కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 18 – వస్త్ర అపహరణం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి

<< 17 – వేణు గానం

కృష్ణలీలల్లో, ప్రధానమైనది, గోపికా వస్త్ర అపహరణం. ఈ లీలను అంతరార్థంతో పాటుగా చూద్దాం.

కృష్ణుడు, గోపికల పట్ల అత్యంత ప్రేమ కలిగి ఉండేవాడు. వారికీ కృష్ణుడు అంటే ప్రేమ ఉండేది. అయినప్పటికీ, అతను వారిని, జుట్టు లాగుతూ, వస్త్రాలు లాగుతూ ఆటపటించేవాడు. అవి తట్టుకోలేక వారు వెళ్లి యశోదమ్మ వద్దకు వెళ్లి మొరపెట్టుకునే వారు. వారూ తన పట్ల కోపం చూపేవారు.

గోపికలు అందరూ, ఒక రోజు కృష్ణుడికి తెలియకుండా స్నానం చేయటం కొరకు కొలను వద్దకు వెళ్లారు. అయితే, కృష్ణుడు, వారికి తెలియకుండా వెంబడించాడు. వారు అందరూ చిన్న పిల్లలు అయ్యి ఉండడంతో, స్నానం కోసం తమ దుస్తులను ఒడ్డున పెట్టి నీటిలోకి దిగారు. వారు నీటిలోకి వెళ్లగానే, కృష్ణుడు, ఆ దుస్తులను దొంగిలించి సమీపంలోని కదంబ చెట్టు మీదకు ఎక్కి, ఒక శాఖపై కూర్చున్నాడు. స్నానం చేసిన గోపికలు బయటకి వచ్చి తమ దుస్తులు లేనట్లు గమనించారు. వారు ఇది దేవతలో లేదా తెలియని ఇతరశక్తుల వల్ల జరిగిందని భావించారు. అప్పుడు కృష్ణుడు, చెట్టు పైనుండు పిలిచి ఇలా చెప్పెను: “మీ దుస్తులు కావాలనుకుంటే, మీ చేతులను జోడించి పైకి ఎత్తి నమస్కారం చేయండి ”. మొదట వారు సంకోచించి అలా చేయలేదు, కానీ తరువాత కృష్ణుడి పట్ల వారి భక్తి కారణంగా, తమ శరీరాన్ని కప్పుకోవడానికి కాకుండా, చేతులను జోడించి, పైకి ఎత్తి నమస్కరించారు. కృష్ణుడు సంతృప్తి చెంది దుస్తులను తిరిగి ఇచ్చాడు.

పెరియాళ్వార్ తమ పెరియాళ్వార్ తిరుమొళిలో ఈ లీలను ఇలా సుందరంగా చిత్రిస్తారు“వండమర్ పూంగుళలార్ తుగిల్ కైక్కొండు విండోయ్ మరత్తాన్”, అందమైన పుష్పసుగంధములు కలిగిన కేశాలు ఉన్న గోపికల వస్త్రాలను చేతపట్టి, ఆయన ఆకాశాన్ని తాకినట్టు ఉన్న చెట్టు ఎక్కాడు. ఆండాళ్ అమ్మ కూడా నాచ్చియార్ తిరుమొళిలో, విశేషంగా “కోళియళైప్పదన్ మున్నం” అనే పదికం, ఈ దివ్యలీలను మధుర రసభరితంగా వివరిస్తుంది. తిరుమంగై ఆళ్వర్లు తమ పెరియ తిరుమొళిలో తుళయ్యార్ కరుమెన్ కుళలాయ్చియర్ తమ తుగిల్ వారియుమ్” అని నల్లటి మేని ఛాయ, మ్రుదువైన కురులు కలిగిన గోపికల వస్త్రములను తీసుకోవడాన్ని అనుభవించారు.

ఈ లీల యొక్క సారంశం:

  • భగవంతుని శరణు ఆశ్రయిస్తున్నప్పుడు, మన చేతిలో ఏదీ లేదని, మనకు ఇంకెవరూ శరణు కాదని స్పష్టంగా చెప్పాలి. అన్ని సంకోచాలనూ విడిచిపెట్టి, భగవంతుని తిరువడులే మనకు పరమాశ్రయం అని పూర్తిగా అంగీకరించాలి. గోపికలకు కృష్ణుడిపై ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ, కృష్ణుడు వారికే పరిపూర్ణ ఆశ్రయం అన్న నిజం వారికి పూర్తిగా అవగాహన కాలేదు. ఆ సత్యాన్ని వారికి గ్రహింపజేయడానికి ఈ లీలాను కృష్ణుడు ప్రదర్శించాడు.
  • ఈ సంఘటనను కొందరు తప్పుడు రీతిలో వ్యాఖ్యానిస్తారు. ఆ వ్యాఖ్యానాలు కృష్ణుడు అశ్లీలంగా ప్రవర్తించాడని తప్పుగా చెబుతాయి. కానీ ఇక్కడ గోపికలు చిన్నవారు. కృష్ణుడు ఆ సమయంలో ఆరేళ్ల నుండి ఏడేళ్ల మధ్య ఉన్నట్లుగానే, వారు కూడా అదే వయస్సులో ఉన్నారు. అందువల్ల ఈ సందర్భంలో ఎలాంటి తప్పు భావనకు లేదా అశ్లీలతకు అవకాశం లేదు.

మూలం : https://granthams.koyil.org/2023/09/23/krishna-leela-18-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment