<< చూర్ణిక 88
చూర్ణిక 89
అవతారిక
వర్ణమునకు గల ఔపాధికత్వమును(కారణము చేత ఏర్పడినది అనగా కర్మ) ఉదాహరణ ద్వారా నాయనార్లు సిద్ధింపజేయుచున్నారు.
చూర్ణిక
ఇతిన్ ఔపాధికత్వమ్ ఒరురాజా తన్నై మఴైమునివనాక్కినవన్ నీశనాక్కివిత్త రాజావై వారేయుఴుప్పాక యజిప్పిత్తు స్వర్గమేత్తినపోతే తెరియుమ్
సంక్షిప్త వ్యాఖ్యానము
ఒక రాజు(విశ్వామిత్రుడు) ఒక వ్యక్తి చేత(వశిష్ఠుడు) అధమ గతికి పతనమైనట్టి మరొక రాజును(త్రిశంకు) యజ్ఞము ద్వారా స్వర్గమునకు పంపుట మరియు విశ్వామిత్రుని బ్రహ్మర్షిగా మార్చబడిన ఒక ఘటన ద్వారా వర్ణమునకు గల ఔపాధికత్వమును చూడవచ్చును.
వ్యాఖ్యానము
అనగా – కౌశిక గోత్రమున జన్మించిన విశ్వామిత్రుడు తనకు కలిగిన కోరిక చేత బ్రహ్మర్షిగా(బ్రాహ్మణ వర్ణములో జన్మించిన గొప్ప ఋషులను బ్రహ్మర్షి గా పిలిచెదరు) అగుటకు చాల కాలము తపస్సు చేసినట్టి ఘటన ద్వారా వర్ణము యొక్క ఔపాధికత్వము స్పష్టముగా గోచరించును. గొప్ప తపో శక్తిని కలిగిన వశిష్ఠుడు ఆతనిని(విశ్వామిత్రుని) బ్రహ్మర్షిగా మార్చెను. పెరుమాళ్ తిరుమొళి 10.2 “మన్దిరన్గొళ్ మఴై మునివన్” (వేదములో గొప్ప నేర్పును మరియు అన్ని మంత్రములను తన వద్ద కలిగిన వాడైన విశ్వామిత్ర ఋషి) అని చెప్పినట్టు ఇక్ష్వాకు వంశమునకు చెందిన త్రిశంకు వశిష్ఠుని వాక్కులను వినని వాడై మరియు అవమానించిన వాడై ఉండగా దానిని గమనించిన వశిష్ఠుని కుమారులు త్రిశంకుని శపించి ఆతను వక్షస్థలమున ధరించియున్న యజ్ఞోపవీతమును చండాలుడు ధరించు తోలు వలె మార్చి అతనిని చండాలునిలా మార్చెను. విశ్వామిత్రుడు ఆ తోలునే యజ్ఞములో అంగముగా ఉపయోగించు ఒక వస్త్రములా మార్చి తన యొక్క గొప్ప మంత్ర శక్తి చేత ఆతనిని స్వర్గమునకు పంపెను.
ఈ విధముగా
1) ఒక క్షత్రియుడు తన సుకృతము చేత అదే శరీరములో బ్రహ్మర్షిగా మారుట
2) ఒక క్షత్రియుడు తన యొక్క దుష్కృతము చేత అదే శరీరములో చండాలునిగా మారుట
3) క్షత్రియత్వము పోయి బ్రహ్మర్షి అయిన వాడు తాను బ్రహ్మర్షి అగుటకు ముందే క్షత్రియత్వమును పోయి చండాలుడైన వాడిని ఆ చండాల శరీరముతోనే వాడి చేత యజ్ఞమును చేయించి స్వర్గమునకు పంపుట చేత వర్ణము కర్మను బట్టి ఉండును అన్న విషయము అందరికీ అర్ధము అయినట్టు అయినది.
అడియేన్ పవన్ రామానుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/07/19/acharya-hrudhayam-89-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org