ఆచార్య హృదయం – 88

ఆచార్య హృదయం

<< చూర్ణిక  87

చూర్ణిక  88

భగవానుని కైంకర్యమునకు తగినవైన జంతు, పక్షి జన్మలను నిత్యసూరులు అంగీకరించుట సరియైనదే అయినా అలా కాకుండా ముముక్షువులు  భగవద్భాగవత శేషత్వమున కోరికతో  జంతు, పక్షి జన్మలను స్వీకరించుటకు ప్రార్థన చేసినప్పటికీ శాస్త్రములో ఉత్కృష్టమైన జన్మగా చెప్పబడిన బ్రాహ్మణ వర్ణమును ఎలా నిషేధించెదరు అన్న ప్రశ్నకు నాయనార్లు జవాబును కృప చేయుచున్నారు.

చూర్ణిక
శేషత్వ బహిర్భూత జ్ఞానానన్ద మయనైయుం సహియాదార్ త్యాజ్యోపాధియై యాదరియార్ కళే

సంక్షిప్త  వ్యాఖ్యానము
జ్ఞానము మరియు ఆనందముతో ఆత్మ ఉన్నప్పటికీ శేషత్వమునకు ఆస్కారము లేనిచో భాగవతులు(ఆళ్వార్లు) దానిని (వర్ణమును) నిషేధించుటకు గల హేతువును సమర్ధించెదరు.

వ్యాఖ్యానము
అనగా – స్తోత్రరత్నము 57 “నదేహం నప్రాణాన్ చ సుఖమశేషాభిలషితం న చాత్మానం నాన్యత్ కిమపి తవ శేషత్వవిభవాత్ బహిర్భూతం నాథ క్షణమపి సహే యాతు శతధా”, ఆళవందార్లు “ఓ స్వామీ! నీ విషయమున శేషత్వముకు విరుద్ధములైన శరీరము, ప్రాణమును ఇతరులు కోరునట్టు సుఖములను క్షణకాలమైననూ సహింపజాలను. అంతే కాకుండా జ్ఞానానందమయము అగు నా ఆత్మను కూడా సహింపను. అది అనేక విధములుగా నాశమును పొందుగాక! ఈ విజ్ఞాపనము అసత్యము కాదు సత్యము. నేను అసత్యము ఆడినట్లయినచో నీ పట్ల అసత్యముగా ప్రవర్తించిన మధు అను రాక్షసుడు పడిన పాట్లు నేను కూడా పడుగాక” అని చెప్పడం చేత జ్ఞానానందమయము అగు గొప్పదైనట్టి ఈ ఆత్మ వస్తువుకు శేషత్వము లేనిచో దానిని సహింపజాలరు. “జ్ఞానానంద మాయస్త్వాత్మా” (ఆత్మ వస్తువు జ్ఞానము మరియు ఆనందమును తన స్వరూపముగా కలిగియున్నది) అని చెప్పినట్లు, ఏ విధముగా వారు కర్మ ద్వారా సంక్రమించు ఔపాధికమైనట్టిది ఉత్కృష్టమైన శేషత్వమునకు వర్ణమును సహింపగలరు? విరోధి అయిన అహంకారమును  ప్రేరేపించునట్టిది, దానికదే ఉపాధి అయినట్లు ఉత్కృష్టమైన వర్ణమును సహింపజాలరు కదా! వర్ణము అనునది ఔపాధికము (హేతువు) అయినప్పటికీ దానిని ఉపాధి (కారణము)గా చెప్పుట కార్యమును కారణముతో చూడటము(చెప్పడము) వలన అని అర్థము అవుచున్నది.

అడియేన్ పవన్ రమనుజ డసన్

మూలము : https://granthams.koyil.org/2024/07/19/acharya-hrudhayam-88-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment