ఆచార్య హ్రుదయం – 74

ఆచార్య హృదయం

<< చూర్ణిక 73

చూర్ణిక – 74

అవతారిక
అటు పిమ్మట 70వ చూర్ణికలో చెప్పబడిన ఉత్క్రుష్టమైన ప్రమాణము (శాస్త్రము) మరియు ప్రమేయము (సర్వేశ్వరుడు) విషయము గురించిన విచారమును ఈ విధముగా చెప్పుచూ “ఉత్క్రుష్టమైన ప్రమాణము తిరువాయిమొళి మరియు ప్రమేయము అయిన అర్చావతార విషయము వీటి యొక్క పూర్వావస్థయందు వీటిని తెలుసుకొనుటకు యోగ్యత లేని వారికి సులభమైనది గాను బయలుపరచబడినది” నాయనార్లు ముగించుచున్నారు.

చూర్ణిక
పెరుమ్ పుఴక్కడలుమ్ శ్రుతిసాగరముమ్ అలైత్తు ఆళ్ న్దుఓడుమిడజ్ఞ్గళిల్ అయోగ్యర్ క్కు చ్ఛమైత్తమడువుమ్ శాయ్ కరకముమ్ మానమేయచరమమ్

సంక్షిప్త వ్యాఖ్యానము
సముద్రము వలె విస్తారమైన సర్వేశ్వరుని మరియు శాస్త్ర విషయ ప్రవాహమున నిమగ్నము కాలేని అయోగ్యుల కోసము సిద్ధముగా ఉన్న చెరువులు ప్రమేయము మరియు నీటి కుండలు ప్రమాణము అగును.

వ్యాఖ్యానము
అనగా, అన్ని సముద్రముల కంటే బాహ్యమైనదై తనంతట తాను పెద్దదిగా అయ్యే సముద్రము వలనే అనంతమగు పరవస్తువైన సర్వేశ్వరుడు ఈ విధముగా ఉండును.

– సముద్రము అలలు కొట్టినట్టు మరియు ప్రవహించునట్టు మాదిరిగా వ్యూహ స్థితిలో జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి మరియు తేజస్సు అను ఆరు గుణములతో పరిపూర్ణముగా ఉంటూ చెరో రెండు గుణములను సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అను మూడు రూపములలో ప్రకటింపజేయును.
– సముద్రము లోతు తెలియనట్టి అగాధముగా ఉండు ప్రదేశము వలె బృహదారణ్యక ఉపనిషత్తు 5.7.22 “య ఆత్మా న వేద”(ఎవనిని ఆత్మ తెలుసుకొనలేదో) అనియు తిరువాయిమొళి 7.2.3 “కట్కీలీ”(కంటితో చూచుటకు సాధ్యము కానట్టి వాడైన ఆ సర్వేశ్వరుడు) అని చెప్పినట్టు కంటికి కనిపించకుండా అంతర్యామి స్థితిలో ఉండును.
– సముద్రము అనేక ఉప్పు మడుగులుగా పారినట్టు శ్రీ రామాయణము అయోధ్యా కాండము 1.7 “మానుషే లోకే జజ్ఞే విష్ణుః సనాతనః” (సనాతనమగు సర్వ స్వామి అయిన విష్ణువు ఈ లోకమున అవతరించెనా?) అనియు హరి వంశము 1.13.62 “నాగపర్యంకమ్ ఉత్సృజ్య హ్యాగతో మధురామ్ పురీమ్”(శయ్యగా ఉన్న ఆది శేషుల వారిని విడిచి విష్ణువు మధురలో అవతరించారు) అనియు “విష్ణుః మానుష రూపేణ చచార వసుధాతలే”(మానవ రూపములో ఈ లోకమున సంచరించిన విష్ణువు) అని చెప్పినట్టు కంటికి కనబడు రీతిలో విభవావతార స్థితిలో ఉంటూ ఈ లోకమున సంచరించెను.

ఆలా ఆ సర్వేశ్వరుడిని ఆయా స్థితులలో అనుభవించునట్టి యోగ్యత(దేశ, కాల, దూరము వలన) లేని వారికి శ్రీ వచన భూషణము 39 “అధిలే తేన్గిన మడుక్కళ్ పోలే అర్చావతారమ్”(వరద తరువాత ఏర్పడు తటాకముల వంటివి ఈ అర్చావతారము) అని చెప్పినట్టు దేశ, కాల బేధము లేకుండా ఉండునట్టి ఎంతో సులభమైన విషయము ప్రమేయ వస్తువు యొక్క అవతార పరంపరలో అంతిమ అవస్థ అయిన అర్చావతారము.

“మడిమన్దానమ్ ఆవిద్య యేనాసౌ శృష్ఠిసాగరాత్”(ఆ వేదవ్యాస భగవానునిచే జ్ఞానము అను కవ్వముతో చిలుకబడిన సముద్రము వంటి విస్తారమైన వేదము) అని చెప్పినట్టు అనంతమగు మరియు పరత్వమును ప్రతిపాదించు వేదము ఈ విధముగా ఉండును.

– వ్యూహ స్థితిని తెలుపు శ్రీ పాంచరాత్ర అవస్థ సముద్రపు అలలా ఉండును.
-అంతర్యామి స్థితిని తెలుపు మనువు మొదలగు స్మృతి సముద్రపు అగాధమగు ప్రదేశము వలె గోచరము చేసుకొనుటకు దుర్లభముగా ఉండును.
– సముద్రము ఉప్పు మడుగులుగా పారునట్లు ఆ సర్వేశ్వరుని అవతారములను ప్రతిపాదించుటచే ఇతిహాస, పురాణ రూపముగా విస్తరించి వ్యాప్తించినప్పుడు

జ్ఞానరాహిత్యము వలన అర్థములను గ్రహించి తరించు యోగ్యత లేని వారికి మరియు వారి తాపమును పోగొట్టుకొనలేని వారికి దాహముగా ఉన్నవాడికి నోరు తెరచి ఉండగా చల్లని జలము తనంతట తానుగా వచ్చి పడునట్లు కల్పించబడిన పాత్రము వలె అనాయాసముగా అనుభవించుటకు తగినట్లు సులభమైన శాస్త్రము మరియు వేదము యొక్క అవతారము మరియు అంతిమ దశ అయిన తిరువాయిమొళి అని చెప్పుట వంటిది.

దీనితో అర్చావతారము (“మడుగు వంటిది”) మరియు తిరువాయిమొళి (“పాత్రము వంటిది”) అనుటచే ప్రమాణ ప్రమేయముల యొక్క తేజస్సును, సౌలభ్యమును, భోగ్యత మొదలగు సద్గుణములు వీటి యందు కూడి ఉన్నవి అని చెప్పబడినది.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/06/29/acharya-hrudhayam-74-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment