అవతారిక
ఆ భాష అనాది అయితే అగుగాక, తిరువాయిమొళి వేద విభాగములలో ఒకటి అను చెప్పు ప్రమాణము ఏదైనా ఉన్నదా? అని అడిగితె దానికి సమాధానము ఇక్కడ చెప్పుచున్నారు.
చూర్ణిక
వడమొళిమఴైయెన్ఴతు తెన్మొళిమఴైయై నినైత్తిఴే
సంక్షిప్త వివరణ
ఆళ్వారు తమ పాశురములో తిరువాయిమొళి 8.9.8 “వడమొళిమఴై”(సంస్కృత భాషలో ఉన్న వేదము) అని చెప్పడము చేత ద్రావిడ భాషలో కూడా వేదము ఒకటి కలదు అని ఆలోచించే కదా?!
వ్యాఖ్యానము
అనగా – ఆళ్వారు వేదమును సూచించుటకై కేవలము “మఴై” అను శబ్దమును కాక “వడమొళిమఴై” అని సంస్కృత వేదమును సూచించుట చేత ద్రావిడ వేదము మరొకటి ఉన్నది అని ఆలోచనతోనే కదా. అంటే వేరొక పక్షము లేని యెడల విశేషణము ప్రయోగించ పని లేదు కదా! అని భావము.
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-42-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org