని. ఇది విన్న శ్రీరాముడు, సీత అమ్మవారిని లక్ష్మణుడి ద్వారా అడువుల లోకి పంపాడు. అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉంటూ అమ్మవారు, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి వారికి కుశ మరియు లవ అని పేరు పెట్టింది. వాల్మీకి మహర్షి అనుగ్రహం చేత, ఇద్దరు చక్కగా పెరిగి, శ్రీరామచరిత్రం నేర్చుకుని పాటలుగా అందంగా పాడారు. అది విన్న శ్రీరాముడు వారిని సభా ప్రాంగణానికి పిలిపించి, అక్కడ పురప్రజలతో పాటుగా తన చరిత్రను విని ఆస్వాదించాడు. ఆ తర్వాత సీతమ్మవారిని సభ లోనికి పిలిపించి, తన పారతంత్ర్యాన్ని అగ్నిప్రవేశం ద్వారా నిరూపించమని చెప్పగా. అమ్మవారు పాటించి, అటుపిమ్మట భూమిదేవి అమ్మవారిని స్వీకరించింది. అమ్మవారు పరమపదానికి వేంచేశారు.

ఈ విధముగా, సీతమ్మవారు, శ్రీరాముడి నుండి మూడు సార్లు వేరు అయ్యారు. ఈ మూడు సార్లు వేరవ్వటాన్ని పిళ్లై లోకాచార్యులు, తన శ్రీవచనభూషణం అనే దివ్యశాస్త్రంలో ఇలా వివరించారు, అది మనకు మనవాళమామునిగళ్ వారి దివ్య వ్యాక్యానం కారణంగా ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. మొదటి సారి, అమ్మవారి కారుణ్యం చూపుతూ, తనకు తానే లంకకు వెళ్లి చెరబడి, శ్రీరాముడు తనను మరియు రావణుడి చెరలో, ఉన్న ఇతర దేవత స్త్రీలను కాపాడేలా చేశారు. రెండవ సారి, తన పారతంత్ర్యం చూపుతూ, అడివిలోకి వెళ్లి జీవించింది. ఇక మూడవ సారి, తన అనన్యార్హ శేషత్వం చూపుతూ(స్వామికి తప్ప ఇంకొకరికి శేషిగా ఉండకపోవటం), తాను శ్రీరాముడి నుండి వేరుపడి, భూప్రవేశం చేసి, పరమపదానికి వేంచేశారు. ఈ మూడు వేరుపాట్లు, ఈ లోకానికి అమ్మవారి వైభవం తెలియ చెప్పటానికి జరిపారు.

శ్రీరాముడు, చతుర్థ వర్ణస్తుడు అయిన శంభుకుణ్ణి వధించడం సాధారణముగా తప్పుగా ప్రచారం చేస్తారు. శంభుకుడు, లోభముతో, రుద్ర పదవి పొంది పార్వతి దేవిని అనుభవించాలి అని తపస్సు చేశాడు, ఆ తపస్సు కారణం చేత ఒక వైదికుడి కుమారుడు మృతి చెందాడు, కావున శ్రీరాముడు, శంభుకుడిని వెతికి సంహరించి, ఆ వైదికుడి కుమారుడిని తిరిగి బ్రతికించాడు.

ఈ విధముగా, శ్రీరాముడు, పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించెను. తర్వాత, లక్ష్మణుడిని పరమపదం ముందుగా పంపించి, తర్వాత శ్రీరాముడు పరమపదానికి బయలుదేరాడు, ఆ సమయంలో, శ్రీ అయోధ్యలోని ప్రతి ఒక్కరినీ తనతో పాటు తీసుకుని వెళ్లాడు. హనుమంతుడు మాత్రం “శ్రీరాముడి దివ్య రూపాన్ని చూసిన తను ఇంకో రూపాన్ని చూడను అని” ఈ లోకంలోనే ఉండిపోయాడు. ఎంత భక్తి హనుమంతుడికి శ్రీరామావతారం పైన! ఈ విధముగా శ్రీ రాముడి చరిత్ర పూర్తి అయ్యింది.

నమ్మాళ్వార్ “కర్పార్ ఇరామపిరానై అల్లాల్ మట్రుమ్ కర్పరో” అని చెప్పారు. (తెలుసుకోవాలి అనుకునే వారు, శ్రీరామ పిరాన్ని తప్ప ఇంకెవరినైనా తెలుసుకుంటారా?) అనియు, మరియు శ్రీకృష్ణుడు అంటే ప్రేమ కల్గిన ఆండాళ్ నాచియార్ కూడా శ్రీరాముడిని “మనతుక్కినియన్” (మనసుకి ప్రియమైన వాడు) అని. ఈ విధముగా శ్రీరామవతారం అంటే ఆళ్వార్లు ఎంతగానో అభిమానించిన అవతారం. మనం ఇక్కడ భగవంతుడి లీలలను కొంత అనుభవించే ప్రయత్నం చేశాం. మన లక్ష్యం సీతమ్మవారు మరియు శ్రీరామచంద్రుడిని తన హృదయంలో నిలుపుకున్న దాస హనుమంతుడి తిరువడికి(పాదపద్మలకు) మరియు ఆళ్వార్ ఆచార్యుల తిరువడికి నిత్య దాస్యం చెయ్యటం.

ఆళ్వార్ ఎంపెరుమానార్ జీయర్ తిరువడిగాళే శరణం

మూలం — https://granthams.koyil.org/2024/12/02/srirama-leelas-conclusion-english/

అడియేన్ ఆకాశ్ రామానుజ దాసన్

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment