ఆచార్య హ్రుదయం – 56

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 55

చూర్ణిక – 56

అవతారిక
ఇక మీద నమ్మాళ్వార్ల ప్రబంధములకు గల కారణములను నాయనార్లు వివరించుచున్నారు.

చూర్ణిక
పరమ సత్త్వత్తోడే ఉళ్ళియురైక్కుమ్ నిఴైజ్ఞానత్తయనామ్ శివనామ్ తిరుమాలరుళ్ కొణ్డు ఇవర్ పాడినార్

సంక్షిప్త వివరణ
బ్రహ్మ రుద్రులకు అంతర్యామి అయిన మరియు పూర్తి జ్ఞానమును కలిగి అలోచించి మాట్లాడు వాడు మరియు పరమ సత్త్వ స్థితి యందు ఉండు ఆ సర్వేశ్వరుని దివ్యమైన అనుగ్రహము చేతనే నమ్మాళ్వారు పాడినారు.

వ్యాఖ్యానము
అనగా కల్ప ఆరంభమున చతుర్ముఖ బ్రహ్మ తన గుణములను బట్టి ప్రేరేపింపబడి దానికి అనుగుణముగా తనకి తోచినట్లు మాట్లాడటానికి బదులుగా(భిన్నముగా) ఎప్పుడూ శుద్ధ సత్త్వముతో ఉండు సర్వేశ్వరుడు తిరువాయిమొళి 1.3.5 “ఉళ్ళి ఉఴైత్త” (ఆలోచించి కృపతో మాట్లాడి)అని చెప్పినట్టు ఎప్పుడునూ సత్త్వ, రజో, తమో గుణములతో కూడి ఉండకుండా ఎవ్వరికీ లేనట్టి శుద్ధ సత్త్వమును కలిగి స్తోత్ర రత్నము 12 “పరమ సత్త్వ సమాశ్రయః కః ” (ఎవరు పరమ సత్వముతో ఉండు వాడు?) అని చెప్పినట్టు ఎవ్వరికీ లేనంత శుద్ధ సత్వ గుణముతో కూడి ఉండి తాను చెప్పినదంతయూ వేదార్ధమే అయిననూ తొందరపడి చెప్పినట్టు అయినచో తన నోటికి వచ్చినట్టు చెప్పినాడని విమర్శించెదరని తలచి చేతనుల పట్ల తనకి ఉన్న గొప్ప వాత్సల్యముతో (తల్లి ప్రేమ) వేదమును విచారించి చెప్పినాడు. తిరువాయిమొళి 1.3.5 “నెఴి ఉళ్ళి యుగైత్త”(అలోచించి వేద అర్ధములను దయతో కృప చేసినాడు.

ఒకప్పుడు తమస్సుతో ఉండి ఆ తమస్సు పోయిన శివుని నుంచి జ్ఞానమును ఆర్జించిన ఇతర ఋషుల వలే కాకుండా జ్ఞానమును విలక్షణమైన గుణముగా (స్వభావముగా) కలిగి ఉన్న ఆ సర్వేశ్వరుడు తిరువాయిమొళి 4.8.6 “నిఴైజ్ఞాన త్తొరుమూర్తి” (జ్ఞానమును పరిపూర్ణముగా కలిగిన వాడు, విలక్షణమైన స్వభావమును కలవాడు) అనియు తిరువాయిమొళి 8.8.11 “అయనామ్ శివనామ్ తిరుమాలాల్”(బ్రహ్మ, రుద్రాదులు మొదలగు వారిలో అంతర్యామిగా ఉండు శ్రియఃపతి చేత) అని చెప్పినట్టు బ్రహ్మ రుద్రాదులకు అంతర్యామియై ఆయా కార్యములను చేయుటకు వారి వారి నామములగు శబ్ధముచే తాను వ్యవహరించబడెను.

మయఴ్వఴ మదినలమ్ చే అనుగ్రహింపబడి(ఎట్టి అజ్ఞానము లేకుండా ఉండు దివ్యమైన జ్ఞానము మరియు భక్తి ) అని చెప్పినట్టు అందరికంటే గొప్పవాడైన  శ్రియఃపతిచే “అరుళప్పట్ట శడగోపన్” (అనుగ్రహింపబడిన శఠకోపులు) అన్నట్టు కించిత్ కూడా అజ్ఞానము లేనట్టి జ్ఞానానందములు లభించినవారై “అరుళ్ కొణ్డాయిర్ మిన్దమిళ్ పాడినాన్”(అనుగ్రహింపబడి ఇంపైన ద్రావిడ భాషలో వేయి పాశురములను కృప చేసినాడు) అన్నట్టు నిర్హేతుకమగు భగవదనుగ్రహ మూలమున శ్రీ నమ్మాళ్వారు ఈ ప్రబంధమును కృప చేసినారు.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/04/20/acharya-hrudhayam-56-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment