ఆచార్య హ్రుదయం – 34

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 33

అవతారిక
ఈ విధముగా వీరి శ్రేష్ఠమైన జన్మముల యొక్క లక్షణములు వివరింపబడ్డాయి.

చూర్ణిక
అన్దణర్ మఴైయోరెన్ఴుమ్ అడియార్ తొణ్డర్ ఎన్ఴుమ్ ఇవర్కళుక్కు నిరూపకమ్

సంక్షిప్త వివరణ
కర్మ నిష్ఠులు “అన్దణర్”  మరియు “మఴైయోర్” గాను కైంకర్య నిష్ఠులు “అడియార్” మరియు “తొణ్డర్ ” గాను గుర్తింపబడ్డారు.

వ్యాఖ్యానము
కర్మ నిష్ఠులకు ఆత్మకు విశేషణమైన శరీరము ద్వారా వచ్చిన వర్ణము ఆ వర్ణమును బట్టి వచ్చిన వైదికత్వము లక్షణము. తిరుమాలై 43 “శాది అన్దణర్” (బ్రాహ్మణ జాతికి చెందడము), పెఱియ తిరుమొళి 1.5.9 “తుణై నూల్ మార్విన్ అన్దణరుమ్” (రెండు యజ్ఞోపవీతములను ధరించిన బ్రాహ్మణులు), పెఱియ తిరుమొళి 7.9.7 “తీ ఓమ్బు కై మఴైయోర్” (తమ హస్తములతో అగ్నికార్యములు చేసెడి బ్రాహ్మణులు) మరియు పెఱియ తిరుమొళి 6.7.8 “నన్దా వణ్కై మఴైయోర్”(ఉదారమైన హస్తములను కలిగిన బ్రాహ్మణులు).

కైంకర్య నిష్ఠులకు జ్ఞాన ఆనందముల కంటే ఎక్కువగా అంతరంగమును తెలుపు శేషత్వము దాని వలన కలుగు కించిత్ కైంకర్యము లక్షణములు. తిరువాయిమొళి 5.6.11 “తిరుమాల్ అడియార్” (శ్రీమన్నారాయణుని దివ్య కైంకర్యపరులు), పెరుమాళ్ తిరుమొళి 1.10 “అణి అరంగన్ తిరుముత్తత్తు అడియార్” (శ్రీరంగనాథుని సన్నిధిలో అంతరంగ దాసులు) తిరువాయిమొళి 6.9.11 “తిరుమాలుక్కు ఉరియ తొణ్డర్” (శ్రీమన్నారాయణునికి తగిన దాసులు) మరియు తిరువాయిమొళి 3.7.4 “తిరునారణన్ తొణ్డార్” (శ్రీమన్నారాయణుని దాసుడను).

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-34-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment