<< చూర్ణిక 90
చూర్ణిక 91
అవతారిక
ఈ విధముగా భాగవతుల సామాన్యమగు వైభవమును మాత్రమే కాకుండా సూత్రము 82 “జనక దశరథ…”తో ఆరంభమగు మూడు వాక్యముల చేత ఇంతకు ముందు చెప్పిన వైభవ విశేషమును చూపు ప్రమాణమును నాయనార్లు ఇక మీద కృప చేయుచున్నారు.
చూర్ణిక
తమిళ్ మాముని దిక్కు శరణ్యమ్ ఎన్ఴవర్ కళాలే “క్వచిత్ క్వచిత్” ఎన్ఴు ఇవరావిర్భావమ్ “కలియుమ్ కెడుమ్” పోలే సూచితమ్
సంక్షిప్త వ్యాఖ్యానము
“తమిళ ముని అయిన అగస్త్యుని దిక్కుకు మేము నమస్కరించుచున్నాము” అన్నట్టి గొప్ప మహర్షులచే శ్రీ భాగవతము 11.5.38 మరియు 39 “క్వచిత్ క్వచిత్” (అక్కడ ఇక్కడ) అని ఆళ్వార్ల అవతారము “కలియుమ్ కెడుమ్” (కలి నశించును) అన్న రీతిలో స్వయముగా నమ్మాళ్వార్లచే తిరువాయిమొళి 5.2.1 లో సూచించబడినది.
వ్యాఖ్యానము
తమిళ్ మాముని దిక్కు శరణ్యమ్ ఎన్ఱవర్గళాలే –
కురుగా మాహాత్మ్యము “దక్షిణాదిక్ కృతా యేన శరణ్యా పుణ్య కర్మణా” అట్టి అగస్త్యుని గొప్ప కృత్యముల చేత దక్షిణ దిక్కు శరణ్యమైనది అని చెప్పినట్లు ద్రావిడ శాస్త్రమును ప్రవర్తింపజేసిన అగస్త్యుని నివాసమైన దక్షిణ దిక్కు రక్షకము అని మహర్షులచే తీర్మానించబడినది. పెరుమాళ్ తిరుమొళి 10.5 “వణ్ తమిళ్ మాముని”(సులువుగా మాట్లాడుటకు శక్యమైన తమిళ భాషను సృష్టించిన అగస్త్య ముని). ఇప్పుడు నాయనార్లు దీనిని ప్రస్తుతించడం అనునది వైదికులగు మహర్షులు ద్రావిడ ప్రబంధమును రచించినట్టి నమ్మాళ్వార్లను ఈ విధముగా గౌరవించి చెప్ప తగునా? అని ప్రశ్నించు వారికి తమిళ భాషా శాస్త్రజ్ఞుడు అయినట్టి అగస్త్యుని కీర్తించి దక్షిణ దిక్కుకు తమిళ ఆధిక్యమును ఎలా అయితే ఆపాదించారో ద్రావిడ ప్రబంధములతో లోకోజ్జీవనమును కలుగజేసిన ఆళ్వారును అదే విధముగా గౌరవముతో చెప్పెదరు.
క్వచిత్ క్వచిత్ యెన్ఱు ఇవర్ ఆవిర్భావమ్
శ్రీ భాగవతం 11.5.38 మరియు 39 “కృతాదిషు నరా రాజన్ కలా విచ్ఛంతి సంభవం| కలౌకలు భవిష్యన్తి నారాయణ పరాయణః|| క్వచిత్ క్వచిత్ మహారాజ ద్రావిడేషు చ భూయచః| తామ్రపర్ణీ నదీ యత్ర కృతమాలా పయస్విన్| కావేరీ చ మహాభాగా ప్రతీచీచ మహానదీ|| యే పిబన్తి జలం తాసాం మనుజా మనుజేశ్వర| తేషామ్ నారాయణే భక్తిర్భూయసి నిరుపద్రవా|| (ఓ రాజా! కృతయుగములో ఉన్నవారు కలియుగములో జన్మించుటకు కోరుకుందురు. ఓ రాజా! నారాయణుని ఉపాయముగా స్వీకరించి ఆయనను పొందుగోరు అట్టి మహానుభావులు అక్కడ ఇక్కడ జన్మించెదరు. విశేషముగా ద్రావిడ దేశమున అనగా తామ్రపర్ణి(ఆళ్వార్ తిరునగరి), గొప్పదైన కావేరి(శ్రీరంగము), కృతమాలా(వైగై)[మధురై], పాలాఱు(పయస్విని)[కాంచీపురము], పెరియాఴు(మహానది) అను ఈ నదులు ప్రవహించునట్టి ప్రదేశములందు పుణ్యాత్ములు అయిన వారు జన్మించెదరు. ఈ నదులలో నీరు త్రాగిన వారు ఎట్టి దుఃఖము లేనివారై శ్రీమన్నారాయణుని విషయమున ఎక్కువ భక్తి కలుగును) అని చెప్పినట్లు జ్ఞానులైన వారు అవతరించునట్టి స్థలములను ఆయా నదులకు సమీపమున ఉండుటవలన ఆ నదులలోని నీళ్లను త్రాగిన వారికి భగవానుని పట్ల భక్తి ఎక్కువగా కలుగునని చెప్పు సందర్భమున మొట్టమొదట “తామ్రపర్ణీ నది యాత్ర” అని ఆళ్వారు అవతరించిన స్థలమును పేర్కొనుటచే ఈ ఆళ్వారు అవతారము అనునది
కలియుమ్ కెడుమ్ పోలే సూచితమ్
“మయర్వఱ మదినలమ్” (భక్తిగా పరిణతి చెందిన ఎట్టి సంకోచమూలేని జ్ఞానము) అని ఆళ్వార్లు అనుగ్రహింపబడ్డారు అన్నట్లుగా తిరుమంగై ఆళ్వార్లు, రామానుజుల వారి వంటి వారు అవతరించి కలి యొక్క స్వభావము నశింపజేయును అని ముందే చెప్పినట్లు తిరువాయిమొళి 5.2.1 “కలియుమ్ కెడుమ్”(కలి నశించును) త్రికాలములను తెలిసిన శ్రీ శుకులు మొదలగు మహర్షులు ఆళ్వార్ల అవతారమును ముందే సూచించినారు.
కురుగా మాహాత్మ్యము “క్రూరే కలియుగే ప్రాప్తే నాస్తికైః కలూషికృతే విష్ణోః అంశాసుమ్ భూతో వేద వేదార్ధ తత్త్వత్ స్తోత్రమ్ వేదమయమ్ కర్తుమ్ ద్రావిడ్యాపిచ భాషయా జనిష్యతి సదాం శ్రేష్ఠోలోకానామ్ హితకామ్యయా” (ఎప్పుడు నాస్తికుల రాకతో కలియుగము భ్రష్ఠుపట్టునో అప్పుడు విష్ణువు యొక్క అంశమున పుట్టినవారు, వేదవేదార్ధ తత్త్వములను పూర్తిగా తెలిసినవారు అయినట్టి నమ్మాళ్వార్లు అవతరించి అందరి ఉజ్జీవనమును తలచి వేదము యొక్క తాత్పర్యమును తమిళ ప్రబంధములుగా ఇచ్చును) అని చెప్పినట్టు నాయనార్లు జన్మమును తెలుపునట్టి శబ్దములను ప్రయోగింపక అవతారమును చెప్పు ఆవిర్భావ శబ్దమును ప్రయోగించుటకు గల కారణము వీరి జన్మ ఆ సర్వేశ్వరుని జన్మము వలే లోకోపకారమునకై ఏర్పడినది అని తెలుపుట కొరకే అని తెలుసుకొనవలెను. అందుచేత వీరు(ఆళ్వారు) కూడా ఒక విశేషమైన అవతారమే అని చెప్పడమైనది.
అడియేన్ పవన్ రామానుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/07/19/acharya-hrudhayam-91-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org