చూర్ణిక – 66
అవతారిక
“భగవద్ రామానుజులు బ్రహ్మ సూత్రములను ఎందుకు ఆ విధముగా కృప చేసినారు?” అను ప్రశ్నకు నాయనార్లు ఇక్కడ సమాధానమును కృప చేయుచున్నారు.
చూర్ణిక
అతుక్కు మూలమ్ “విధయశ్చ” ఎన్గిఴ పరమాచార్య వచనమ్
సంక్షిప్త వివరణ
అందుకు గల కారణము స్తోత్ర రత్నము 20 “విధయశ్చ” అను పరమాచార్య ఆళవందార్ల(యామునాచార్యులు) వచనములు.
వ్యాఖ్యానము
అనగా – భాష్యకారులు ఆ విధముగా వివరించుటకు గల కారణము స్తోత్ర రత్నము 20 ” విధయశ్చ వైదికాస్త్వదీయ గమ్భీర మనోనుసారిణాః” (వేదం నియమములు నీ భక్తుల దివ్యమైన హృదయములను అనుసరించును) అని చెప్పినట్టు, స్వతంత్రమైన వైదిక నియమములు “ఇదం కురు”(ఇది చేయుము), “ఇదం మాకార్షి”(ఇది చేయకు) వంటివి ఎట్టి ఫలాపేక్ష లేకుండా నిన్నే శరణు పొందిన నీ దాసులా యొక్క ఐశ్వర్యమున వికారము కలుగునట్టి గంభీరమైన మనస్సులను అనుసరించి పోవును అన్నట్టు నమ్మాళ్వార్ల వంటి వారి ఆలోచనలను శాస్త్రములు అనుసరించి ఉండును అని పరమాచార్యులైన ఆళవందార్లు కృప చేసి యున్నారు.
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/06/16/acharya-hrudhayam-66-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org