చూర్ణిక – 87
అవతారిక
ఆత్మకు స్వరూప నిరూపక ధర్మము అయిన శేషత్వమునకు తగినదైన జన్మయే ఉత్క్రుష్టమైనది అనునది సంసార వాసన(గంధము) ఎంత మాత్రము లేని నిత్య సూరులకు, ముముక్షువులకు(మోక్షమును పొందాలని కోరిక గల వారు) గల అట్టి జన్మ మీద ప్రీతి చేతనే అని ఇక మీద నాయనార్లు వివరించుచున్నారు.
చూర్ణిక
అణైయ వూర పునైయ అడియుమ్ పొడియుమ్ పడ పర్వత భవనఙ్గళిలే ఏతేనుమాక జనిక్కప్పెఴుకిఴ తిర్యక్ స్ధావరజన్మన్గళై పెరుమక్కళుమ్ పెరియోరుమ్ పరిగ్రహిత్తు ప్రార్ధిప్పర్కళ్
సంక్షిప్త వ్యాఖ్యానము
మహానుభావులు మరియు పెద్దలచే, ధరి౦చుటకు,స్వీకరి౦పబడుటకు, నడుపబడుటకు, వారి పాదధూళిచే స్పృశింపబడుటకు, జంతు, వృక్షాలుగా పర్వతములందు మరియు గొప్పవారైన భాగవతుల, పెద్దల గృహములయందు జన్మను స్వీకరించ ప్రార్ధించెదరు.
వ్యాఖ్యానము
అనగా,
అణైయ-
తిరువాయిమొళి 2.8.1 “అణైవదు అరవణై మేల్ పూమ్ పావై ఆగమ్ పుణర్వదు” (అప్పుడే చిగురించుచున్న పువ్వు వంటి సౌకుమార్యమైన తిరుమేనిని కలిగి ఉన్న శ్రీ మహాలక్ష్మిని తిరువనంతాళ్వాన్లు (ఆదిశేషులువారు) అను శయ్య పైన ప్రేమాతిశయముతో పవ్వళించిన ఎమ్బెరుమానుడు కౌగలించుకొనుట) అన్నట్టు శ్రీ మహాలక్ష్మి వలె అతి సౌకుమార్యమైన, మృదువైన స్పర్శ, చల్లతనము, పరిమళము, సున్నితత్వమును కలవాడైన ఆదిశేషుడు శ్రియఃపతికి (శ్రీ మహాలక్ష్మికి స్వామి) దివ్యమైన పరుపు(శయ్య)గా ఉండుట.
వూర-
తిరువాయిమొళి 10.2.3 “ఊరుమ్ పుళ్”(ఆయన స్వారీ చేయు పక్షి) అని చెప్పినట్టు ఆర్తులను రక్షించుటకై, తన భక్తులకు, తనకు ఆనందమును కలిగించుటకు భగవానుని మోసుకొని వెళ్ళు గరుత్మంతునిలా ఉండుట.
పునైయ-
తిరువాయిమొళి 1.9.7 “తోళినై మేలుమ్ నల్ మార్బిన్ మేలుమ్ సుడర్ ముడి మేలుమ్ తాళ్ ఇణై మేలుమ్ పునైన్ద తణ్ అమ్ తుళాయ్(చల్లని తులసిని ఎమ్బెరుమానుడు తన దివ్యమైన భుజములు, వక్ష స్థలము, శిరస్సు, పాద పద్మములపై ధరించియున్నాడు) అని చెప్పినట్టు ఆ సర్వేశ్వరుని భోగ్యము కోసము ధరింపబడుటకు అర్హత కలిగిన తిరుత్తుళాయ్(తులసి)లా ఉండుట.
ఆ సర్వేశ్వరునికి సహజముగా శేషులు అయిన నిత్యసూరులు ఇట్టి జంతు, వృక్ష జన్మలను అంగీకరించి తిరువాయిమొళి 3.7.5 “పెరు మక్కళ్ ఉళ్ళవర్”(పరమ సామ్యాపత్తిని(భగవానునితో సామ్యముగా ఉండుట) అను గొప్పతనమును కలిగియున్న నిత్యసూరుల కోసము)అనియు ఒకప్పుడు ఉనికి లేని స్థితి నుండి ఉనికి ఉండు స్థితికి మారవలసిన అవసరము లేకుండా ఎల్లప్పుడూ పరమపదంలో నిత్యముగా ఉంటూ తైత్తిరీయ ఉపనిషత్తు “ఆసన్నేవ”(అచిత్తు వలె) ఉండు స్థితికి వచ్చినట్టు తైత్తిరీయ ఉపనిషత్తు “సంతమేనం”(ఉనికిలో ఉండుటకు) అన్నట్టు తమకు ఉన్న ప్రీతితో భగవానునికి కైంకర్యము చేయవలెను అని స్వీకరించితిరి.
మహర్షులు, ఆళ్వార్లు మొదలగు వారు ఈ విధముగా ప్రార్థించితిరి :
అడియుమ్ పొడియుమ్ పడ పర్వత భవనఙ్గళిలే ఏతేనుమాక జనిక్కప్పెఴుకిఴ
అడియుమ్-
“పత్యుః ప్రజానామ్ ఐశ్వర్యమ్ పశూనాం వా న కామయే అహం కదంబో భూయాసం కున్దోవా యమునా తటే”(బ్రహ్మ లేదా శివుని యొక్క ఐశ్వర్యమును నేను కోరుకోవట్లేదు. యమునా నదీ తీరమున కదంబ వృక్షము లేదా కురుంద వృక్షముగా నేను అవ్వుగాక) అని చెప్పినట్టు ఆయన కాలు పెట్టి ఎక్కిన కదంబ వృక్షముగా నేను అవ్వుగాక నాచ్చియార్ తిరుమొళి 4.4 “పూత్త నీల్ కదంబేఴి”(అప్పుడే వికసించిన ఎత్తైన కదంబ వృక్షమును ఎక్కుట) అనియు నాచ్చియార్ తిరుమొళి 3.3 “పూన్గురున్దు ఏఴి ఇరుత్తి”(అప్పుడే చిగురించిన కురుంద వృక్షమును నీవు ఎక్కితివి).
పొడియుమ్-
శ్రీ భాగవతం 10.48.61 “ఆసామహో చరణ రేణు జుషామహం స్యామ్ బృందావనే కిమత గుల్మ లతౌషధీనామ్ యా దుస్త్యజమ్ స్వజనమార్య పదంచ హిత్వా బేజుః ముకుంద పదవీమ్ శృతిభిః విమ్రుక్యామ్”(అర్ధము క్రమముగా వివరించబడుచున్నది)వేదము కూడా వెతుకునట్టి శ్రీ కృష్ణుని మార్గమును అనుసరించి విడువతగని తమ పెద్దలను, బంధువులను విడిచిపెట్టి వెళ్లిన గోపికా స్త్రీల పాదధూళి పడినదైనట్టి బృందావనంలో నేను కూడా చిన్న చిన్న వృక్షములగాను, తీగల గాను, ఔషధ గుణ మొక్కలుగాను ఏదైనా ఒకటిగా అవ్వాలని కోరుకుంటున్నాను.
పర్వత-
పెరుమాళ్ తిరుమొళి 4.1″కోనేరి వాళుమ్ కురుగాయప్ పిఴప్పేనే”(స్వామి పుష్కరిణిలో(తిరుమలలో ఉన్న దివ్య కొలను) నివసించు కనీసము ఒక కొంగగానైనా పుట్టాలని నేను కోరుకుంటున్నాను) అనియు పెరుమాళ్ తిరుమొళి 4.2 “మీనాయ్ ప్పిఴక్కుమ్ విధి ఉడైయేన్ ఆవేనే” (కనీసము ఒక చేపలా అయినా పుట్టేందుకు నాకు భాగ్యము కలుగుగాక) అనియు పెరుమాళ్ తిరుమొళి 4.4 “సెన్బగమాయ్ నిఴ్కమ్ తిరు ఉడైయేనావేనే”(ఎవ్వరికీ ఉపయోగపడునట్టి ఒక స్తంభముగా ఉండేందుకు నాకు భాగ్యము కలుగుగాక) అనియు పెరుమాళ్ తిరుమొళి 4.10 “ఎమ్బెరుమాన్ పొన్మలై మేల్ మేదేనుమ్ ఆవేనే”(నా స్వామి తిరువేంగడముడైయాన్లకు చెందు ఏదైనా ఒక వస్తువుగా ఉండాలని కోరుకుంటున్నాను) అని చెప్పినట్టు తిరుమలైయాళ్వార్లతో(తిరుమల కొండ) తో సంబంధము ఉండు ఏదైనా ఒక వృక్షముగా కాని, జంతువుగా కాని నేను జన్మించుగాక.
భవనఙ్గళ్ –
స్తోత్ర రత్నము 55 “తవ దాస్యసుఖైక సంగినామ్ భవనేష్వస్త్వపి కీట జన్మమే”(ఆ భగవానుని కైంకర్యములో నిమగ్నమైన వారి గృహములలో కనీసము ఒక పురుగుగా అయినా నేను జన్మించుగాక) అని చెప్పినట్టు నీకు ముఖోల్లాసమును కలిగించు నీ కైంకర్యమందే ప్రీతిని కలిగిన శ్రీ వైష్ణవుల తిరుమాళిగలలో(గృహములలో) ఒక కీటకము/పురుగు లా జన్మించి మరియు మరణించదలచితిని.
పెరుమక్కళుమ్ పెరియోరుమ్ పరిగ్రహిత్తు ప్రార్ధిప్పర్కళ్ –
ఈ విధముగా ఆయన స్పర్శ కలుగుటకు, ఆయనను కౌగిలించుకున్న వారి శ్రీ పాద ధూళిచే తాకబడుటకు ఆయన ఎంతో కృపతో వేంచేసి ఉన్న దివ్యమైన స్థలాలు(ఆవాసాలు) లేదా ఆయన భక్తులకు అభిమానమైన స్థలాలలో ఉండుటకు అట్టి ముముక్షువులు పెరియ తిరుమొళి 7.4.4 “పేరాళన్ పేరోదుమ్ పెరియోర్”(సర్వ స్వామి అయిన ఆ భగవానుని తిరునామములను పలుకు అట్టి గొప్పవారు) అయినట్టి శ్రీ శుక బ్రహ్మర్షి (ఉద్ధవ), శ్రీ కులశేఖరపెరుమాళ్ళు, పెరియ ముదలియార్లు(ఆళవందార్లు) జంతు, పక్షి జాతులలో జన్మించుటకు ప్రార్థించితిరి.
దీనితో ఆ సర్వేశ్వరునికి శేషభూతముగా కైంకర్యము చేయుటకు తగినదైన జన్మయే ఉత్కృష్టమైనది అని సిద్ధించడమైనది. కానీ ఈ లోకములో జంతు, పక్షి జాతులలో జన్మించుట అనునది ఒకడు వాచిక, కాయిక రూపముగా చేసిన పాపముల వలన అని శాస్త్రములు చెప్పినప్పటికీ మను స్మృతి “వాచికైః పక్షి మృగతామ్ మానసైః అంత్య జాతితామ్ శరీరజైః కర్మదోషై యాతి స్తావరతాయ్ నరః”(వాక్కుల వలన చేసే పాపముల వలన పక్షి, జంతు జన్మలు; మానసికముగా చేసే పాపముల వలన నీచమైన మానవ జన్మలు, శారీరకముగా చేసే పాపముల వలన ఒకడు వృక్ష జన్మను పొందుతాడు). అలా కాకుండా నిత్యసూరులు కైంకర్యములు చేయుటకై ఇష్టముతో(ప్రీతితో) ఈ జన్మలను స్వీకరించెదరు. భగవానుని కైంకర్య రుచి తెలిసిన ముముక్షువులు ఆ సర్వేశ్వరుని, భాగవతుల సంబంధము కలిగినవైన జంతు, వృక్ష జన్మలను స్వీకరించెదరు.
అడియేన్ పవన్ రమనుజ డసన్
మూలము : https://granthams.koyil.org/2024/07/19/acharya-hrudhayam-87-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org