<< చూర్ణిక – 80
అవతారిక
ఏమి అయినా కాని ముందు వర్ణములలోని జన్మము వలే నాల్గవ వర్ణమున కలిగినట్టి జన్మము తేజోమయమైనది కాదు కదా? అని అడిగినచో నాయనార్లు ఈ విధముగా సమాధానము ఇచ్చుచున్నారు. “దాస్య రసమును తెలిసిన వారికీ నాల్గవ వర్ణమున కలిగిన జన్మ తేజోమయమైనది” అని ఉదాహరణ పూర్వకముగా చెప్పుచున్నారు.
చూర్ణిక
దేవత్వముమ్ నిన్దై ఆనవనుక్కు ఒళివరుమ్ జనికళ్పోలే బ్రహ్మ జన్మముమ్ ఇళుక్కెన్బార్ క్కు పణ్డైనాళిల్ పిఴవి ఉణ్ణాట్టు త్తేశిఴే
సంక్షిప్త వ్యాఖ్యానము
ఎలా అయితే తేజోమయమైన ఆ సర్వేశ్వరుని జన్మముల యందు తనని తాను స్వామిగా పిలిపించుకొనుట నచ్చలేదో అటువంటి జన్మముల వలనే బ్రహ్మ జన్మమును హేయము అని తలచువారికి శాశ్వత దాస్యముతో కూడిన జన్మము కూడా తేజోమయమైనది కదా!
వ్యాఖ్యానము
దేవత్వమ్ నిన్దై ఆనవనుక్కు
అనగా – రావణుని సంహారము తర్వాత బ్రహ్మాది దేవతలు శ్రీ రామాయణము యుద్ధ కాండము 120.13 “భవాన్ నారాయణో దేవః”(నీవు సాక్షాత్తు ఆ నారాయణుడివే) అని చెప్పగా అది శ్రీ రామునికి అసహ్యముగా అనిపించి శ్రీ రామాయణము యుద్ధ కాండము 120.11 “ఆత్మానమ్ మానుషమ్ మన్యే రామమ్ దశరధాత్మజమ్”(నన్ను నేను దశరధుని కుమారుడైన రామునిగా తలచెదను) అని పలికెను. అదే విధముగా గోవర్ధన పర్వతమును ఎత్తిన కృష్ణుని అసాధారణ చేష్ఠను చూసి ఆశ్చర్యపడిన గోప బాలలు శ్రీ విష్ణు పురాణము 5.13.7 “బాలత్వంచాది వీర్యంచ జన్మచాస్మాస్వశోబనమ్ చింత్యమానమమేయాత్మన్ శంకామ్ కృష్ణ ప్రయచ్ఛతి దేవోవా దానవోవా త్వమ్ యక్షో గంధర్వ ఏవ వా”(గొప్ప పరాక్రమముతో యవ్వనముతో జన్మించి మా మధ్యన ఉన్న నీవు దేవతవా? అసురునివా? యక్షునివా? లేక గంధర్వునివా అన్న అనుమానము మాకు కలుగుచున్నది) అని అనగా, అది శ్రీ కృష్ణునికి అసహ్యముగా అనిపించి కాసేపు మౌనముగా ఉండిపోయెను. శ్రీ విష్ణు పురాణము 5.13.9 “క్షణం భూత్వా తవసౌ తూష్ణీమ్ ప్రణయ కోపవాన్”(కృష్ణుడు కోపముతో కొద్దీ సేపు మౌనముగా ఉండిపోయెను)ఆ తరువాత శ్రీ విష్ణు పురాణము 5.13.2 “నాహమ్ దేవో న గంధర్వో నయక్షో నచదానవః అహమ్ వో భాన్దవో జాతః నైవచిన్త్యమ్ అతోన్యతః”(నేను దేవతను కాను, గంధర్వను కాను, యక్షుని కాను, అసురుని కాను, నేను మీకు చుట్టముగా జన్మించితిని. నా గురుంచి మీరు వేరొక విధముగా భావింపరాదు.) అని పలికెను.
ఒళివరుమ్ జనిగళ్ పోలే
సర్వ స్వామి అయిన ఆ సర్వేశ్వరుడు తాను లోకరక్షణార్ధమై మానవునిగా అవతరించినప్పుడు స్వామిగా పిలువబడుటకు ఇష్టములేనట్టి జన్మలు ఆయనవి. అట్టి సర్వేశ్వరునికి ఆ అవతారములను దాల్చి ప్రకాశించునట్టి కళ్యాణ గుణములను కలవాడై యజుర్వేదము 3.6.3 “స ఉ శ్రేయాన్ భవతి జాయమానః”(అట్టి సర్వేశ్వరుడైన ఆ స్వామి అవతరించి ప్రకాశించెను) అనియు తిరువాయిమొళి 1.3.2 “పల పిఴప్పామ్ ఒళివరు ముళునలమ్”(అనేక అవతారములను దాల్చి ప్రకాశించునట్టి కళ్యాణ గుణములను కలవాడు) అని చెప్పినట్టు
ఈ విధముగా,
బ్రహ్మ జన్మముమ్ ఇళుక్కు ఎన్బార్కు
స్తోత్ర రత్నము 55 “మాస్మ భూత్ అపి మే జన్మ చతుర్ముఖాత్మనా”(చతుర్ముఖ బ్రహ్మగా జన్మించటం కూడా నాకు తగదు) అని చెప్పినట్టు బ్రాహ్మణ్యమునకు పరాకాష్ఠ అయిన చతుర్ముఖ బ్రహ్మగా జన్మించడము కూడా శేషత్వమునకు విరోధి అయిన అహంకారమునకు హేతువు అవ్వడము చేత అది ఆత్మకు తగదు అని త్యజించినట్లుగా
పణ్డై నాళిల్ పిఴవి
తిరువాయిమొళి 9.2 పతిగం “పణ్డై నాళాలే” లో తిరువాయిమొళి 9.2.1″పల్ పడికాల్ కుడి కుడి వళి వన్దాట్చెయ్యోమ్ తొణ్డర్” (వంశాచారములను బట్టి ఎంతో కాలము నుంచి కైంకర్యము చేయుచున్న దాసులు) అనియు తిరువాయిమొళి 9.2.2 “ఉన్ పొన్నడిక్కడవాదే వళి వరుగిన్ఴ అడియార్”(నీ శ్రీపాదములను తప్ప వేరొక దానిని తెలియక శేషత్వ మార్గమున నడుచుచున్న దాసులు) అనియు తిరువాయిమొళి 9.2.3 “తొల్లడిమై వాళి వరుమ్ తొణ్డర్”(అనాదియైన శేషత్వ మార్గమును తప్పకుండా నడుచుకుంటున్న నీ దాసులు) అని చెప్పినట్టు దాస్యముతో విరోధించునట్టి జన్మాధ్యభిమానము లేకుండా కైంకర్యమునకు అనుకూలమగు వంశమున పుట్టి
ఉణ్ణట్టుత్ తేసిఴే
పెరియ తిరువందాది 79 “అళియన్గై పెరాయఴ్కాళామ్ పిఴప్పు ఉణ్ణట్టుతేశన్ఴే”(సుదర్శన చక్రమును అందమైన తన శ్రీ హస్తమునందు ధరించినట్టి గొప్ప గొల్లవాడు అయిన శ్రీ కృష్ణునికి దాసులై పుట్టుట అనేది తనకి అంతరంగమగు పరమపదమున ఉండు తేజస్సు వంటి గొప్పదైనది కాదా!?) అని అన్నట్టు భగవంతునికి విముఖముగా ఉండు లీలా విభూతి వలె గాక ఆయనకి అనుకూల రూపమగు భోగ రసముతో చేరియుండు భోగ విభూతియై వానికి అంతరంగమైనది అయిన పరమపదమున ఉండునట్టి తేజస్సు కలది కదా! పరమపదమున భగవత్కైంకర్యమునకు అనుకూలముగా స్వీకరించునట్టి శరీరము వలనే శేష వస్తువు అయిన ఆత్మకు ఇది(ఈ శరీరము) కూడా తేజోమయము అని భావన.
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/07/07/acharya-hrudhayam-81-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org