ఆచార్య హృదయం – 77

ఆచార్య హృదయం

<< చూర్ణిక 76

చూర్ణిక – 77

అవతారిక
శ్రీ నమ్మాళ్వార్ల జన్మము, వ్యాసుని మరియు శ్రీ కృష్ణుని జన్మముతో సమానముగా ఇంతక ముందు నాయనార్లు కృప చేసినారు. ఇప్పుడు వీటికి గల తారతమ్యములను కృప చేయుచున్నారు.

చూర్ణిక
కృష్ణ కృష్ణద్వైపాయన ఉత్పత్తిపోలన్ఴే కృష్ణతృష్ణాతత్త్వ జన్మమ్

సంక్షిప్త వ్యాఖ్యానము
 కృష్ణ తృష్ణా తత్త్వముగా తెలియబడు నమ్మాళ్వార్ల జన్మము కృష్ణ మరియు కృష్ణద్వైపాయన(వ్యాస) జన్మము కంటే వేరైనది.

వ్యాఖ్యానము
అనగా – తిరుప్పావై 25 “ఒరుత్తి మగనాయ్ ప్పిఴన్దు ఓరురవిల్ ఒరుత్తి మగనాయ్”(గొప్పదైన దేవకికి కొడుకుగా జన్మించి ఒక్క రాత్రిలోనే యశోద వద్ద కుమారుడిగా పెరుగుటకు గోకులమునకు చేరెను) అని కృష్ణుని గురుంచి చెప్పినట్టు మత్స్య గంధి పుత్రుడగు వ్యాసుడు జన్మముల కంటే వేరైన ఆళ్వార్ల జన్మము గొప్పదిగా తిరువిరుత్తం 37 “కణ్ణన్ నీన్ మలర్పాదమ్ పరవిప్పెత్త”(శ్రీ కృష్ణుని పాదములను ఆశ్రయించి ఈ పరాంకుశ నాయకిని పొందితిమి) అనియు శ్రీ రంగరాజ స్తవం 1.6 “కృష్ణ తృష్ణా తత్త్వమివోదితమ్” (కృష్ణ భక్తి పరాయణుడు) అన్నట్టు శ్రీ కృష్ణుని విషయమగు ఆశయే శరీరముగా వచ్చిన శ్రీ నమ్మాళ్వార్ల అవతారము అని చెప్పుట.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/07/04/acharya-hrudhayam-77-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment