కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 6 – యశోదా దేవి లోకాలను కృష్ణుడి నోటిలో చూడుట

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి 

<< 5 – తృణావర్తాసుర వధ

కృష్ణుడు మరియు బలరాముడు పాకుతున్న రోజులల్లో వారు బురద, నేల అనే తేడా లేకుండా అన్ని చోట్లలో పాకి తల్లులు యశోదా మరియు రోహిణి, వడిలోకి చేరి చక్కగా పాలు త్రాగేవారు.

సాధారణంగా, గోపకులంలో, స్నానం మొదలైన సదాచారం కొంత తక్కువ ఉంటాయి. భగవానుడు గోప కులానికి నాయకుడిగా జన్మించిన వెంటనే వారు ఈ నియమ-నిష్ఠలు వదిలేసాడు. తల్లి యశోదా కూడా కృష్ణుడికి స్నానం చెయ్యించటానికి ముప్పు తిప్పలు పడేది, పేరియాళ్వార్ వారి ప్రబంధం లో “వెణ్ణెయ్ అళైన్ద కుణుంగుం” అనే పూర్తి ఒక్క పదికం యశోదా భావం లో స్నానం చెయ్యించటానికి రాశారు.

ఈ రీతిలో, కొంత కాలం లో, కృష్ణుడు నిలపడటం మరియు తప్పటడుగులు వెయ్యటం మొదలు పెట్టాడు. ఆ సమయం నుండి అమ్మాయిల జుట్టు లాగటం, వారి తల పైన కుండలు పగలుకొట్టటం, వెన్న దొంగతనం చెయ్యటం, ఆవులు దూడలను ఏడ్పించటం వంటి చిలిపి చేష్టలు మొదలు పెట్టాడు.

ఒక్కసారి, పిల్లలు అందరూ బురద దారిలో ఆడుతున్న సమయం లో, కృష్ణుడు కొంత మన్నుని తీసుకొని తిన్నాడు. అక్కడ ఉన్న పిల్లలు అందరూ కలిసి యశోదా దేవి దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేశారు. అది విన్న యశోదా దేవి కోపముగా వెళ్లి “మన్ను ఎందుకు తిన్నావు అని అడుగగా?” కృష్ణుడు అస్సలు తినలేదు అని చెప్పాడు. అది విన్న తల్లి ” నోరు తెరువు! నేను చూస్తాను అనగా”. కృష్ణుడు తల్లిని భ్రమింప చెయ్యాలి అని అనుకుని, తన నోటిని తెరిచి, మొత్తం లోకాలని, తనను, తల్లిని చూపగా వారు ఆశ్చర్య పోయి, అందరి గోపికలను పిలిచి చూపించగా వారు అందరూ చూసి సంభ్రమ-ఆశ్చర్యాలకు లోనయ్యారు. వెంటనే ఆ దృష్టిని మూసివేసి, వారు అందరూ మర్చిపోయే లాగా చేశారు. పెరియాళ్వార్, తమ ప్రబంధంలో ఈ సంఘటనను అందముగా వర్ణిస్తూ “వాయుళ్ వైయకమ్ కణ్డ మడనల్లార్, ఆయర్ పుత్తిరనల్లన్ అరుమ్ దెయ్ వమ్, పాయశీరుడై ప్పణ్బుడైప్పాలకన్, మాయన్ ఎన్ఱు మకిళ్ న్దనర్ మాదరే” (ఉత్తములు అయిన గోప పురుషులు, స్త్రీలు కృష్ణుడి నోట్లో బ్రహ్మాండాలు చూసి ఇతను సాధారణ గోప బలుడు కాదు, అనంత కల్యాణ గుణాలు కలిగిన పరమ పురుషుడు అని ఒక్కరితో ఒక్కరు చెప్పుకుని సంతోషించే వారు).

ఈ లీల లోని సారాంశం :

  • భగవంతుడు, సౌలభ్యం మరియు పరత్వం రెండిటిని కృష్ణావతారం లో చూపారు.
  • భగవంతుడు, తన దివ్య కల్యాణ గుణాలతో నిండిన లీలలు చూపి భక్తులు మనసు ని ఆకట్టుకుంటాడు.

మూలం : https://granthams.koyil.org/2023/08/28/krishna-leela-6-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment