ఆచార్య హ్రుదయం – 64

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 63

చూర్ణిక – 64

అవతారిక

ఇక మీద దివ్య ప్రబంధ సారము అయిన తిరువాయిమొళికి గల గొప్ప ప్రామాణ్యమును చూపించదలచి అందరూ ఆళ్వార్లు ముక్త కంఠముతో(ఏక కంఠముతో) పాడారు మరియు నమ్మాళ్వార్లు అనుగ్రహించిన తిరువాయిమొళికి గల ప్రాశస్త్యమును నాయనార్లు ప్రతిపాదించుచున్నారు. తిరువాయిమొళిని అంగీకరించని(విరోధించు) అట్టి శాస్త్రములను పరీక్షించి విడువవలెను అని నాయనార్లు కృపతో వివరించుచున్నారు.

చూర్ణిక
గురుశిష్య గ్రంధ విరోధఙ్గళై పరమతాదికళాలే పరిహరియ్యామల్ శఞ్గొల్ శెన్దమిళ్ ఇన్ కవి పరవియళైక్కుమ్ ఎన్ఴు అన్యోన్యమ్ కొణ్డాడి పేశిత్తే పేశుమ్ ఏకకంఠరిల్ ఎన్నిల్ మికు ఎన్ఴుమ్ ఇవరులైకొళిన్ మొళి కొణ్డు శాస్త్రార్థఙ్గళ్ నిర్ణయిక్క వేణ్డుకైయాలే వలఙ్గొణ్డ ఇతుక్కు చ్చెరాతవై మను విపరీతఙ్గళ్ పోలే

సంక్షిప్త వివరణ
ఋషుల విషయములో గురు శిష్య గ్రంథ విరోధములను పరమతములచే పరిహరించాల్సిన (పరిష్కరించాల్సిన) అవసరము లేకుండా ఆళ్వార్లు ఒకరినొకరు కీర్తించుకొని ఏక కంఠముతో చెప్పితిరి. వీరిలో ముఖ్యులైన నమ్మాళ్వార్ల ప్రబంధముల ద్వారానే శాస్త్రార్థములను నిర్ణయించవలసి ఉన్నందున ప్రతిపాదనా సామర్ధ్యముగల దీనితో విరోధించునవి మను స్మృతితో విరోధించు వాటి వంటివి.

వ్యాఖ్యానము

గురుశిష్య గ్రంధ విరోధఙ్గళై పరమతాదికళాలే పరిహరియ్యామల్
అనగా ఋషులలో గురు శిష్యులైన వ్యాస మరియు జైమినులలో వేదవ్యాసుని బ్రహ్మసూత్రముతో జైమిని కర్మ సూత్రమునకు నిరీశ్వరవాదము(భగవానుని నిరాకరించుట అను వాదము) మొదలగు వాటిని బట్టి విరోధము ఏర్పడినది.

అట్టి విరోధము ఈ క్రింద వివరణ ప్రకారము పరిష్కరించబడినది :
బ్రహ్మ సూత్రము 1.2.32 “సమ్పత్తేరితి జైమినిః” అనియు బ్రహ్మ సూత్రము 1.4.18 “అన్యార్తమ్ తు జైమినిః” అనియు బ్రహ్మ సూత్రము 4.3.11 “పరమ్ జైమినిర్ ముఖ్యత్వాత్” అనియు బ్రహ్మ సూత్రము 4.4.5 “బ్రహ్మేణ జైమినిః” అను మొదలగు వాటిలో చెప్పినట్టు బ్రహ్మము యొక్క స్వరూపము, ఉపాసనము మరియు ఫలము విషయమున జైమిని మహర్షి అంగీకరించినట్టు తెలుస్తున్నది. అయితే జైమిని మహర్షికి పరమాత్మ విషయమున జ్ఞానము వ్యాస భగవానుని ఉపదేశము ద్వారా లభ్యమైనదని చెప్పడం చేత శ్రీ వేదవ్యాస భగవానుడు మరియు జైమిని మహర్షి ఏక కంఠముతోనే పలికిరి అని అర్థమవుతున్నది.

ఇక ఇప్పుడు జైమిని మహర్షి ఈశ్వరుని అంగీకరించని కారణము ఏమి అనగా – కొందరు పండితులు వేదమును ఈశ్వరుడు రచించాడని(కర్త) అని చెప్పి అందుచేత అది పౌరుషేయము కనుక దానికి విప్రలంభాది దోషములను కల్పించి అందువలన వేదములు ప్రమాణములు కావు అని చెప్పి వైదిక కర్మములను నిందించు వేదబాహ్యులను నిరాకరించి వేద ప్రామాణ్యమును కర్మావశ్యమును సాధించు విషయమున గల దేవతా(ఈశ్వర) నిరాకరణము స్వమతము కాకపోయిననూ పరమతమును అవలంబించి చేయబడి ఉండవచ్చునే కాని ఈశ్వర నిరాకరణము అతని ఉద్దేశ్యము కాదు. వేదాంతము తెలియని వారికి కర్మానుష్ఠాన విషయమున శ్రద్ధను పోగొట్టుట కోసము కర్మ ప్రాధాన్యమును చెప్పదలచి “న హి నిందా నిన్దాం నిన్దితుమ్ ప్రవర్తతే నిన్దితా దితరత్ ప్రశంసితుమ్” అనగా (ఒక వస్తువులోని నిందను ఎత్తి చూపుట నింద యొక్క లక్ష్యము కాదు, కానీ వేరొక వస్తువులోని గొప్పతనము చెప్పుటయే లక్ష్యము) అను న్యాయమును బట్టి ఈశ్వర నిరాకరణము చేసినది కర్మాచరణను స్తుతించుటకే. అందు చేత గురు, శిష్యుల మధ్య విభేధములను ఈ విధముగా –  “అతను వేరొకరి అభిప్రాయములు చెప్పుచున్నాడు”, “అతనికి వేరొక ఉద్దేశ్యము ఉన్నది” అని పరిష్కారము చేయవలెను.

కానీ ఆళ్వార్ల విషయములో ఎట్టి పరస్పర విరుద్ధమైన వాక్యములు లేకపోవుట వలన ఈ విధమైన పరిష్కారము చేయవలసిన అవసరము లేకుండుట,

శఞ్గొల్ శెన్దమిళ్ ఇన్ కవి పరవియళైక్కుమ్ ఎన్ఴు అన్యోన్యమ్ కొణ్డాడి
తిరువాయిమొళి 10.7.1 “శఞ్గొర్ కవిగాళ్” (యోగ్యములైన మాటలను చెప్పు ఓ కవులారా!) పెఱియ తిరుమొళి 2.8.2 “శెన్దమిళ్ పాడువార్”(చక్కని ద్రావిడములో పాడు ముదల్ ఆళ్వార్లు) తిరువాయిమొళి 7.9.6 “ఇన్ కవి పాడుమ్ పరమ కవిగళ్” (అంతులేని మంచి కవిత్వమును మరియు గొప్పగా పాడగలిగిన పరాశర, వ్యాస, వాల్మీకి మొదలగు కవులు) పెఱియ తిరుమొళి 7.1.7 “పదియే పరవిత్ తొళుమ్ తొణ్డార్” (దివ్యదేశములను పాడుతూ స్తుతించగలవారు)  పెరుమాళ్  తిరుమొళి 2.2 “అరన్గవో ఏన్ఴు అళైక్కుమ్ తొణ్డార్”(ఓ రంగ! అను ఎమ్పెరుమానుని పిలుచు శ్రీ వైష్ణవులు) అని చెప్పినట్టు, ఆళ్వార్లు ఒకరిని ఒకరు పరస్పరముగా శ్లాఘించిరి.

పేశిత్తే పేశుమ్ ఏకకంఠరిల్
ఏకకంఠముతో పాడిన ఆళ్వార్లలో తిరుమాలై 22 “పేశిత్తే పేశలల్లాల్”(అంతకముందు ఎమ్పెరుమానుని కొనియాడుతూ చెప్పిన వేదము మరియు వైదికుల మాటలనే మేము తిరిగి పలికితిమి).

ఎన్నిల్ మికు ఎన్ఴుమ్ ఇవర్
పెఱియ తిరువందాది 4 “ఎన్నిల్ మికు పుగళార్ యావలే” (నా కంటే గొప్ప యశస్సును కలిగిన వారు ఎవరు?) అని చెప్పినట్టు శేషి అయిన సర్వేశ్వరునికి అతిశయమును కలుగచేసిన వారు అగుట చేత వీరికి లభించిన ప్రీతీ చేత “నా కంటే ఎక్కువ కీర్తి గల వారు ఎవ్వరు?” అని అన్నట్టు

ఉరైకొళ్ ఇన్ మొళి కొణ్డు..
తిరువాయిమొళి 6.5.3 “ఉరైకొళ్ ఇన్ మొళి”(లోకముచే కొనియాడబడు మధురమైనట్టి వాక్కు) అని చెప్పినట్టు శ్రీ రామాయణము మొదలగు వాటిని జయించునట్టి తన విలక్షణమైన సూక్తులుగొని వేదము మరియు దాని వివరణమును చెప్పు శాస్త్రములో సంశయము కలుగు అర్థములను నిర్ణయింపవలసి ఉండడము చేత

వలన్ కొణ్డ ఇదుక్కుచ్ చెరాదవై
తిరువాయిమొళి 3.8.11″వలమ్ కొణ్డ ఆయిరమ్” (అర్ధములను నిశ్శంకోచముగా చెప్పగలిగిన గొప్ప శక్తి గల వేయి పాశురములు) అని చెప్పినట్టు భగవానుని స్పష్టముగా చూపు సత్తా కలిగిన ఈ ప్రబంధముతో అనుకూలించని శాస్త్రములు.

మను విపరీతన్గళ్ పోలే
“మన్వర్త విపరీతా తు యా స్మృతిన్ స న చస్యతే” (మనువుతో విరోధింపబడు స్మృతులు కొనియాడబడవు) అని చెప్పినట్టు ఎలా అయితే మనువు సూక్తులను విరోధించు స్మృతులు నిషిద్ధములైనవో అలానే తిరువాయిమొళితో అనుకూలించని అట్టి శాస్త్రములు నిషిద్ధములే.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/06/15/acharya-hrudhayam-64-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment