అవతారిక
ఆత్మ స్వరూప జ్ఞాన విషయమున స్వరూప జ్ఞానమనీ, స్వరూప యాధాత్మ్య జ్ఞానమనీ భేదమున్నది. అందులో ఈ ఆత్మ తాలూకు శేషత్వము (శేషముగా ఉండుట) మరియు జ్ఞాతృత్వము(తెలుసుకొనువాడై ఉండుట) నారాయణ సూక్తములో “పతిమ్ విశ్వస్య” (సర్వలోక నాయకుడు) అనియు “అచ్చిద్రమ్ యస్వామి”(నేను సర్వేశ్వరునికే చెందిన వాడను) అనియు బృహదారణ్యక ఉపనిషత్ లో ” న హి విజ్ఞాతుర్ విజ్ఞాతేర్ విపరిలోభో విద్యాతే” (జ్ఞానమును కలిగి ఉన్న ఆత్మకు వినాశము లేదు) అనియు బృహదారణ్యక ఉపనిషత్ లో “జానాతి యేవాయమ్ పురుషః”(ఆత్మకు తెలిసిన విషయములు); జ్ఞాతృత్వం(తెలుసుకొనిన వాడు) వలన కలిగిన భోక్తృత్వము(అనుభవించు వాడు) యొక్క ప్రభావము ఏమి అనగా భగవదనుభవము, తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పినట్టు “సోశ్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితః” (ఆత్మ ఆ సర్వేశ్వరుని గుణములను ఆయనతో ఉంటూ అనుభవిస్తుంది); ఆత్మ స్వరూపమును అట్టి శాస్త్రము ద్వారా తెలుసుకున్నప్పుడు భగవత్ శేషత్వం (భగవానునికి శేషమై ఉండుట) మరియు భగవదనుభవ భోక్తృత్వము(ఆ సర్వేశ్వరుని అనుభవించుట) స్పష్టమవుతున్నవి. శాస్త్ర సారము అయిన తిరుమంత్రమున మునిగినప్పుడే పారతంత్య్ర(ఆ సర్వేశ్వరుని పైనే పరిపూర్ణముగా ఆధారపడి ఉండుట), భోగ్యత (అనుభవింపబడు) రూపమగు స్వరూప యాధాత్మ్య జ్ఞానము ప్రకాశించును. దీనినే స్వరూప యాధాత్మ్య జ్ఞానము అని నాయనార్లు ఇక మీదట ప్రకాశింపజేయుచున్నారు.
చూర్ణిక
శేషత్వ భోక్తృత్వజ్గళ్ పోలన్ఴే పారతంత్య్ర భోగ్యతైకళ్
సంక్షిప్త వివరణ
శేషత్వము(శేషముగా ఉండుట) మరియు భోక్తృత్వములు(అనుభవించు వాడు) పారతంత్య్రము (ఆ సర్వేశ్వరుని పైనే పరిపూర్ణముగా ఆధారపడి ఉండుట) మరియు భోగ్యతలు (అనుభవింపబడు) వంటివి కావు. (శేషత్వము, భోక్తృత్వములు తక్కువ స్థాయివి).
వ్యాఖ్యానము
అనగా – శేషత్వము ఇష్ట వినియోగ అర్హతా మాత్రము(ఇష్టము వచ్చిన విధముగా ఉపయోగపరుచుకొనుటకు తగినది); పారతంత్య్రము శేషికి ఇష్టము వచ్చినట్టు వినియోగ పడుటకు తగినది. “కట్టిప్ పొన్ పోలే శేషత్వం, పణిప్పోన్ పోలే పారతంత్య్రం” అని చెప్పినట్టు (శేషత్వము ముద్ద బంగారము వంటిది, పారతంత్య్రము ధరించటానికి వీలుగా ఉండు బంగారు నగ వంటిది) కావున శేషభూతమగు ఈ ఆత్మను శేషికి ఇష్టము వచ్చినట్టు వినియోగపడటమే పారతంత్య్రము. భోక్తృత్వమనగా (అనుభవించు వాడికి) జ్ఞాతృత్వ బలము వలన అనుభవించు భోగమును తాను అనుభవించువాడుగ ఉండుట. భోగ్యత అనగా ఒక పదార్ధమునందు ఉండు రుచి, రంగు మొదలగు అంశాలు (విశేషములు), ఆనందించేవానికి మాత్రమే ఆనందదాయకముగా ఉంటాయి, ఆత్మ తాలూకు జ్ఞానాదులు మొదలగు ఈశ్వరునికే భోగ్యముగా ఉండుట.
కావున, ఈ ఆత్మ వస్తువును శేషి అయిన పరమాత్మకు ఇష్టము వచ్చిన విధమున వినియోగపరచి ఇచ్చు పారతంత్య్రము అనేది ఇష్టము వచ్చినట్లు వినియోగ పరుచుకొనుటకు తగినదై ఉండుట మాత్రమే అయిన శేషత్వము వంటిది కాదు కదా!; భోగ సమయమున స్వార్ధ బుద్ధిని కలుగజేయు భోక్తృత్వము వంటిది కాదు కదా అట్టి భోక్తృత్వమును శేషి యొక్క ఇష్టమునకై ఉపయోగపరచి ఇచ్చునట్టి భోగ్యత అనేది!
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-21-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org