శ్రీవైష్ణవ దినచర్య

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమతే వరవరమునయే  నమః శ్రీ వానాచల మహామునయే  నమః

శ్రీవైష్ణవులు తమ దైనందిన జీవితంలో క్రమశిక్షణతో కూడిన ప్రమాణికమైన దినచర్యను అనుసరించాలి. ప్రతి కార్యము మన సంప్రదాయానికి అనుగుణంగానే ఉండాలి.

  • నిద్ర లేవడం
    • నిత్యమూ కూడా ఉదయం 4:30 ప్రాంతంలో నిద్ర లేవాలి.
    • గురుపరంపరా మంత్రం మరియు “హరి” అనే పదం  ఏడు సార్లు మనసులో మననం చేసుకోవాలి
    • కాళ్ళు,చేతులు కడుక్కోని మరియు నోరు పుక్కిలించాలి
    • పరత్వాది పంచకం, పరమార్థ శ్లోక ద్వయం మరియు గజేంద్ర మోక్ష శ్లోక ద్వయం మననం చేసుకోవాలి.
    • కనీసం కొన్ని నిమిషాలైనా గురుపరంపర మరియు ద్వయ మహా మంత్రాన్ని ధ్యానించాలి
  • ఉదయం చేసే నిత్యకృత్యాలు
    • ముందుగా కాల కృత్యాలను ముగించాలి (పళ్ళు తోమడం మొదలైనవి)
    • గంగైయిల్ పునిధమాయ,నిన్ఱ వణ్ కీర్త్తి,కథా పునశ్చంక అనే శ్లోకం మరియు ఆచార్య తనియన్ ను పఠిస్తూ స్నానం చేయాలి
    • ద్వాదశ కేశవ నామాలు మరియు ద్వాదశ పెరియ పిరాట్టి నామాలు పఠిస్తూ ద్వాదశ ఊర్ధ్వ పుండ్రాలు ధరించాలి
    • గురుపరంపర మంత్రం, తిరుమంత్రం, ద్వయ మంత్రం, చరమ శ్లోకం పఠించాలి
    • ఓరాణ్ వళి గురుపరంపరా తనియన్లు మరియు ఆచార్య పరంపరా తనియన్లు పఠించాలి
    • సంధ్యావందనం చేయాలి(యజ్ఞోపవీతం ఉన్నవారు)
    • తిరువారాధనం – దశ 1
      • నీరు, సుగంధ చూర్ణం(తీర్థం పొడి), పువ్వులు, ధూపం, దీపం మొదలైనవి సిద్ధం చేసుకోవాలి
      • వైయమ్ తగలియా, అన్బే తగలియా, తిరుక్కణ్డేన్, మంగుల్ తోయ్ సెన్ని పాశురాలను చదువుతూ దీపాన్ని వెలిగించాలి
      • ఆచార్య శ్రీపాద తీర్థం సిద్ధపరచి, దానిని స్వీకరించాలి
      • సన్నిధి ముందు సాష్టాంగ ప్రణామం సమర్పించాలి
      • చేతులతో మూడు సార్లు చప్పట్లు కొట్టి, సన్నిధి తలుపు తెరవాలి   నాయగనాయ్ నిన్ఱ, తిరుపళ్ళియెళుచ్చి, మారి మలై ముళంజిల్, అన్ఱు ఇవ్వులగం అళందాయ్, అంగణ్ మాజ్ఞాలత్తరశర్ పాశురాలను పఠించాలి.                                  
      •  మంత్రాసనమును ఏర్పటుచేయాలి
    • భోగము(ఆహరమును) తయారుచేయాలి
    • సంతై నేర్చుకోవడం, పాశురాలు/స్తోత్రములు/రహస్య గ్రంథాలు సాధన చేయడం, ఉపన్యాసాలు వినడం వంటివి చేయవచ్చు
  • మధ్యాహ్నం చేసే నిత్యకృత్యాలు
    • మాధ్యనికం (యజ్ఞోపవీతం ఉన్నవారు)
    • తిరువారాధనం – దశ 2
      • స్నానాసనము – సాధ్యమైనంత వరకు పంచ సూక్తమును పఠించాలి(యజ్ఞోపవీతం ఉన్నవారు).వెణ్ణెయ్ అళైంద కుణున్గుమ్ పఠించాలి.
      • అలంకారాసనము – ధూపం,దీపం,వేద ఆరంభం (యజ్ఞోపవీతం ఉన్నవారు),అర్చన
      • నిత్యానుసంధానం పారాయణం లేదా ఆళ్వార్ తిరునగరి క్రమం ఆధారంగా 4000 పారాయణం
      • భోజ్యాసనం
      • పునర్ మంత్రాసనం
      • మంగళ హరతి
      • శాత్తుముఱై,తీర్థాన్ని అందరికీ పంచాలి
    • అనుయాగం – శ్రీవైష్ణవ అతిథులకి తధియరాధనం సమర్పించాలి
    • కుటుంబంతో పాటు ప్రసాదాన్ని స్వీకరించాలి
    • సంతై నేర్చుకోవడం, పాశురాలు/స్తోత్రములు/రహస్య గ్రంథాలు సాధన చేయడం, ఉపన్యాసాలు వినడం వంటివి చేయవచ్చు.
  • సాయంత్రం చేసే నిత్యకృత్యాలు
    • సాయం సంధ్యావందనం (యజ్ఞోపవీతం ఉన్నవారు)
    • తిరువారాధనం – దశ 3
      • వైయమ్ తగలియా, అన్బే తగలియా, తిరుక్కణ్డేన్, మంగుల్ తోయ్ సెన్ని పాశురాలను చదువుతూ దీపాన్ని వెలిగించాలి
      • సహస్రనామం, పూర్వాచార్య స్థోత్రాలను పఠించి, శాత్తుముఱై చేయాలి
      • పర్యంకాసనము(శయనము)
      • సన్నిధిని మూసివేయవలెను.
    • కుటుంబంతో పాటు ప్రసాదాన్ని స్వీకరించాలి
    • సంతై నేర్చుకోవడం, పాశురాలు/స్తోత్రములు/రహస్య గ్రంథాలు సాధన చేయడం, ఉపన్యాసాలు వినడం వంటివి చేయవచ్చు
    • వీలైతే సత్సంగంలో సమభావ భాగవతులతో కలవాలి.
  • రాత్రి
    • కుటుంబ సభ్యులతో సంప్రదాయ విషయాలపై చర్చలు.
    • రాత్రి 10 గంటలలోపు విశ్రాంతి తీసుకోవాలి/నిద్రపోవాలి.

గమనిక:

  • యజ్ఞోపవీతం లేనివారు దివ్యప్రబంధ పాశురాలు, పూర్వాచార్య స్తోత్రాలు మరియు రహస్య గ్రంథాలను నేర్చుకోవడం, పఠించడం వరకే పరిమితం కావాలి.     అవసరమైతే ఈ విషయంలో పెద్దలను సంప్రదించవచ్చు.
  • అనధ్యాయన కాల సమయంలో, దివ్యప్రబంధాలకు దూరంగా ఉండాలి. పూర్వాచార్య స్థోత్రాలు మరియు రహస్య గ్రంథాలపై దృష్టి పెట్టాలి.
  • ఈ అనుసంధానం సాధారణంగా పురుష భాగవతులు దృష్టి కోణం నుండి చేయబడినప్పటికీ, కైంకర్యాలకు అవసరమైన తమ గృహ బాధ్యతలను నెరవేరుస్తూ, స్త్రీ భాగవతులు కూడా ఈ దినచర్యలో సహాయపడాలి.
  • ఆహార నియమం చాలా ముఖ్యమైనది. మనకు అనుమతించబడిన ఆహార పదార్థాలను మాత్రమే మనం తినాలి. ప్రతిదీ నీటితో సహా పెరుమాళ్లకు, ఆళ్వార్లు మరియు ఆచార్యులకు సమర్పించిన తర్వాత మాత్రమే వారి ప్రసాదంగా సేవించాలి.
  • ఆలయాలు, ఆచార్యుల మఠం/తిరుమాళిగైలో ఒకరికున్న నిమగ్నతను బట్టి, అవసరమైనప్పుడు కైంకర్యాలకు సర్దుబాటు చేసుకోని సమకుర్చుకోవల్సి ఉంటుంది.
  • శాస్త్ర నియమాలను అతిక్రమించకుండా, సాధ్యమైనంత వరకు డబ్బు సంపాదించవచ్చు. దైనందిన జీవితంలోని ముఖ్యమైన అంశాలకు ఆటంకం కలగకుండా, అవసరమైన మేరకు దినచర్యకు సమయాన్ని కేటాయించుకోవాలి.
  • భగవత్ విషయాన్ని (ఆధ్యాత్మిక విషయాలను) నేర్చుకోని, ఆచరించి ఇతరులతో ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వీలైనంత వరకు పంచుకోండి.

సూచనలు:

మూలము : https://granthams.koyil.org/2026/03/30/srivaishnava-daily-routine-english/

అడియేన్ దాసరి కేశవ కృష్ణ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment