శ్రీ వచన భూషనము – తనియన్లు

శ్రీ వచన భూషనము

తనియన్లు  

శ్రీ వచన భూషణమును సంత/కాలక్షేపము చెప్పుకునే ముందు క్రింద చెప్పబడిన తనియన్లు చదవడము సంప్రదాయము. ఇక ఇప్పుడు గొప్ప వైభవమును కలిగిన ఆచార్యులను మరియు వారి సంప్రదాయ సేవలను(కైంకర్యములను) వారి వారి తనియన్ల ద్వారా అర్ధము చేసుకునే ప్రయత్నము చేద్దాము.

మొట్టమొదట శ్రీశైలేశ దయాపాత్రం…. భూతం సరశ్చ తనియన్లను చెప్పుకొనవలెను. అవి ఈ లింక్ (http://divyaprabandham.koyil.org/index.php/thaniyans-telugu/) లో లభ్యమవును. దాని తర్వాత ఆ క్రింద చెప్పబడిన తనియన్లను చెప్పుకొనవలెను.

లోకగురుం గురుభిస్సహ పూర్వైః కూరకులోత్తమదాస ముదారమ్|
శ్రీనగపత్యభిరామ వరేశ ధీప్రశయాన గురుంచ భజేహమ్||

సంక్షిప్త వ్యాఖ్యానము
ఈ తనియను మణవాళ మహామునులచే సాయించబడినది. పూర్వాచార్యులు అయిన పిళ్ళై లోకాచార్యులు, గొప్ప ఔదార్యమును కలిగిన కూరకులోత్తమ దాసులు, తిరుమలై ఆళ్వార్లు(తిరువాయిమొళి పిళ్ళై), అళగియ మణవాళ  పెరుమాళ్ పిళ్ళై (మణవాళ మహామునుల తాతగారు(తల్లి వైపు)) మరియు తిగళక్కిడన్తాన్ తిరునావీఴుడైయ పిఴాన్ తాదర్(మణవాళ మహామునుల తండ్రి గారు)లను ఆరాధించుచున్నాను.
గమనిక:  మణవాళ మహామునుల తండ్రి గారు సత్సంప్రదాయ అర్ధములను వారి మామగారు మరియు పిళ్ళై లోకాచార్యుల ప్రియా శిష్యులు అయిన కోట్టియూర్ అళగియ మణవాళ  పెరుమాళ్ పిళ్ళైల వద్ద అధికరించారు.

లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే|  
సంసార భోగిసందష్ట జీవజీవాతవే నమః||

సంక్షిప్త వ్యాఖ్యానము
ఈయుణ్ణి పద్మనాభ పెరుమాళ్ళచే సాయించబడినది. (నంపిళ్ళై శిష్యులైన ఈయుణ్ణి  మాధవ పెరుమాళ్ళ పుత్రులు). సంసారము అనే సర్పముచే కరవబడిన బద్ధులను కాపాడే ఔషధము వంటి వారు మరియు వడక్కు తిరువీధి పిళ్ళైల కుమారులు అయిన శ్రీ పిళ్ళై లోకాచార్యులనబడు మా ఆచార్యులను నేను ఆశ్రయించుచున్నాను.

లోకాచార్య కృపాపాత్రం కౌణ్డిన్యకులభూషణమ్|
సమస్తాత్మగుణావాసం వన్దే కూరకులోత్తమమ్||

సంక్షిప్త వ్యాఖ్యానము
మణవాళ మహామునులచే సాయించబడినది. “కుంతీ నగరం”(ఇప్పుడు కొంతగై అని వ్యవహరించబడుచున్నది) అను పట్టణములో జన్మించి నమ్మాళ్వార్లచే అనుగ్రహించబడిన “కైంకర్య శ్రీ” అను కైంకర్య సంపదతో శోభాయమానముగా ప్రకాశించుచున్న శ్రీశైలనాధులను  (తిరుమలై ఆళ్వారు – తిరువాయిమొళి పిళ్ళై) ఆశ్రయించుచున్నాను.

లోకాచార్య పదామ్భోజ రాజహంసాయితాన్తరమ్|
జ్ఞాన వైరాగ్య జలధిం వన్దే సౌమ్యవరం గురుమ్||

సంక్షిప్త వ్యాఖ్యానము
మణవాళ మహామునులచే సాయించబడినది. జ్ఞాన, వైరాగ్యములను కలిగి పిళ్ళై లోకాచార్యుల పాద పద్మములను హంస వలె అంటి పెట్టుకొని ఉన్న అళగియ మణవాళ  పెరుమాళ్ పిళ్ళై (మణవాళ మహామునుల తల్లి గారి వైపు తాతగారు)ను ఆశ్రయించుచున్నాను.

శ్రీ జిహ్వావధీశదాసం అమలమశేష శాస్త్రవిదమ్|
సున్దరవరగురు కన్దళిత జ్ఞానమందిరం కలయే||

సంక్షిప్త వ్యాఖ్యానము
మణవాళ మహామునులచే సాయించబడినది. ఎట్టి దోషములూ లేని వారు, సకల శాస్త్ర ప్రవీణులు మరియు అళగియ మణవాళ  పెరుమాళ్ పిళ్ళైల దివ్య కృప చేత జ్ఞాన వృద్ధిని పొందిన తిగళక్కిడన్తాన్ తిరునావీఴుడైయ పిఴాన్ తాదర్లను నేను ప్రకాశింపజేయుచున్నాను.

శ్రీ వచన భూషణమునకు గల ప్రత్యేక తనియన్లు
శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రము ఆరు మరియు తొమ్మిది ప్రకరణములను కలిగినదిగా చెప్పబడినది. క్రింద చెప్పబడు తనియన్లు ఈ ప్రబంధములో గల ఆ రెండు విభాగములను వివరించుచున్నది.

పురుషకార వైభవంచ సాధనస్య గౌరవమ్
తదాధికారి కృత్యం అస్య సద్గురూప సేవనమ్
హరితయాం అహైతుకీమ్ గురోరూపాయతాన్చ యో
వచనభూషణేవదజ్ జగద్గురుం తమాశ్రయే

సంక్షిప్త వ్యాఖ్యానము
శ్రీ వచన భూషణములో ఈ క్రింద చెప్పబడిన ప్రకరణములను కృప చేసినయట్టి పిళ్ళై లోకాచార్యులను నేను శరణు పొందుచున్నాను.

1. పురుషకారమును(జీవుడను ఆ సర్వేశ్వరుడు స్వీకరించేట్టు) చేయు పిరాట్టిమార్ల విశేషములు .
2. సిద్ధోపాయము(భగవానుడే ఉపాయము) యొక్క గొప్పతనము.
3. భగవానుని ఉపాయముగా స్వీకరించిన అధికారుల యొక్క నడవడిక/మనస్తత్వము.
4. ఆచార్యుని విషయములో అట్టి అధికారి యొక్క నడవడిక మరియు కైంకర్య భావన.
5. భగవానుని నిర్హేతుక కృప తాలూకు వైలక్షణ్యము.
6. ఆచార్యుడే అంతిమోపాయముగా ఉండుట.

సాంగాకిల ద్రావిడ సంస్కృత రూు వేద సారార్ధ సంగ్రహ మహారస వాక్యజాతమ్|
సర్వజ్ఞ లోక గురు నిర్మితమ్ ఆర్య భోగ్యమ్ వందే సదా వచనభూషణ దివ్య శాస్త్రమ్||

సంక్షిప్త వ్యాఖ్యానము
ఎన్నో గొప్ప అందమైన వాక్య సమూహములను కలిగినది మరియు వేద, వేదాంత సారములను స్పష్టముగా బయలు పరచునట్టిది, నేర్పు గల పండితులకు ఎంతో మనోరంజకంగా ఉండునది, సర్వజ్ఞులు అయిన శ్రీ పెళ్ళై లోకాచార్యులు కృప చేసిన శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రమును నేను సదా అర్చించుచున్నాను.

అకుంఠోత్కంఠ వైకుంఠప్రియాణామ్ కంఠభూషణమ్|
గురుణాజగతామ్ ఉక్తం వ్యాప్తం వచన భూషణమ్||

సంక్షిప్త వ్యాఖ్యానము
నిత్య నిరవధిక సంతోషములకు ఆశ్రయమయిన శ్రీ వైకుంఠమును(పరమపదము) పొందాలని కోరిక ఉన్న భక్తుల కంఠములన శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రము అనునది అందమైన హారము వంటిది. అట్టి గొప్ప ప్రబంధము పిళ్ళై లోకాచార్యులచే రచించబడినది.

పేఴు తఴువిక్కుమవళ్ తన్ పెఴుమై ఆఴు పెఴువాన్ ముఴై
అవన్ కూఴు గురువైప్పనువల్ కోళ్ వదిలైయాగియ కుళిర్ న్ద్ అరుళ్దాన్
మాఴిల్ పుగళ్ నఴ్కురువిన్ వణ్మైయోడెలామ్ వచన బూడణమదిల్
తేఴిద నమక్కరుళ్ ముడుమ్బై ఇఴైయవన్ కళల్గళ్ సేరెన్ మననే

సంక్షిప్త వ్యాఖ్యానము
ఓ మనస్సా! మన ఉజ్జీవనము కోసము ముఖ్యమైన సూత్రములను సుస్పష్టముగ శ్రీ వచన భూషణములో తేటతెల్లము చేసిన ముడుంబై నగర స్వామి అయిన శ్రీ పిళ్ళై లోకాచార్యులను ఆశ్రయించి వారిని శరణు పొందుము. ఈ ప్రబంధమున వివరించబడిన ఆరు ప్రకరణములు ఈ క్రింద విధముగా చెప్పబడినవి.

1. పురుషకారమును(జీవుడను ఆ సర్వేశ్వరుడు స్వీకరించేట్టు) చేయు పిరాట్టిమార్ల విశేషములు .
2. సిద్ధోపాయము(భగవానుడే ఉపాయము) యొక్క గొప్పతనము.
3. భగవానుని ఉపాయముగా స్వీకరించిన అధికారుల యొక్క నడవడిక/మనస్తత్వము.
4. ఆచార్యుని విషయములో అట్టి అధికారి యొక్క నడవడిక మరియు కైంకర్య భావన.
5. భగవానుని నిర్హేతుక కృప తాలూకు వైలక్షణ్యము.
6. ఆచార్యుడే అంతిమోపాయముగా ఉండుట.

తిరుమామగళ్ తన్ శీరరుళేత్తముమ్ తిరుమాల్ తిరువడి సేర్వళి నన్మైయుమ్
అవ్వళి ఒళిన్దన అనైత్తిన్ పున్మైయుమ్ మెయ్వళియూన్ఴియ మిక్కోర్ పెరుమైయుమ్
ఆరణమ్ వల్లవర్ అమరు నన్నేఴియైయుమ్ నారణన్ తాళ్ తరు నఴ్కురునీదియుమ్
సోదివినారుళ్ తూయమాగురువిన్ పాదమామలర్ పణిబవర్ తన్మైయుమ్
మన్నియ ఇన్బముమ్ మాగదియుమ్ గురువెన్ను నిలై పెఴుమ్ ఇన్ పొరుళ్ తన్నైయుమ్
అశైవిలా వేదమదనుళ్ అనైత్తైయుమ్ వచనబూడణ వళియాలరుళియ
మఴైయవర్ సిగామణి వణ్ పుగళ్ ముడుమ్బై ఇరైయవన్ ఎన్గోన్ ఏర్ ఉలగారియన్
తేన్ మలర్ చ్చేవడి సిన్దైసెయ్ బవర్ మానిలత్తు ఇన్బమదు యెయ్దు వాళ్బవరే

సంక్షిప్త వ్యాఖ్యానము
వేద విద్వాంసుల కిరీటముల పైన ప్రకాశించు శిఖర ఆభరణము వంటి వారు మరియు శాస్త్రములలో చెప్పబడిన ప్రధానమైన సూత్రములను శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రము ద్వారా పొందుపరిచినవారు, ముడుంబై తిరువంశమునకు మరియు నాకు స్వామి అయిన శ్రీ పిళ్ళై లోకాచార్యుల తేన వంటి శ్రీ పాదములను ఎవడైతే నిత్యమూ ధ్యానిస్తారో అట్టి వాడు ఈ లోకములో వేంచేసియుండగానే భగవత్ భాగవత అనుభవమును మరియు కైంకర్యము అను గొప్ప సుఖమును అనుభవించును(పొందును). ఈ ప్రబంధమున పిళ్ళై లోకాచార్యులు ముఖ్యముగా తొమ్మిది ప్రకరణములు/సూత్రములను వివరించితిరి.

1. జీవుని పట్ల పురుషకారమును చేయు పిరాట్టిమార్ల గొప్పతనము.
2. ఉపాయముగా భగవానుని గొప్పతనము.
3. కర్మ, జ్ఞాన, భక్తి మొదలగు యోగములకు గల పరిమితులు.
4. భగవానుని ఉపాయముగా స్వీకరించిన ప్రపన్నుల గొప్పతనము.
5. అట్టి ప్రపన్నుల దినచర్య.
6. ఆచార్యునిలో ఉండతగిన గుణములు మరియు ఆతని నడవడిక.
7. శిష్యునిలో ఉండతగిన గుణములు.
8. జీవుని ఉజ్జీవించుటకు భగవానుని నిర్హేతుక కృప మరియు ఆతని ప్రయత్నములు.
9. ఆచార్యుడే ఉత్తారకమని చెప్పు పరమ ఉత్క్రుష్టమైన సూత్రము.

లోకాచార్య కృతే లోకహితే వచనభూషణే
తత్త్వార్థ దర్శినో లోకే తన్నిష్టాశ్చ సుదుర్లభః

సంక్షిప్త వ్యాఖ్యానము
జీవుల ఉజ్జీవనము కొరకే వ్రాయబడిన శ్రీ వచన భూషణములో చెప్పబడిన సూత్రములను అర్థము చేసుకొని ఆచరణలో పెట్టిన వారిని చాల అరుదుగా చూచెదము.

జగదాచార్య రచితే శ్రీమద్వచన భూషణే
తత్త్వ జ్ఞానంచ తన్నిష్టామ్ దేహినాథ యతీద్రమే

సంక్షిప్త వ్యాఖ్యానము
ఓ యతిరాజా!(రామానుజా) శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రములో చెప్పబడిన సూత్రములను అర్థము చేసుకొని ఆచరణలో పెట్టేట్టు నన్ను ఆశీర్వదించుము.

దీనితో పిళ్ళై లోకాచార్యుల గొప్పతనమును చెప్పు శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రము మరియు అట్టి మహోన్నతమైన ప్రబంధము యొక్క తనియన్లు ఇంతటితో ముగిసినవి.

ఇక మీద మణవాళ మహామునులు అనుగ్రహించిన అవతారికకు అనువాదమును చూచెదము.

అడియేన్ పవన్ రమనుజ డసన్

మూలము : https://granthams.koyil.org/2020/12/01/srivachana-bhushanam-thaniyans-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment