కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 29 – ముష్టికాసుర చాణూరుల వధ

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి

<< 28 – కువలయాపీడ వధ

కువలయాపీడాన్ని హతం చేసిన తర్వాత, కృష్ణుడు బలరాముడు పోరాట రంగాన్ని ప్రవేశించారు. అప్పుడు మొత్తం పోరాటయోధ్దులు, పురుషులు, స్త్రీలు కూడా వారిని చూసి ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయారు. అక్కడ ఉన్న అనేకమంది మహానుభావులు వారి కాంతి చూసి వారు దైవ స్వరూపులు అని అర్థం చేసుకున్నారు..

ఆ మల్లయొద్దులు భారీ కాయాలు, అసాధారణ శక్తి కలిగినవారు. చాణూరుడు, కృష్ణుడు బలరాముడిని పోరాటానికి ఆహ్వానించాడు. చాణూరుడు, ముష్టికుడు మొదలైన యోధులు కృష్ణుడు బలరాముడి గొప్పతనాన్ని తెలిసినప్పటికీ, కంసుని ఆజ్ఞను అనుసరించి వారితో పోరాడటానికి వెళ్లారు. “ఈ యుద్ధం నుండి వెనక్కి తగ్గి, పిరికివారిలా కంసుడి చేతుల్లో చనిపోవడానికి బదులు, ధైర్యంగా నిలబడి బలరామ-కృష్ణుల చేతుల్లో మరణిద్దాం.” అని వారు నిర్ణయించుకున్నారు. కృష్ణుడు బలరాముడు చిన్న పిల్లలు. అక్కడ ఉన్న ప్రజలు వారిపై ఉన్న అపారమైన ప్రేమ వల్ల భయపడిపోయారు; ఈ యుద్ధం సామ్యం లేని వారి మధ్య జరుగుతోంది అని ఆందోళన చెందారు.

కృష్ణుడు చాణూరుడితో, బలరాముడు ముష్టికుడితో పోరాడి, ఇద్దరినీ చంపేశారు. వారిని దాడి చేయడానికి వచ్చిన ఇతర మల్లయోధులను కూడా ధ్వంసం చేశారు. దీనిని చూసి అందరూ ఆనందించారు. కానీ కంసుడు ఏనుగుని, మావటివాడిని, ఇప్పుడు మల్లయోధులను చంపేశారని చాలా భయపడ్డాడు.

కృష్ణుడు మల్ల యోధులను ఎలా జయించాడో ఆళ్వార్లు అనేక పాశురాలలో స్పష్టం చేశారు. పెరియాళ్వారు, తమ పెరియాళ్వార్ తిరుమొళిలో: “ఏవిఱ్ఱుచ్ చేయవాన్ ఎన్ఱేదిర్ందు వంత మల్లరై సావత్ తగర్త్థ సాంధణి తోళ్ చధురన్” అని చెప్పుతారు(కంసుని ఆజ్ఞతో పోరాడటానికి వచ్చిన మల్లులను, తన చందనం అలంకరించిన శరీరానికి కష్టం కలగకుండా, కృష్ణుడు తెలివిగా ధ్వంసం చేశాడు); ఆండాళ్ అమ్మ తమ తిరుప్పావైలో “మల్లరై మాట్టియ, ధేవాధి ధేవన్” (మల్లరులను చంపిన దేవాది దేవుడు) అని చెప్పారు. నమ్మాళ్వారు తిరువాయ్మొళి “నిగరిల్ మల్లరైచ్ చెఱ్ఱదుమ్” (తిరుగులేని మల్లరులను ధ్వంసం చేసినది) అని. తిరుమంగై ఆళ్వారు తిరునెడుందాండకంలో “మల్లడర్తు మల్లరై అన్ఱు అట్టాయ్” (మునుపు మల్లురులతో పోరాడి చంపినవాడు) అని చెప్పారు.

ఈ సంఘటన లోని సారాంశం:

  • గోపాల కుటుంబంలో మానవునిగా భగవంతుడు కనిపించి, బాలునిగా ఉన్నప్పటికీ, అతని శక్తిలో ఎటువంటి కొరత ఉండదు. శత్రువులను సులభంగా జయిస్తాడు.
  • శత్రువులు కూడా భగవంతుడి గొప్పతనాన్ని తెలిసి, వారితో పోరాడి చనిపోవటాన్ని కూడా సౌభాగ్యంగా భావిస్తారు.

మూలం : https://granthams.koyil.org/2023/10/06/krishna-leelas-29-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment