ఆచార్య హృదయం – 75

ఆచార్య హృదయం

<< చూర్ణిక – 74

అవతారిక
ఈ విధముగా ప్రమాణము(తిరువాయిమొళి) మరియు ప్రమేయముల(అర్చావతారము) వైభవమును బయలుపరచిన తరువాత ప్రమాతృ(తిరువాయిమొళి చెప్పిన నమ్మాళ్వార్ల) వైభవుమును విస్తారముగా నాయనార్లు ప్రతిపాదించుచున్నారు. అందులో మొదటగా ఈ విధముగా అడిగినచో “తిరువాయిమొళి మరియు అర్చావతారములు గొప్పవి అయినప్పటికిని, ఈ ప్రబంధకర్త చతుర్ధ (శూద్ర) వర్ణమునకు చెందిన వారు కదా?” నాయనార్లు ఈ విధముగా సమాధానమును ఇచ్చుచున్నారు – భాగవతులలో శ్రేష్ఠులైన ఆళ్వార్ల జన్మ ఇటువంటిది అని నిరూపించుట వలన కలుగు దోషమును ఇంతక ముందు చెప్పకపోయినా అది ఇదివరకే ఉన్న దానినిగా తలచి ఉదాహరణతో చెప్పుచున్నారు.

గమనిక: నిరూపించుట లేదా విశ్లేషించుట అనగా ఇక్కడ “గొప్పతనమును తగ్గించుటకు చేయు విశ్లేషణ” అని అర్థము.

చూర్ణిక
వీట్టాన్బ  ఇన్బప్పాక్కళిల్ ద్రవ్య భాషా నిరూపణ సమం ఇన్బమారియిల్ ఆరాయిచ్చి

సంక్షిప్త వ్యాఖ్యానము
గృహమునందు వేంచేసియున్న తిరువారాధన అర్చామూర్తి యొక్క ద్రవ్యమును మరియు ఆ సర్వేశ్వరుని కీర్తించుటకు మధురమైన పాటలలో వాడిన భాషను విశ్లేషించుట వంటిదే నమ్మాళ్వార్ల జన్మను విశ్లేషించుట అనునది.

వ్యాఖ్యానము
అనగా – విశ్లేషించుట అను దోషము 1)భగవద్విషయము పట్ల సంతోషముతో పొంగిపోవు మనస్సు కలిగిన వారి గృహములయందు అర్చావతార విషయమున తిరువాయిమొళి 2.3.5 “కనివార్  వీట్టాన్బమ్”(నీయందు అభినివేశము కలిగిన గొప్ప హృదయమును కలిగిన భక్తులకు మోక్ష స్వరూపుడు అయిన వాడు) అని చెప్పినట్టు వారికి ఇష్టమైన పదార్ధములను రూపముగా స్వీకరించి వారికి ఆనందమును వృద్ధిపరచునట్టి అర్చావతార విషయమున మరియు 2)గొప్ప జ్ఞానమును కలిగిన వారికి ఆనందమును కలుగజేయునట్టిది మరియు ఆ సర్వేశ్వరుని కల్యాణ గుణములను ప్రతిపాదించునది అయిన ద్రావిడ భాషలో ఉన్న తిరువాయిమొళి విషయమున భాషా రూపణము చేయుట పెరుమాళ్ తిరుమొళి 1.4 “అమ్ తమిళ్ ఇన్బప్ పా”(ద్రావిడములో ఉన్న పాశురముల వలన కలుగు ఆనందము) అనునది తిరువాయిమొళి రూపముతో శ్రీ వైష్ణవులకు ఆనందమును కురిపించునట్టి మేఘమగు ఆళ్వార్ల జన్మ నిరూపణము వంటిది.

-బ్రహ్మాండ పురాణము “విష్ణోః అర్చావతారేషు లోహభావం కరోతి యః యో గురౌ మానుషమ్ భావమ్ ఉభౌ నరక పాతినౌ”(విష్ణువు యొక్క అర్చావతారమును లోహమని అనుకొను వాడు ఆచార్యుని మనుష్యమాత్రముగా అనుకొనువాడు నరకమును పొందుతాడు).

-“యో విష్ణౌ ప్రతిమాకారే లోహభావం కరోతివై గురౌచ మానుషం భావం ఉభౌ నరక పాతినౌ” (పైన చెప్పబడిన తాత్పర్యమే)

-“అర్చావతార ఉపాదాన వైష్ణవోత్పత్తి చిన్తనమ్ మాతృ యోని పరీక్ష్యాస్ తుల్యమాహుర్ మనీషిణః”(అర్చా మూర్తి యొక్క ద్రవ్యమును మరియు వైష్ణవుని యొక్క పుట్టుకను విశ్లేషించుట అనునది కన్న తల్లి యొక్క యోని పరీక్షతో సమానమై పెద్దలు చెప్పెదరు)

-మాత్స్య పురాణము “హరికీర్తిమ్ వినైవాన్యత్ బ్రాహ్మణేన న నరోత్తమ | భాషాగానమ్ నగాతవ్యమ్ తస్మాత్ పాపమ్ త్వయా కృతమ్”|| (ఓ రాజా! హరి కీర్తనము తప్ప మరి దేనిని కూడా దేశ భాషలో గానము చేయకూడదు కావున నీవు పాపము చేసిన వాడివి అయితివి.)

– భవిష్యోత్తర పురాణము “కిమప్య త్రాభిజాయన్తే యోగినస్సర్వయోనిషు ప్రత్యక్షి తాత్మనాధానాం నైషాం చిన్త్య కులాధికమ్” (ఋషులు అన్ని కులములలో ఈ లోకమున జన్మించెదరు. ఆ పరమాత్మను ప్రత్యక్షముగా దర్శించిన అట్టి ఋషుల జన్మను విచారించకూడదు)

– “శూద్రంవా భగవత్ భక్తమ్ నిషాధం శ్వపచంతధా వీక్షతే జాతి సామాన్యాత్ సయాతి నరకం నరః”శూద్రుడు కాని, ఛాండాలుడు కాని భగవద్భక్తుడు అయిన వాడిని జాతిని బట్టి సామాన్యముగా తలచినట్టి వాడు నరకమును పొందును).

శాస్త్రమున ఉన్న ఈ వాక్యములను తలచి నాయనార్లు ఈ విధముగా కృపతో వివరించారు.

గొప్పతనము గ్రహించక అనాదరణ చేయు మూర్ఖులు శ్రీ భగవద్గీత 9.11 “అవజానన్తి మాం మూఢాః” (నా గొప్ప స్థితిని గ్రహించక నన్ను అనాదరించు   మూర్ఖులు) మరియు నా యందే ప్రేమ కలిగి నన్నే కొలుచు భక్తుల కొరకు స్తోత్ర రత్నము 16 “పశ్యన్తి  కేచిదనిశమ్ త్వదనన్యభావాః”(నీ యందే మనస్సు గల వారు నీ స్వామిత్వమును చూచుచున్నారు) అని చెప్పినట్టు తారతమ్యను గుర్తించి ఆదరించునట్టి అన్య చింత  లేని భగవద్భక్తులను ఈ పైన మూడు విషయములు సమానములే కదా!

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/07/01/acharya-hrudhayam-75-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment