చూర్ణిక – 78
అవతారిక
“ఆళ్వార్ల జన్మ వ్యాసకృష్ణాదుల జన్మము కంటే ఎలా గొప్పది”? అని అడిగినచో దానికి సమాధానముగా అనేక కారణములు చేత ఆళ్వార్ల జన్మము యొక్క గొప్పతనమును చెప్పి అందులో మొదట ఆళ్వార్ల తల్లిగారు వ్యాస, కృష్ణుని తల్లుల కంటే గొప్పవారు అని నాయనార్లు ప్రతిపాదించుచున్నారు.
చూర్ణిక
పెత్తుమ్ పేఴిళన్దుమ్ కన్యకైయానవళుమ్ ఎల్లామ్ పెత్తాళాయుమ్ తత్తుక్కొణ్డాళ్ ఎన్బర్ నిన్నార్ ఎన్ఴుమవళుమ్ నెడుఙ్గాలుమ్ నఙ్గైమీరెన్ను మివర్ క్కు నేరన్ఴే
సంక్షిప్త వ్యాఖ్యానము
దేవకీ పిరాట్టి శ్రీకృష్ణుని కన్నప్పటికీ బాల్య రసమును కోల్పోయినది. వ్యాసుని కన్నప్పటికీ సత్యవతి కన్యకలా ఉండిపోయినది మరియు శ్రీ కృష్ణుని సాకి పెద్ద చేసినది అయిననూ యశోదా పిరాట్టి కృష్ణునికి జన్మ ఇవ్వలేనిది కదా అని అన్నట్టు పరాంకుశ నాయకి అయిన నమ్మాళ్వార్ల తల్లితో సామానులు కారు కదా వీరంతా!
వ్యాఖ్యానము
అనగా
పెత్తుమ్ పేఴెళన్దుమ్
పెఴియ తిరుమొళి 1.2.17 “తిరువిన్ వడివొక్కుమ్ దేవకిప్పెత్త”(పెఴియ పిరాట్టియార్ల స్వభావముగల దేవకీ పిరాట్టిచే జన్మనిచ్చిన) అని చెప్పినట్టు శ్రీ కృష్ణుని కుమారునిగా లభించినప్పటికీ కృష్ణుని యొక్క బాల్య రసమును అనుభవింప లభించనందున అని చెప్పినట్టు పెఴుమాళ్ తిరుమొళి 7.5 “తిరువిలేన్ ఒన్ఴుమ్ పెత్తిలేన్” (భాగ్యము లేని దానినై ఒక్క రసమునూ అనుభవించలేదు)
కన్నిగై ఆనవళుమ్
మహాభారతము “ద్వీపే బదరికామిశ్రే బాదరాయణమచ్యుతం పరాశరాత్ సత్యవతీ పుత్రం లేభే పరంతపమ్”(రేగు పండ్లు అధికముగా ఉండు ఒక అరణ్యములో పరాశరుని ద్వారా నారాయణుని అంశ అయిన వ్యాస అను ఒక పిల్లవాడు లభించెను)అని చెప్పినట్టు సత్యవతి వ్యాసునికి జన్మ ఇచ్చినప్పటికీ పరాశర ఆజ్ఞ వలన వ్యాసుని బాల్య రసము తనకు లభించలేదు. “పునః కన్యా భవతి”(నీవు మళ్ళీ కన్యకవు అగును) అని అన్నట్టు అట్టి మత్స్య గంధి
ఎల్లామ్ పెత్తాళుమ్
పెరుమాళ్ తిరుమొళి 7.5 “ఎల్లామ్ తెయ్ వనఙ్గై యశోతై పెత్తాళే”(దివ్య స్త్రీ అయిన యశోదా పిరాట్టికి అదృష్టము వలన అన్నీ లభించినవే) అని చెప్పినట్టు యశోదా పిరాట్టి కృష్ణుని బాల్య రసమును (చేష్ఠితములను) అనుభవించు భాగ్యము కలది అయినప్పటికీ తాను మరియు ఇతరులు శంకించునట్టి మాతృత్వము కలదై అన్నట్టు పెఴియాళ్వార్ తిరుమొళి 2.1.7 “తత్తుక్కొణ్డాల్ కొలో తనే పెత్తాళ్ కోలో”(తాను కృష్ణుని కన్నదో లేదా ఇతరుల నుంచి పెంచుకున్నదో) అనియు పెరియాళ్వార్ తిరుమొళి 3.1.3 “ఇమ్మాయమ్ వల్ల పిళ్ళై నమ్బి ఉన్నై ఎన్ మగనే ఎన్బర్ నిన్ఴార్”(ఆశ్చర్యకరమైన పనులను చేయు నిన్ను నా కుమారుడు అని అందరూ చెప్పుచున్నారు) అని చెప్పినట్టు ఆళ్వార్ల బాల్య కృత్యములను అనుభవించిన నమ్మాళ్వార్ల తల్లి వీరందరి కంటే గొప్పది.
నెడుఙ్గాలుమ్ నఙ్గైమీర్ ఎన్నుమ్ అవళ్
తిరువిరుత్తం 37 “నెడుఙ్గాలముమ్ కణ్ణన్ నీన్మలర్పాదమ్ పరవిప్పైత్త” (నేను ఎంతో కాలము కృష్ణుని విశాలమైన పాదపద్మములను ఆరాధించి పరాంకుశ నాయకి అను ఈ కూతురిని పొందాను) అని చెప్పినట్టు ఒక్కసారి ఆశ్రయించుటయే చాలును అయినప్పటికీ అత్యాదరముచే ఆశ్రిత సులభుడు అయిన శ్రీ కృష్ణుని యొక్క శ్రీ పాదములను చాలా కాలము ఆశ్రయించి ఈ పరాంకుశ నాయకిని కూతురిగా పొంది (ఆళ్వార్ల స్త్రీ రూపము)మాటలకు అందని ఆమె పలుకులను అనుభవించితిని. తిరువాయిమొళి 4.2.9 “నన్గమీర్ నీరుమ్ ఓర్ పెర్ పెత్తు నల్ గినీర్…”(ఓ స్త్రీలారా! మీరు కూడా ఒక కుమార్తెను కని పెంచితిరి కదా! రాత్రింబగళ్ళు భగవంతుని గుర్తులు అయిన శంఖ, చక్ర మరియు తులసి మొదలగు వాటిని చెప్పు నా కుమార్తె యొక్క స్థితిని ఏమని చెప్పెదను?) అని ఈ విధముగా వీరి యొక్క ముద్దు పలుకులను అనుభవించిన నమ్మాళ్వార్ల తల్లితో మిగిలిన వారు సామానులు కారు కదా!
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/07/05/acharya-hrudhayam-78-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org