కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 7 – వెన్న దొంగలించి దొరికిపోవటం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి 

<< 6 – యశోదా దేవి లోకాలను కృష్ణుడి నోటిలో చూడుట

తిరువిరుత్తం లో నమ్మాళ్వార్ “శూట్టు నన్మాలైకళ్ తూయన ఏన్ది విణ్ణోర్ గళ్ నన్నీర్ ఆట్టి అమ్ తూపమ్ తరానిఱ్కవేయఙ్గ
ఓర్మాయైయినాల్ ఈట్టియ వెణ్ణెయ్ తొడువుణ్ణ పోన్దుం ఇమిల్ ఏర్ట్రవన్ కూన్ కోట్టిడై యాడినై కూత్తు అడల్ ఆయర్ తమ్ కొమ్బినుక్కే” పరమపదం లో నిత్యసూరుల తిరువారాధనం మధ్యన ఈ లీల విభూతి లోకి కృష్ణుడిగా వేంచేయటం వెనుక కారణం వివరిస్తూ – 1)భక్తులు చేతులారా చేసిన వెన్నని స్వీకరించుటకు 2)నప్పిన్నై పిరాట్టి ఆలింగనం చేసుకోవటానికి. ఈ రెండు లీలలను ఆళ్వార్లు అందరూ ఎంతో వైభవముగా అనుభవిస్తూ పాశురాలల్లో వివరించారు. ఆళ్వార్లు మాత్రమే కాదు, వైరాగ్యం కలిగిన మునులు కూడా పురాణాలల్లో వివరించారు. వీటిల్లో, కృష్ణుడు వెన్న అపహరించే లీలను కొంత అనుభవిద్దాం.

నమ్మాళ్వార్, తమ తిరువాయిమొళి లో, “వళవేళ్ ఉలగిన్ ముదలాయ వానోర్ ఇరైయై అరువినైయేన్ కళవేళ్ వెణ్ణె తొడువుణ్డ కళ్వా ఎన్బన” (నేను, అసంఖ్యమైన పాపాలు కలిగిన వాడిని, ఉభయ వయోభూతి నాయకుడిని, ధ్యానించి, వాటిని పోగొట్టుకున్న వాడినై “వెన్నె దొంగలించి ఆశగా తిన్న ఓ దొంగ!” అని యశోదా దేవిలా అన్నాను); పెరియాళ్వార్, వారి పెరియాళ్వార్ తిరుమొళి లో “వెణ్ణై అళైంద కుణుంగుం” (వెన్నె కాసుతున్నప్పుడు వచ్చే వాసన తో) మరియు “వెణ్ణై విళుంగి వెఱుం కలత్తై వెఱ్పిడై ఇట్టు”(వెన్నె తిని, ఆ మట్టి కుండను నేలకు వేసి కొట్టారు; కులశేఖరాళ్వార్ వారి పెరుమాళ్ తిరుమొళి లో “ముళుదుం వెణ్ణై అళైందు” (వెన్నెను పూర్తి గా కలుపుతూ); తిరుపాణాళ్వార్ వారి అమలనాధిపిరాన్ లో “వెణ్ణై ఉండ వాయన్” (వెన్నెను తిన్న నోటిని కలిగిన స్వామి); ఈ విధముగా, ఈ విధముగా ప్రతి ఆళ్వార్, ఈ లీలను పలు-పలు విధాలుగా కీర్తించారు.

తిరుమంగై ఆళ్వార్, తమ శిఱియ తిరుమడల్, స్వామివారి వెన్నె దొంగలించే లీలను వర్ణించారు. “ఆరాద తన్మైయనాయ్ ఆఙ్గోరునాళాయ్ ప్పాడి” (గోకులంలో నిరాశగా ఒక్క రోజు) మొదలుగా, ఎలా కృష్ణుడు యశోదా దేవిని ఏమరిచి, వెన్నెను దొంగలించి తిన్నాడో, అది తెలిసి ఎలా యశోదా దేవి రోటికి కట్టివేసి కొట్టిందో, కళ్లకు కట్టిన విధముగా వివరించారు.

కృష్ణుడు వెన్నని తన ఇంట్లో నుండే కాకుండా అనేక గోపికల కుటీరాల నుండి కూడా దొంగలించేవాడు. పెరియాళ్వార్ తిరుమొళిలో వారు ఎంత అందముగా గోపికలు అందరు వచ్చి యశోదా దేవికి మొర పెట్టుకుంటున్నారో వర్ణించారు, “వెణ్ణై విళుంగి ” పదికంలో. యశోదా దేవికి కట్టుపడి ఉండటం, నమ్మాళ్వార్ పైన మాత్రమే నిష్ఠ కలిగిన మధురకవి ఆళ్వార్ కూడా అనుభవించారు. కృష్ణుడి వైభవం ఏంటి అంటే, పూర్తి ఆచార్య నిష్ఠ కలిగిన వారిని కూడా ఆకట్టుకోవటం.

వెన్నను దొంగలించేటప్పుడు, కృష్ణుడు చాలా అమాయకత్వం ప్రదర్శించేవాడు, అతనికి తాను చేసిన దొంగతనం కప్పిపుచ్చటం కూడా తెలీదు కనుక, దొరికిపోయి వెలిగిపోయాడు. మన ఆచార్యులు అందరూ కూడా “ఎలా పరమపురుషుడు, సర్వేశ్వరుడు, ఇలా వెన్ని దొంగతనం చెయ్యగలడు?” అని ధ్యానించి ఆనందిచేవారు.

ఈ లీలలోని సారాంశం,

  • వెన్న, సాధారణముగా తెల్లగా ఉంటుంది, శ్వేత వర్ణం సత్త్వగుణాన్ని సూచిస్తుంది. కావున భగవంతుడికి సత్త్వగుణం మరియు, ఆ గుణం కలిగి ఉన్నవారు అంటే చాలా ఇష్టం అని అర్థం అవుతుంది.
  • వెన్న మరియు పెరుగు తిని ఆ పాత్రలను పగలకొట్టటం, ఆ దేవదేవుడు ఆత్మను ఆశగా స్వీకరించి, దాన్ని ఇక్కడ కట్టివేసే శరీరాన్ని నశింపచేస్తాడు అని చూపుతుంది.
  • భగవానుడు, వెన్న, పెరుగు మొదలైనవి కోరటం వెనుక కారణం ఇవి వారి భక్తులు వారి చేతులారా చేస్తారు కనుక.
  • యశోదా దేవి చేత కట్టి వెయ్యబడటం, వారి భక్తుల పట్ల వారి పారతంత్య్రం(వారికి లొంగిపోవటం) చూపుతుంది.

మూలం : https://granthams.koyil.org/2023/09/03/krishna-leela-7-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment