శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః
<< పూర్వపు భాగం

శ్రీ నంపిళ్ళై శ్రీపాదముల వద్ద పిన్బళగియ పెరుమాళ్ జీయర్
ఈ క్రింది వ్యాసం, శ్రీ ఉ.వే. సారథి తొతాద్రి స్వామి వారు వార్తామాలై గ్రంథంపై తమిళంలో చేసిన కాలక్షేపం ఆధారంగా అనువదించబడినది. ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు, అలాగే అనువాదాలను పరిశీలించి, ప్రచురించడంలో నిరంతరం సహకరిస్తున్నందుకు స్వామి వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.
పిన్బళగియ పెరుమాళ్ జీయర్ స్వామి వారు వార్తామాలై గ్రంథాన్ని రచించారు. వారు నంపిళ్ళై స్వామి వారి ప్రియశిష్యులు. గురుపరంపరా ప్రభావం 6000 పడి గ్రంథాన్ని రచించినట్లే, మన పూర్వాచార్యుల అనేక ఉపదేశాలను కూడా మన ప్రయోజనం కోసం ఈ వార్తామాలై గ్రంథంలో సంకలనం చేశారు.
‘వార్తై’ అంటే ఒక విషయాన్ని తెలియజేసే మాట లేదా ఉపదేశం అని అర్థం. ఈ గ్రంథంలో స్వామి వారు అనేక ఉపదేశాలను ఒక మాలగా కూర్చారు. తిరుమంత్రం, ద్వయం, చరమశ్లోకం (రహస్యత్రయం), తత్త్వత్రయం, అర్థపంచకం మొదలైన విషయాలకు సంబంధించిన అనేక సంప్రదాయ విశేషాలు, రహస్యార్థాలు ఈ గ్రంథంలో ఎంతో చక్కగా, విపులంగా వివరించబడ్డాయి.
వార్తై 38
ఈ వార్తై ఎంతో గంభీరమైనది. ఇందులో తిరుమంత్రానికి సంబంధించిన అర్థం ఎంతో చక్కగా వివరించబడింది. ఈ ఉపదేశాన్ని పెరియ భట్టర్ (పరాశర భట్టర్) వారు నంజీయర్ వారికి అనుగ్రహించారు. ఇందులో అనేక అర్థాలు ఇమిడి ఉన్నాయి. వాటిని ఎంతో విపులంగా వివరించారు.
పరాశర భట్టర్ వారు తమ స్తోత్రగ్రంథమైన అష్టశ్లోకీలో రహస్యత్రయానికి సంబంధించిన సంస్కృత వివరణలను శ్లోకాల రూపంలో మనకు అనుగ్రహించారు. వాస్తవానికి, మన సంప్రదాయంలో రచించబడిన మొట్టమొదటి రహస్యగ్రంథం ఇదే. ఇందులో తిరుమంత్రానికి నాలుగు శ్లోకాలు, ద్వయమంత్రానికి రెండు శ్లోకాలు, చరమశ్లోకానికి రెండు శ్లోకాలు ఉన్నాయి. ఈ విధంగా మొత్తం ఎనిమిది శ్లోకాలతో ఈ గ్రంథం రూపొందించబడింది.
నాలుగో శ్లోకం ఎంతో అద్భుతమైనది. తిరుమంత్రార్థాన్ని మనం అర్థం చేసుకునే క్రమంలో ఏవైనా సందేహాలు కలిగినప్పుడు, వాటిని నివృత్తి చేసుకొని స్పష్టమైన అవగాహనను ఎలా పొందాలో ఈ శ్లోకం వివరిస్తుంది.

దేహాసక్తాత్మ బుద్ధిర్యది భవతి పదం సాధు విద్యాత్తృతీయమ్
స్వాతంత్ర్యాన్థో యది స్యాత్ ప్రథమం ఇతరశేషత్వ ధీశ్చేద్ద్వితీయమ్|
ఆత్మత్రాణోన్ముఖః చేన్నమ ఇతి చ పదం బాన్ధవా భాసలోలః
శబ్దం నారాయణాఖ్యం, విషయచపలధీశ్చేత్ చతుర్థీం ప్రపన్నః||
ఈ వార్తై ఈ శ్లోకానికి వ్యాఖ్యాన రూపంలో అందించబడింది. ఇందులో భట్టర్ స్వామి వారు మన మనస్సులో ఎలాంటి సందేహాలు కలుగుతాయో, వాటిని ఎలా నివృత్తి చేసుకోవాలో వివరిస్తున్నారు. పుత్తూర్ స్వామి వారు అనుగ్రహించిన అందమైన వ్యాఖ్యానాన్ని ఆధారంగా చేసుకొని, ఇందులోని అనేక సూక్ష్మమైన విషయాల అంతరార్థాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
నఙ్జీయరాన వేదాన్తిగళుక్కు పెరియభట్టర్ ఏకాన్తత్తిలే పణిత్త పరమ రహస్యమ్; తిరుమన్త్ర జ్ఞానమ్ పిఱన్దాలుమ్ ఇఙ్గే యిరుక్కిఱవనాగైయాలే స్వరూపత్తోడే శేరాద దురిత పరమ్పరైగళ్ వన్దు మేలిట్టాల్, తిరుమన్త్రత్తల్ పదఙ్గళినర్థఙ్గళై అనుసన్ధిత్తు పరిహరిత్తు మీళువాన్;
ఎఙ్గనేయెన్నిల్ బహువిరోధి బీజమాన స్వాతన్త్ర్యమ్ మేలిట్టాల్, భగవథ్ పరతన్త్రర్ అల్లోమో, నమక్కు స్వాతన్త్ర్యమ్ కడవదో? ఎన్ఱు అకారార్థత్తై అనుసన్ధిత్తు మీళువాన్;
అసేవ్య సేవైగళ్ వన్దు మేలిట్టాల్, నామ్ అన్యరుక్కు శేషమో భగవద్ అనన్యార్హ శేషభూతర్ అల్లోమో? ఎన్ఱు ఉకార అర్థత్తై అనుసన్ధిత్తు మీళువాన్.
శరీరత్తిలే కార్శ్యస్థూలాదికళ్ మేలిట్టాల్ నామ్ జ్ఞానానానన్ద స్వరూపర్ అల్లోమో, నిత్యర్ అల్లోమో, ఏకరూపర్ అల్లోమో, నామ్ స్వయమ్ ప్రకాశమన్ఱో? ఎన్ఱు మకార అర్థత్తై అనుసన్ధిత్తు మీళువాన్.
నమక్కు ఒరుపురుషార్థమ్ సమ్పాదిక్క వేణ్డావో? ఎన్ఱు సాధనానుష్తానమ్ పణ్ణత్తేడినాల్, స్వరక్షణత్తిల్ ప్రాప్తియిల్లాద భగవత్ పరతన్త్రర్ అల్లోమో, స్వతన్త్రన్ అన్ఱో రక్షణత్తుక్కు క్కడవన్ ఎన్ఱు నమస్సినర్థత్తై అనుసన్ధిత్తు మీళువాన్.
తనక్కు ఉపకారమాగ ఎళున్దరుళియిరుక్కిఱ అర్చావతారత్తిలే శిలకుఱై వన్దు పిఱన్దు కణ్ణుక్కు విషయమానాల్, చేతననుడైయ ఇళవుక్కు ఈశ్వరన్ భృశం భవతి దుఃఖిత నామా పోలే, ఈశ్వరనుడైయ ఇళవుక్కు దుఃఖితనా ఆగాదపోదు నారాయణ పదత్తోడు ఉఱవు పోత్కనెన్ఱు అనుసన్ధిత్తు పర వ్యూహ విభవాది కళెఙ్గు ముళ్ళ కుఱైగళ్ తీర్ న్ద విడమన్ఱో; ఒన్ఱాలొరు కుఱైవత్త విడమన్ఱో; అనుభావ్యమెల్లామ్ నారశబ్దాన్తర్గత మన్ఱోవెన్ఱు నారాయణ పదత్తై అనుసన్ధిత్తు మీళువాన్;
స్వరూపత్తోడు శేరాద ఇతర పరిమాత్తఙ్గళ్ మేలిట్టాల్, స్వరూపానురూపమాన వృత్తి కైఙ్కర్యమన్ఱో ఎన్ఱు చతుర్థియినర్తత్తై అనుసన్ధిత్తు మీళువాన్;
ఇప్పడి పరిహరిత్తు క్కొళ్ళాతపోతు పిఱరుక్కు ఉపదేశిక్కిఱదుక్కుమ్, ఇదిల్ తనక్కు పిఱన్ద జ్ఞానత్తుక్కుమ్ ఎన్న ప్రయోజనమ్ ఉణ్డు? ఎన్ఱు అనుసన్ధిప్పాన్.
స్వపౌరుషత్తాలే తన్ కార్యమ్ తాన్ నిర్వహిప్పదాగ నినైత్తానాగిల్ అకారార్థత్తై అనుసన్ధిత్తు మీళువాన్; అన్యరై రక్షకనాక నినైత్తానాగిల్, ఉకార అర్థత్తై అనుసన్ధిత్తు మీళువాన్;
సాధనత్తిల్ తనక్కు అన్వయమ్ ఉణ్డు ఎన్ఱుమ్, శ్రీవైష్ణవసమబుద్ది పణ్ణినానాగిల్, నమశ్శబ్ద అర్థత్తై అనుసన్ధిత్తు మీళువాన్; ఈశ్వర విభూతిభూతరోడే తనక్కు రాగద్వేషమ్ నడైయాడిత్తాకిల్, నారశబ్ద అర్థత్తై అనుసన్ధిత్తు మీళువాన్;
ఔపాధిక బన్ధుక్కల్ పక్కలిలే బన్ధుతా ప్రతిపత్తి పణ్ణినానాగిల్, అయనశబ్ద అర్థత్తై అనుసన్ధిత్తు మీళువాన్;
పుత్ర పశ్వన్నాది తొడక్కమాగ స్వర్గ ఐష్వర్యమ్ నడువాగ కైవల్యమ్ ముడివాగ వుణ్డానవత్తిల్ పురుషార్థ బుద్ధి పిఱన్దదాగిల్ చతుర్థియినర్థత్తై అనుసన్ధిత్తు మీళువాన్.
భాగం 1-పరిచయం
నఙ్జీయరాన వేదాన్తిగళుక్కు పెరియభట్టర్ ఏకాన్తత్తిలే పణిత్త పరమ రహస్యమ్;
పరాశర భట్టర్ శిష్యులుగా మారి సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి ముందు నంజీయర్ మాధవాచార్యులుగా ప్రసిద్ధి చెందారు. వేదాంతంలో గొప్ప పండితులైనందున వేదాంతిగా కీర్తించబడ్డారు. వారికి అనేకమంది శిష్యులు, అపారమైన సంపద ఉండేవి. వారు తిరునారాయణపురంలో నివసించేవారు.
పరాశర భట్టర్ వారిని ఎంతో వాత్సల్యంతో ఆదరించి, “ఈయన మన జీయర్ కాదా?” అని భావించి, వారికి నంజీయర్ అనే పవిత్రమైన తిరునామాన్ని ప్రసాదించారు.
కూరత్తాళ్వానుకు ఇద్దరు కుమారులు-వేదవ్యాస భట్టర్, పరాశర భట్టర్. పరాశర భట్టర్ పెద్దవారు కావడం చేత పెరియ భట్టర్ అని పిలువబడ్డారు. ఈ వాక్యార్థం పెరియ భట్టర్ ఏకాంతంలో ఉపదేశించిన అత్యంత రహస్యం.
తిరుమన్త్ర జ్ఞానమ్ పిఱన్దాలుమ్ ఇఙ్గే యిరుక్కిఱవనాగైయాలే స్వరూపత్తోడే శేరాద దురిత పరమ్పరైగళ్ వన్దు మేలిట్టాల్, తిరుమన్త్రత్తల్ పదఙ్గళినర్థఙ్గళై అనుసన్ధిత్తు పరిహరిత్తు మీళువాన్;
దురిత పరంపరలు అంటే పాపముల పరంపర. అనుసంధించడం అంటే లోతుగా మననం చేయడం.
ఆచార్యుల ద్వారా పంచసంస్కారాన్ని పొంది, తిరుమంత్ర జ్ఞానాన్ని సంపాదించినప్పటికీ, ఈ సంసారంలో జీవిస్తున్నందున పాపాల పరంపర ఒక వ్యక్తిని ఆవరించవచ్చు.
మన నిజమైన స్వరూపం భగవానునికి సంపూర్ణంగా అధీనులమై ఉండటం; ఆయన మనలను ఎక్కడ ఉంచితే అక్కడే సంతృప్తిగా ఉండటం. ఈ స్వరూపానికి విరుద్ధమైన బాధలు, సందేహాలు కలిగినప్పుడు తిరుమంత్రములోని పదాలైన ప్రణవం, నమః, నారాయణాయ అనే వాటి అర్థాలను మననం చేయాలి. అలా చేయడం ద్వారా సందేహాలను తొలగించుకొని తిరిగి మన స్వరూప స్థితిని పొందవచ్చు.
ఇది సంక్షిప్తమైన పరిచయం. ఇకపై తిరుమంత్రములోని అంశాలను, వాటి అర్థాలను వివరంగా పరిశీలిద్దాం.
భాగం 2-మొదటి అంశం
ఎఙ్గనేయెన్నిల్
ఎలా పరిహరించుకొంటాడని ప్రశ్నిస్తే,
బహువిరోధి బీజమాన స్వాతన్త్ర్యమ్ మేలిట్టాల్
బహువిరోధి అంటే అనేక ఆటంకాలు; బీజం అంటే విత్తనం; స్వాతంత్ర్యం అంటే స్వతంత్ర భావం; అహంకారం అంటే తానే కర్తనని భావించే గర్వం.
“నేనే నా యజమానిని, నేను స్వతంత్రుడను, నాకు ఎవరూ యజమాని లేరు” అనే భావన అనేక ఆటంకాలకు మూలమైన స్వాతంత్ర్య భ్రమను ఎలా తొలగించుకోవాలి?
తిరుమంత్రము మూడు పదాలతో కూడి ఉంటుంది-ప్రణవం, నమః, నారాయణాయ. ప్రణవం అ, ఉ, మ అనే మూడు అక్షరాలతో ఏర్పడుతుంది. ఈ మూడింటి అర్థాలను విడివిడిగా గ్రహించడం ద్వారా మనలోని అపోహలను తొలగించుకోవచ్చు.
భగవథ్ పరతన్త్రర్ అల్లోమో, నమక్కు స్వాతన్త్ర్యమ్ కడవదో? ఎన్ఱు అకారార్థత్తై అనుసన్ధిత్తు మీళువాన్;
ప్రణవంలో అకారం మొదటి అక్షరం. ఇది ఒక్క అక్షరమే అయినప్పటికీ, సంపూర్ణమైన అర్థాన్ని కలిగి ఉండటం వలన శాస్త్రాలు దీనిని ఒక పదంగా పేర్కొంటాయి.
శాస్త్రం “అకారార్థో విష్ణుః” అని తెలియజేస్తుంది. అకారం అనే పదం సమస్తులకు నాయకుడైన భగవాన్ విష్ణువును సూచిస్తుంది.
అకారంలోని అర్థం, శ్రీమన్నారాయణుడు మాత్రమే స్వతంత్రుడు; మనమందరమూ ఆయనకు అధీనులము.
ఈ అకారార్థాన్ని మననం చేస్తూ, “మనం భగవానునికి అధీనులము కాదా? అలాంటప్పుడు మనకు స్వాతంత్ర్యం ఎలా ఉంటుంది? మనం మనకే స్వంతమని ఎలా భావించగలం?” అని ఆలోచించాలి. తద్వారా, స్వాతంత్ర్యమనే మొదటి అపోహ నుండి బయటపడగలడు.
భాగం 3-రెండవ అంశం
అసేవ్య సేవైగళ్ వన్దు మేలిట్టాల్
అసేవ్య సేవైగళ్ అంటే సేవించడానికి తగనివారికి సేవ చేయడం.
సేవించడానికి తగనివారికి సేవ చేయవచ్చా అనే సందేహం కలిగినప్పుడు,
అసేవ్య సేవైగళ్ వన్దు మేలిట్టాల్, నామ్ అన్యరుక్కు శేషమో భగవద్ అనన్యార్హ శేషభూతర్ అల్లోమో? ఎన్ఱు ఉకార అర్థత్తై అనుసన్ధిత్తు మీళువాన్.
అకారం ద్వారా మనం భగవానునికి అధీనులమని తెలుసుకున్నాము. అయితే మనం ఇతరులకు అధీనులము కాదు అనే విషయాన్ని ఏది తెలియజేస్తుంది?
ఉకారం అనేది ‘ఏవ’ అనే నిషేధార్థక అవధారణను సూచిస్తుంది. అంటే భగవానునికి మాత్రమే మనం అధీనులము; మరెవరికీ కాదు. కాబట్టి, “మనం ఇతరులకు కూడా అధీనులమా?” అనే సందేహం కలిగినప్పుడు ఉకారార్థాన్ని మననం చేయాలి. “మనం భగవానునికి మాత్రమే సేవ చేసేవారము” అనే విషయాన్ని గ్రహించి, ఇతరులకు సేవ చేయడం మానాలి. ఈ విధంగా భగవానునికి, ఆయన భక్తులకు మాత్రమే సేవ చేయాలనే స్థితిలో స్థిరంగా ఉండగలుగుతాము.
భాగం 4-మూడవ అంశం
శరీరత్తిలే కార్శ్యస్థూలాదికళ్ మేలిట్టాల్ నామ్ జ్ఞానానానన్ద స్వరూపర్ అల్లోమో, నిత్యర్ అల్లోమో, ఏకరూపర్ అల్లోమో, నామ్ స్వయమ్ ప్రకాశమన్ఱో? ఎన్ఱు మకార అర్థత్తై అనుసన్ధిత్తు మీళువాన్.
తిరుమంత్రములోని మొదటి పదమైన ప్రణవం అకారం, ఉకారం, మకారం అనే మూడు అక్షరాలతో ఏర్పడింది.
అకారాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం స్వతంత్రులము కాదు అనే విషయాన్ని తెలుసుకుంటాము. ఉకారాన్ని అర్థం చేసుకోవడం ద్వారా భగవానునికి, ఆయన భక్తులకు మాత్రమే సేవ చేయాలని తెలుసుకుంటాము. మకారం జీవాత్మకు జ్ఞానం కలదని, అది శరీరానికి భిన్నమైనదని తెలియజేస్తుంది.
కార్శ్య స్థూలాదులు అంటే శరీరానికి సంబంధించిన రూపభేదాలు, మార్పులు.
మన శరీరాన్ని అందమైనదని, అందవిహీనమైనదని, లావుగా ఉందని, సన్నగా ఉందని భావిస్తూ దాని గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే మనం శరీరము కాము. మనల్ని మనం శరీరంగా భావించినప్పుడే ఇటువంటి అనవసరమైన ఆలోచనలు కలుగుతాయి.
మకారం జీవాత్మను సూచిస్తుంది. జీవాత్మ సహజంగా జ్ఞానానంద స్వరూపమని తెలియజేస్తుంది. ఆత్మ శరీరాన్ని విడిచినప్పుడు, శరీరానికి జ్ఞానం గానీ ఆనందం గానీ లేవని స్పష్టమవుతుంది. అందువల్ల జ్ఞానం జీవాత్మకు మాత్రమే ఉంటుంది. మకారార్థాన్ని గ్రహించడం ద్వారా జ్ఞానం, ఆనందం జీవాత్మ యొక్క సహజ స్వరూపాలని తెలుసుకుంటాము.
నిత్యర్ అల్లామో అంటే జీవాత్మ నిత్యమైనది; శరీరం అనిత్యమైనది. ఏకరూపం అంటే మార్పులేనిది, స్థిరమైనది.
శరీరం వ్యాధులకు గురవుతుంది. జ్వరం, జలుబు వంటి బాధలు కలుగుతాయి. శరీర పరిమాణంలో కూడా మార్పులు వస్తాయి. శరీరం స్థిరమైనది కాదు. అయితే జీవాత్మ ఏకరూపమైనది. దాని స్వరూపంలో ఎటువంటి మార్పు ఉండదు. అది ఎల్లప్పుడూ జ్ఞానానందాలతో కూడి ఉంటుంది.
స్వయం ప్రకాశమన్ఱో అంటే జీవాత్మ స్వయం ప్రకాశమైనది.
నిరంతరం మనలో ఉండే “నేను” అనే భావన ద్వారా మన ఉనికిని మనమే తెలుసుకుంటాము. మనం ఉన్నామని మరొకరు వచ్చి తెలియజేయవలసిన అవసరం లేదు. అందువల్ల జీవాత్మ స్వయం ప్రకాశమైనది.
అయితే శరీరం స్వయం ప్రకాశమైనది కాదు. శరీరం తన ఉనికిని తాను తెలుసుకోలేదు. మనమే దానిని తెలుసుకుంటాము. ఇతరులు కూడా వెలుగు ఉన్నప్పుడు దానిని చూడగలుగుతారు.
కాబట్టి శరీరాన్ని పరిశీలించినప్పుడు అది జీవాత్మకు భిన్నమైనదని స్పష్టంగా తెలుస్తుంది. మకారార్థాన్ని మనసులో స్థిరపరచుకున్నప్పుడు శరీరానికి, ఆత్మకు మధ్య ఉన్న భేదం స్పష్టమవుతుంది. శరీరంలో వచ్చే మార్పుల వలన మనం కలత చెందము, గందరగోళానికి గురికాము.
సంక్షిప్తంగా చెప్పాలంటే, ప్రణవం ద్వారా జీవాత్మ స్వతంత్రుడు కాదని, భగవానునికి మరియు ఆయన భక్తులకు అధీనుడని, తాను శరీరం కాదని, శరీరానికి పూర్తిగా భిన్నమైనవాడని తెలుస్తుంది.
భాగం 5-నాలుగవ అంశం
నమక్కు ఒరుపురుషార్థమ్ సమ్పాదిక్క వేణ్డావో? ఎన్ఱు సాధనానుష్తానమ్ పణ్ణత్తేడినాల్
సాధనానుష్ఠానం అంటే ఒక ఫలితాన్ని సాధించడానికి ఏదైనా కార్యాన్ని ఆచరించడం. పురుషార్థం అంటే పొందదగిన లక్ష్యం.
జీవాత్మకు జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం కారణంగా తన లక్ష్యాలను సాధించడానికి ఏదైనా కార్యాన్ని చేయాలనే కోరిక కలుగుతుంది. ఈ కోరికలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తే దాని ఫలితం ఏమిటి?
స్వరక్షణత్తిల్ ప్రాప్తియిల్లాద భగవత్ పరతన్త్రర్ అల్లోమో, స్వతన్త్రన్ అన్ఱో రక్షణత్తుక్కు క్కడవన్ ఎన్ఱు నమస్సినర్థత్తై అనుసన్ధిత్తు మీళువాన్.
స్వరక్షణం అంటే తనను తాను రక్షించుకోవడం. ప్రాప్తి అంటే అర్హత లేదా సాధించగలగడం. భగవత్ పరతంత్రులు అంటే పూర్తిగా భగవానునిపై ఆధారపడినవారు.
నమః పదానికి “నాది కాదు” అని అర్థం. అంటే, “నేను భగవానునికి మాత్రమే చెందినవాడను.”
మన ఉనికి పూర్తిగా భగవానుని కోసమే కాబట్టి ఆయనే మనలను రక్షించేవాడు. అందువల్ల మనలను మనమే రక్షించుకోవడానికి మనకు ఎటువంటి అర్హతా, అధికారమూ లేవు.
భగవానునికి అధీనులమై ఉన్న మనం పూర్తిగా ఆయనపై ఆధారపడినవారమని దీని ద్వారా స్పష్టమవుతుంది. స్వతంత్రుడైన భగవానుడే మనలను రక్షించే బాధ్యతను కలిగి ఉంటాడు.
నమః పదం అర్థం ఈ విషయాన్ని తెలియజేస్తుంది. భగవానుడు మాత్రమే స్వతంత్రుడు; మనం ఆయనపై ఆధారపడినవారము. ఆయన మాత్రమే మనలను రక్షించాలి. అందువల్ల మన స్వంత ప్రయత్నాల ద్వారా మన లక్ష్యాన్ని సాధించడానికి మనకు అర్హత లేదని ఈ పదం తెలియజేస్తుంది.
కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం, భగవన్నామ సంకీర్తనం చేయడం, దివ్యదేశాలలో నివసించడం, పూలమాలలు తయారుచేయడం మొదలైనవన్నీ ఏదో ఒక లక్ష్యాన్ని సాధించడానికి చేసే కార్యాలుగా పరిగణించబడతాయి.
జీవాత్మ సహజంగానే భగవానునిపై ఆధారపడినది. కాబట్టి భగవానుని పొందడానికి సాధనాలుగా వీటిని ఆచరించడం జీవాత్మ స్వరూపానికి తగదు. వీటన్నింటినీ కైంకర్యంగా చేయాలి.
“నా ప్రయత్నం ద్వారా నేను భగవానుని పొందబోతున్నాను” అని భావించిన క్షణమే, అది భగవానునికి అధీనులమనే మన నిజమైన స్వరూపానికి విరుద్ధమవుతుంది.
భగవానునిపై ఆధారపడినవారమైన మనం స్వంత ప్రయత్నాల ద్వారా మన లక్ష్యాన్ని సాధించలేము. ఈ అసాధ్యతను నమః పదం తెలియజేస్తుంది.
నమః పదం యొక్క అర్థాన్ని నిరంతరం మననం చేస్తే, ఇతర స్వప్రయత్నాలలో నిమగ్నమవ్వాలనే ఆసక్తి తొలగిపోతుంది. దానికి బదులుగా మనం ఎల్లప్పుడూ భగవానుని అనుగ్రహం మీదనే దృష్టి పెడతాము.
అయితే దీని అర్థం మనం ఎటువంటి కార్యాలూ చేయకుండా ఉండాలని కాదు. అన్ని కార్యాలనూ చేస్తాము. కానీ వాటన్నింటినీ కైంకర్యంగానే చేయాలి. మన కార్యాల కారణంగా భగవానుడు మనకు ఫలితాలను ప్రసాదిస్తున్నాడనే భావన ఉండకూడదు.
ఈ విషయాలన్నీ నమః పదం ద్వారా తెలుసుకోవాలి.
భాగం 6-ఐదవ అంశం
తరువాత నారాయణాయ పదాన్ని వివరిస్తున్నారు. నారాయణుడు అంటే పెరుమాళ్. పెరుమాళ్ వివిధ స్థితులలో అర్చావతారం అత్యంత ముఖ్యమైనది.
సమస్త జీవరాశులను రక్షించాలనే సంకల్పంతో పెరుమాళ్ మన ఇళ్లలో, మఠాలలో, దేవాలయాలలో, దివ్యదేశాలలో, అభిమానం కలిగిన క్షేత్రాలలో, వివిధ గ్రామ దేవాలయాలలో కొలువై ఉంటాడు. ఈ దివ్యమైన స్థితిని ఇక్కడ వివరిస్తున్నారు.
తనక్కు ఉపకారమాగ ఎళున్దరుళియిరుక్కిఱ అర్చావతారత్తిలే
ప్రస్తుతం మన స్థితిలో పరమపదం మనకు ఎంతో దూరంగా ఉండటం వలన అక్కడి పెరుమాళ్‌ను అనుభవించలేము. పాలసముద్రంలో ఉన్న వ్యూహస్థితిలోని పెరుమాళ్‌ను కూడా అనుభవించలేము.
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి విభవావతారాలను కూడా ఇప్పుడు అనుభవించలేము. ఎందుకంటే ఆ అవతార కాలాలు గతించిపోయాయి. మనలో అంతర్యామిగా ఉన్న పెరుమాళ్‌ను అనుభవించడానికి అవసరమైన యోగదృష్టి కూడా మనకు లేదు.
ఈ నాలుగు స్థితులలో పెరుమాళ్‌ను అనుభవించలేని మనకు అర్చావతారమే నిజంగా ఆయనను అనుభవించగలిగే స్థితి.
పర, వ్యూహ, విభవ, అంతర్యామి స్థితులలో ఉన్న పెరుమాళ్‌ను మనం సులభంగా చేరుకోలేకపోయినా, అర్చావతారంలో ఆయన మనకు అందుబాటులో ఉంటాడు. జీవాత్మల ప్రయోజనం కోసమే ఆయన అర్చావతారంగా వెలసి ఉంటాడు.
శిలకుఱై వన్దు పిఱన్దు కణ్ణుక్కు విషయమానాల్
అర్చావతార స్వరూపంలోని పదార్థాన్ని లేదా దాని గుణాన్ని విశ్లేషించడం తల్లి నడవడికను విశ్లేషించడంతో సమానమని శాస్త్రం తెలియజేస్తుంది. పిళ్ళై లోకాచార్యులు శ్రీవచనభూషణంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు.
అయినప్పటికీ, ఎవరైనా పెరుమాళ్ తిరుమేనిని బంగారంతోనో, పంచలోహంతోనో, వెండితోనో తయారుచేశారని పరిశీలించి, ఆ పదార్థాన్ని బట్టి అది ఉత్తమమైనదని లేదా అధమమైనదని నిర్ణయిస్తే అది గొప్ప అపచారం.
అదేవిధంగా పెరుమాళ్ తిరుమేనిలో ఏదైనా లోపం కనిపించినప్పుడు దానిని దోషంగా భావించడం కూడా గొప్ప అపచారం.
ఉదాహరణకు, పురుషోత్తమ ధామమైన జగన్నాథపురిలో పెరుమాళ్ తన దివ్యసంకల్పంతో అంగీకరించిన తిరుమేనిలో ఏదైనా భిన్నత్వం కనిపించినా, దానిని లోపంగా భావించకూడదు.
ఇటువంటి లోపాలను పరిశీలిస్తూ వాటి గురించే ఆలోచించే వ్యక్తి యొక్క స్థితి ఏమిటి? దానిని తరువాత వివరిస్తున్నారు.
చేతననుడైయ ఇళవుక్కు ఈశ్వరన్
చేతనుడిని కోల్పోయినందుకు ఈశ్వరుడు దుఃఖిస్తాడు.
“ఈ చేతనుడు అనాదికాలం నుండి ఈ సంసారంలో పడి బాధపడుతున్నాడు. ఇతనికి మనం ఏమి చేయబోతున్నాము?” అని ఆలోచిస్తూ భగవానుడు దుఃఖిస్తాడు.
భృశం భవతి దుఃఖిత నామా పోలే
శ్రీరామాయణం అయోధ్యాకాండం 2.42లోని ఈ శ్లోకం,
“వ్యసనేషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖితః”
ప్రజలు ఏవైనా కష్టాలకు, ఆపదలకు గురైనప్పుడు శ్రీరాముడు ఎంతో తీవ్రంగా దుఃఖిస్తాడని తెలియజేస్తుంది.
ఈ విషయం రామావతారంలో చెప్పబడినప్పటికీ, ఇది భగవానుని సహజ స్వభావమని అర్థం చేసుకోవాలి.
ఒక జీవాత్మకు ఏదైనా మంచి జరిగినప్పుడు మొట్టమొదట సంతోషించేవాడు భగవానుడే. అదే విధంగా వారి బాధల విషయంలో ఇతరులకన్నా ఎక్కువగా దుఃఖించేవాడు కూడా ఆయనే.
సుగ్రీవ మహారాజు వాలిని కోల్పోయినప్పుడు, విభీషణాళ్వాన్ రావణుడిని కోల్పోయినప్పుడు పెరుమాళ్ ఎంతో దుఃఖించాడు.
అదేవిధంగా జీవాత్మకు ఏదైనా లోపం లేదా బాధ కలిగినప్పుడు, ఇంతటి మృదుస్వభావం కలిగిన భగవానుడు మనకోసం దుఃఖిస్తాడు.
ఈశ్వరనుడైయ ఇళవుక్కు దుఃఖితనా ఆగాదపోదు
భగవానుడు మనకోసం దుఃఖించినట్లే, మనం కూడా “అయ్యో! ఇటువంటి లోపం నాలో ఎలా కలిగింది?” అని బాధపడాలి.
నారాయణ పదం అర్థాన్ని మనం గ్రహించలేకపోయామని పశ్చాత్తాపపడాలి. ఆ పదం అర్థాన్ని మననం చేసి, దానిపై ఆలోచించాలి.
పర వ్యూహ విభవాది కళెఙ్గు ముళ్ళ కుఱైగళ్ తీర్ న్ద విడమన్ఱో;
పర, వ్యూహ, విభవ, అంతర్యామి స్థితులలో ఉన్న పరిమితులన్నింటినీ అధిగమించిన స్థితి అర్చావతారం కాదా?
అంటే దూరం, కాలం, అందుబాటులో ఉండటం వంటి పరిమితులు అర్చావతారంలో ఉండవు.
ఒన్ఱాలొరు కుఱైవత్త విడమన్ఱో
ఈ అర్చా తిరుమేని ఏ విధమైన లోపమూ లేని దివ్యస్వరూపమే కదా!
అనుభావ్యమెల్లామ్ నారశబ్దాన్తర్గత మన్ఱోవెన్ఱు నారాయణ పదత్తై అనుసన్ధిత్తు మీళువాన్;
అనుభవించదగినవన్నీ నార పదంలోనే అంతర్భూతమై ఉన్నాయి.
ముముక్షుప్పడిలో దీనిని వివరిస్తూ, నిత్యవిభూతి, లీలావిభూతి, పెరుమాళ్ తిరుక్కల్యాణ గుణాలు, పిరాట్టిమార్లు, నిత్యులు, ముక్తులు మొదలైన నాశనం లేని సమస్త తత్త్వాలు నార పదంలో ఇమిడి ఉన్నాయని తెలియజేస్తారు.
అర్చావతారంలో పెరుమాళ్ శుభగుణాలైన సౌలభ్యం, సౌశీల్యం, వాత్సల్యం, స్వామిత్వం అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
* పిళ్ళై లోకాచార్యులు ముముక్షుప్పడిసూత్రం142లో ఇలా తెలియజేస్తున్నారు:
“కవిత్తముడియుం, ముఖముం ముఱువలుం, ఆసనపద్మత్తిలే అళుత్తిన తిరువడిగళుమాయ్ నిర్కిఱ నిలైయే నమక్కు తంజం.”
అంటే, తలపై అందంగా అలంకరించబడిన కిరీటం, మనోహరమైన ముఖం, ఆకర్షణీయమైన చిరునవ్వు, పద్మాసనంపై స్థిరంగా ఉంచబడిన దివ్యపాదాలు-ఇవన్నీ కలిసిన ఆయన దివ్యమైన స్థితియే మనకు ఏకైక శరణు.
ఈ లక్షణాలన్నింటినీ మనం నమ్పెరుమాళ్‌ను దర్శించినప్పుడు అనుభవించవచ్చు.
అనుభవించదగిన సమస్త శుభగుణాలూ అర్చావతారంలోనే ఉన్నాయని గుర్తుచేసుకుంటే, బయటికి కనిపించే లోపాల గురించి ఆలోచించకుండా, అర్చావతారంలో దోషాలను చూడకుండా ఉండగలుగుతాము.
ఈ విధంగా నారాయణ పదం అర్థాన్ని మననం చేస్తాడు.
భాగం 7-ఆరవ అంశం
చివరిగా, ఇతరులకు సేవ చేయడం, ఇతరుల మధ్య దివ్యమైన విషయాలను అనుభవించడం గురించి వివరిస్తున్నారు.
స్వరూపత్తోడు శేరాద ఇతర పరిమాత్తఙ్గళ్ మేలిట్టాల్
జీవాత్మ స్వరూపానికి తగిన వ్యవహారాలు, భగవానునికి అధీనులుగా ఉండటం, ఆయనకు కైంకర్యం చేయడం, ఆయన భక్తులపై ప్రేమ కలిగి ఉండటం, వారికి సేవ చేయడం.
ఇటువంటి వ్యవహారాలకు భిన్నమైన ఇతర వ్యవహారాలు మనలను ఆవరించినప్పుడు ఏమి చేయాలి?
స్వరూపానురూపమాన వృత్తి కైఙ్కర్యమన్ఱో ఎన్ఱు
మన స్వరూపానికి సహజంగా సరిపోయే కార్యాలు భగవానునికి, భాగవతులకు కైంకర్యం చేయడం మాత్రమేనని గ్రహించాలి.
ఎన్ఱు చతుర్థియినర్తత్తై అనుసన్ధిత్తు మీళువాన్;
ఈ అర్థం నారాయణాయ పదంలోని ఆయ భాగం ద్వారా వెల్లడవుతుంది.
ఆయ అక్షరసముదాయం చతుర్థీ విభక్తిని సూచిస్తుంది. దాని అర్థం “నారాయణుని కొరకు” అని.
ఈ విషయాన్ని గ్రహించడం ద్వారా మనం శ్రీమన్నారాయణునికి మాత్రమే సేవ చేయడంలో స్థిరపడతాము.
ఆయ పదం అర్థాన్ని తెలుసుకొని, ఇతరులకు సేవ చేయడం లేదా మన నిజమైన స్వరూపానికి సరిపోని లౌకిక వ్యవహారాలలో పాల్గొనడం నుండి వెనుదిరుగుతాము.
ఆరు రకాల ఆటంకాలను, వాటి వలన కలిగే సందేహాలను తొలగించే తిరుమంత్రంలోని పదాల అర్థాలను వివరించారు.
భాగం 8-ముగింపు
ఇప్పడి పరిహరిత్తు క్కొళ్ళాతపోతు పిఱరుక్కు ఉపదేశిక్కిఱదుక్కుమ్, ఇదిల్ తనక్కు పిఱన్ద జ్ఞానత్తుక్కుమ్ ఎన్న ప్రయోజనమ్ ఉణ్డు? ఎన్ఱు అనుసన్ధిప్పాన్.
తిరుమంత్రంలోని పదాల అర్థాలను ఉపయోగించి ఈ దోషాలను, సందేహాలను తొలగించుకోకపోతే, తనలో కలిగిన జ్ఞానానికి గానీ, ఇతరులకు ఉపదేశించడం వలన గానీ ఎటువంటి ప్రయోజనమూ ఉండదు.
మనలో సందేహాలు కలిగినప్పుడు ఈ పవిత్రమైన పదాల అర్థాల ద్వారా వాటిని పరిష్కరించుకోవాలి.
ఉదాహరణకు, ఎవరైనా మనలను ఏదైనా లౌకిక కార్యంలో పాల్గొనమని ఆహ్వానించినప్పుడు, ఆయ అక్షరం పెరుమాళ్‌కు మాత్రమే సేవ చేయడాన్ని సూచిస్తుందని వెంటనే గుర్తుచేసుకోవాలి.
ఆ కార్యం మన స్వరూపానికి తగినది కాదని తెలుసుకొని అటువంటి ఆహ్వానాన్ని తిరస్కరించాలి. సాధ్యమైతే వారిని ఆధ్యాత్మిక విషయాల వైపు ఆహ్వానించవచ్చు.
దానికి బదులుగా మనం కూడా వారితో కలిసి లౌకిక వ్యవహారాలలో పాల్గొంటే, ఈ జ్ఞానాన్ని కలిగి ఉండటం వలన గానీ, ఇతరులకు ఉపదేశించడం వలన గానీ ఎటువంటి ఆచరణాత్మక ప్రయోజనమూ ఉండదు.
భాగం-9
మనలో కలిగే సందేహాలను, అపోహలను పరిష్కరించుకోకపోతే, జ్ఞానాన్ని సంపాదించడం, దానిని ఇతరులకు వివరించడం వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండదు.
చివరిగా, ఈ విషయాన్ని సంక్షిప్తంగా వివరిస్తున్నారు.
ఒకే విషయాన్ని వేరే పదాలతో మరొకసారి వివరిస్తున్నారు. మన పూర్వాచార్యులు మొదట ఒక విషయాన్ని విపులంగా వివరించి, తరువాత దానిని సంక్షిప్తంగా తెలియజేస్తారు. దీని ద్వారా మనం విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నామో లేదో పరిశీలించుకొని, సంపూర్ణమైన స్పష్టతను పొందగలుగుతాము.
వారికి విషయంపై స్పష్టత లేకపోవడం వలన పదేపదే వివరించడం లేదు. ఆ విషయంపై వారికి సంపూర్ణమైన అవగాహన, స్థిరత్వం ఉండటం వలన, మనం కూడా దానిని ఆచరణలో పెట్టగలిగే విధంగా గ్రహించాలని అలా వివరిస్తున్నారు.
స్వపౌరుషత్తాలే తన్ కార్యమ్ తాన్ నిర్వహిప్పదాగ నినైత్తానాగిల్
తన అహంకారం, స్వాతంత్ర్య భావం కారణంగా తన పనులను తానే స్వంత ప్రయత్నాలతో నిర్వహించుకుంటున్నానని ఎవరైనా భావిస్తే,
అకారార్థత్తై అనుసన్ధిత్తు మీళువాన్
భగవానుడు మాత్రమే స్వతంత్రుడు. మనమందరమూ పూర్తిగా ఆయనపై ఆధారపడినవారము. ఇదే అ అక్షరం తెలియజేసే అర్థం.
కాబట్టి మన పనులను మనమే నిర్వహించుకుంటున్నామనే భావనకు స్థానం లేదు. మనలను రక్షించే బాధ్యత పూర్తిగా పెరుమాళ్‌దే. మన స్వరక్షణ కోసం మనం ఎటువంటి కార్యమూ చేయకూడదు.
మనం చేసే కార్యాలు మన నిజమైన స్వరూపాన్ని నిలుపుకోవడం కోసమే తప్ప, మనలను మనం రక్షించుకోవడం కోసం కావు.
ఒక నిజమైన కైంకర్యపరుడు ఒక నిర్దిష్టమైన పద్ధతిలో తన జీవితాన్ని గడపాలి. కాలక్షేపాలను వినడం, పాశురాలను పారాయణం చేయడం, కైంకర్యాలు చేయడం వంటి కార్యాలను అందుకే ఆచరిస్తాము. మనలను మనం రక్షించుకోవడానికి వీటిని సాధనాలుగా ఆచరించడం లేదు.
అందువల్ల, ఎవరైనా తన స్వంత ప్రయత్నాల ద్వారా తన పనులను తానే నిర్వహించుకుంటున్నానని భావిస్తే, అకారార్థాన్ని తెలుసుకోవడం ద్వారా ఆ భావన నుండి వెనుదిరుగుతాడు. భగవాన్ విష్ణువే సమస్తానికి పరమాధికారి, నియామకుడు విషయాన్ని గ్రహిస్తాడు.
అన్యరై రక్షకనాక నినైత్తానాగిల్, ఉకార అర్థత్తై అనుసన్ధిత్తు మీళువాన్;
అన్యులు అంటే ఇతర దేవతలు, బంధువులు, తల్లిదండ్రులు, చివరకు తాను కూడా.
వీరిలో ఎవరినైనా రక్షకులుగా భావిస్తే, ఉకారార్థాన్ని మననం చేసి ఆ భావన వదలాలి.
ఉకారం అక్షరం భగవానునికి మాత్రమే అని తెలియజేస్తుంది. ఈ ప్రత్యేకమైన పరతంత్ర భావాన్ని మననం చేయడం ద్వారా ఇతరులను రక్షకులుగా భావించడం నుండి వెనుదిరుగుతాము.
భాగం 10
సాధనత్తిల్ తనక్కు అన్వయమ్ ఉణ్డు ఎన్ఱుమ్, శ్రీవైశ్ణవ సమబుధ్దియుమ్ పణ్ణినానాగిల్, నమశ్శబ్ద అర్థత్తై అనుసన్ధిత్తు మీళువాన్; ఈశ్వర విభూతిభూతరోడే తనక్కు రాగద్వేషమ్ నడైయాడిత్తాకిల్, నారశబ్ద అర్థత్తై అనుసన్ధిత్తు మీళువాన్;
తాను కర్మయోగం, జ్ఞానయోగం లేదా భక్తియోగం ఆచరించడానికి అర్హుడనని భావించి, ఆ సాధనాల ద్వారా భగవానుని పొందగలనని అనుకోవడం ఒక దోషం.
అదేవిధంగా ఇతర శ్రీవైష్ణవులతో తనను సమానంగా భావించడం కూడా తప్పు.
“వారు కూడా నాలాగే కనిపిస్తున్నారు, నాలాగే కైంకర్యాలు చేస్తున్నారు” అని భావించడం తగదు.
శ్రీవైష్ణవులందరినీ చూసినప్పుడు వారిని ఎల్లప్పుడూ తనకంటే ఉన్నతులుగా భావించాలి.
ఎవరైనా ఇతర సాధనాలను ఆశ్రయించినా, లేదా శ్రీవైష్ణవులను తనతో సమానులుగా భావించినా, నమః అర్థానుసంధానం ద్వారా ఆ భావన నుండి బయటపడాలి.
నమః పదానికి “నేను నావాడను కాను; నేను భగవానునికి మాత్రమే చెందినవాడను” అని అర్థం.
భగవానునికి అధీనులుగా ఉండటం మొదటి స్థితి. ఆయన భక్తులకు అధీనులుగా ఉండటం అంతిమ స్థితి.
నమః పదం అర్థాన్ని గ్రహించిన తరువాత ఎవరూ శ్రీవైష్ణవులను తనతో సమానులుగా భావించరు. దానికి బదులుగా ప్రతి శ్రీవైష్ణవుడినీ తనకంటే ఉన్నతుడిగా భావిస్తారు. ఈ భావన వలన వారికి సేవ చేయాలనే మనస్సు కలుగుతుంది.
అంతేకాకుండా, నమః పదాన్ని ఒకే పదంగా పరిశీలించినప్పుడు అది శరణాగతిని సూచిస్తుంది.
దీని ద్వారా శరణాగతియే మనకు ఉపాయమని, మనకు మరే ఇతర ఉపాయమూ లేదని సంపూర్ణమైన స్పష్టత కలుగుతుంది.
అందువల్ల ఇతర ఉపాయాలను ఆశ్రయించాలనే ఆలోచన కలిగినా, శ్రీవైష్ణవులను తనతో సమానులుగా భావించినా, నమః పదం అర్థాన్ని తెలుసుకుని ఆ దోషాలను పూర్తిగా తొలగించుకోవచ్చు. తద్వారా మన ప్రవర్తనను సరిదిద్దుకోగలుగుతాము.
ఈశ్వర విభూతిభూతరోడే తనక్కు రాగద్వేషమ్ నడైయాడిత్తాకిల్, నారశబ్ద అర్థత్తై అనుసన్ధిత్తు మీళువాన్;
నార పదం నిత్యమైన తత్త్వాల సమూహాన్ని సూచిస్తుంది.
ర అక్షరం నశించిపోయే వాటిని సూచిస్తుంది. నర పదం నాశనం లేని వాటిని సూచిస్తుంది. నార పదం నాశనం లేని తత్త్వాల సమూహాన్ని సూచిస్తుంది. నారాః పదం అటువంటి సమూహాల విస్తృత సముదాయాన్ని సూచిస్తుంది.
నారాయణాయ పదంలో ఇంతటి గొప్ప అర్థం ఇమిడి ఉంది.
నార పదాన్ని మననం చేసినప్పుడు సమస్తమూ భగవానుని ఆస్తి, ఆయనకు చెందిన దివ్యమైన విభూతి అని అర్థమవుతుంది.
సముద్రాలు, అడవులు, మట్టి, బద్ధజీవులు, ముక్తులు, నిత్యులు, దివ్యపత్నులు-ఇవన్నీ పెరుమాళ్‌కు మాత్రమే చెందినవి.
సమస్తమూ పెరుమాళ్‌కు చెందినవే కాబట్టి, ఒక జీవి మరొక జీవి పట్ల రాగద్వేషాలను కలిగి ఉండకూడదు.
రాగం అంటే అనురాగం లేదా ఇష్టం. ద్వేషం అంటే అయిష్టం లేదా అసహ్యం.
ఉదాహరణకు, ఒకే తండ్రికి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు వారిద్దరూ ఆయనకు చెందినవారే. కాబట్టి వారిద్దరి మధ్య ద్వేషానికి స్థానం లేదు.
అదేవిధంగా ఈ సమస్త విశ్వం భగవానునికి చెందినదని గుర్తించినప్పుడు, ఒకరిని ఇష్టపడటం, మరొకరిని ద్వేషించడం భావనలకు స్థానం ఉండదు.
ఒక వస్తువు లేదా జీవి మరొకదానికి భిన్నంగా, స్వతంత్రంగా ఉన్నప్పుడే వాటి పట్ల రాగద్వేషాలు కలుగుతాయి.
అయితే సమస్తమూ పూర్తిగా భగవానునికి చెందినప్పుడు, ఒకరి పట్ల పక్షపాతం చూపించి మరొకరి పట్ల ద్వేషం కలిగి ఉండలేము.
నార పదాన్ని తెలుసుకుని ఇష్టాయిష్టాలనే వాటి పైగల తప్పుడు భావనను విడిచిపెట్టవచ్చు.
సమస్తమూ భగవానుని పరిధిలోనే ఉన్నాయి. అవన్నీ ఆయనకు చెందినవిగా భావించి ఆదరించాలి.
నార పదం నిజమైన అర్థాన్ని గ్రహించడం ద్వారా ఈ గందరగోళాన్ని పూర్తిగా పరిష్కరించుకోవచ్చు.
భాగం-11
ఔపాధిక బన్ధుక్కల్ పక్కలిలే బన్ధుతా ప్రతిపత్తి పణ్ణినానాగిల్, అయనశబ్ద అర్థత్తై అనుసన్ధిత్తు మీళువాన్;
నారాయణాయ పదాన్ని నార + అయన = నారాయణ అని విభజించవచ్చు.
నార పదం నాశనం లేని సమస్త తత్త్వాలనూ భగవానునికి చెందినవిగా సూచిస్తుంది.
అయన పదం సమస్త తత్త్వాలకు ఆధారస్థానమైన భగవానుని సూచిస్తుంది. అంతేకాకుండా ఆయన సమస్తంలోనూ అంతర్యామిగా నివసిస్తున్నాడని తెలియజేస్తుంది.
ఔపాధిక బంధువులు అంటే తాత్కాలిక సంబంధాల ద్వారా ఏర్పడిన బంధువులు. తల్లిదండ్రులు, సోదరులు, ఇతర బంధువులు ఈ కోవకు చెందుతారు.
ఈ జన్మలో కర్మ కారణంగా ఏర్పడిన ఈ సంబంధాలు తాత్కాలికమైనవి. తరువాతి జన్మలో ఇవి పూర్తిగా మారిపోతాయి.
కేవలం శరీర సంబంధం ద్వారా ఏర్పడిన బంధువుల నుండి నిజమైన, శాశ్వతమైన బంధుత్వాన్ని ఆశించడం వలన గందరగోళం కలుగుతుంది.
మనం భగవత్ విషయాలలో నిమగ్నమవ్వాలని ప్రయత్నిస్తున్నప్పుడు, వారు మనలను లౌకిక విషయాల వైపు ఆకర్షిస్తే, అది ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకం కలిగిస్తుంది.
ఎవరైనా ఇటువంటి తాత్కాలిక బంధువుల పట్ల నిజమైన బంధుత్వ భావనను కలిగి ఉంటే, అయన అర్థానుసంధానం ద్వారా ఆ భావన వీడాలి.
మనకు నిజమైన, శాశ్వతమైన బంధువు భగవానుడు మాత్రమే. ఆయనే మనకు ఆధారంగా ఉండి, మనలను పోషించి, నిలబెడుతున్నాడు.
ఈ విషయాన్ని గుర్తించడం ద్వారా లౌకిక బంధాల పట్ల ఉన్న అనుబంధం నుండి వెనుదిరిగి, మన నిజమైన ఆధ్యాత్మిక స్వరూపానికి అనుగుణంగా ఉండగలుగుతాము.
పుత్ర పశ్వన్నాది తొడక్కమాగ స్వర్గ ఐష్వర్యమ్ నడువాగ కైవల్యమ్ ముడివాగ వుణ్డానవత్తిల్ పురుషార్థ బుద్ధి పిఱన్దదాగిల్ చతుర్థియినర్థత్తై అనుసన్ధిత్తు మీళువాన్.
ఆయ ప్రత్యయం చతుర్థీ విభక్తిని సూచిస్తుంది. మనం భగవానుని కోసమే ఉన్నామని ఇది తెలియజేస్తుంది.
ఇక్కడ మూడు రకాల లక్ష్యాలను వివరిస్తున్నారు.
మొదటివి-పుత్రులు, పశువులు, భూమి, సంపద మొదలైన లౌకిక సుఖాలు.
రెండవవి-ఈ శరీరాన్ని విడిచిన తరువాత స్వర్గంలో పొందే సుఖాలు.
మూడవది-పరమపదానికి వెళ్లకుండా ఆత్మ తన స్వరూపానందాన్ని తానే అనుభవిస్తూ ఉండే కైవల్యం.
లౌకిక సంపదను, స్వర్గసుఖాన్ని లేదా కైవల్యాన్ని నిజమైన పురుషార్థాలుగా ఎవరైనా భావిస్తే, చతుర్థీ విభక్తిని సూచించే ఆయ పదం అర్థాన్ని మననం చేయాలి.
శాస్త్రాల ద్వారా స్థిరపరచబడినట్లుగా, ఈ జీవాత్మకు భగవానునికి సేవ చేయడమే అంతిమ లక్ష్యం అని ఆయ పదం తెలియజేస్తుంది.
ఆయ పదం అర్థాన్ని తెలుసుకోవడం ద్వారా లౌకిక సంపద, స్వర్గం, కైవల్యం పట్ల కలిగే అనుచితమైన కోరిక పూర్తిగా తొలగిపోతుంది.
ఈ విధంగా పిన్బళగరామ పెరుమాళ్ జీయర్ 38వ వార్థలోని అర్థాలను ఎంతో అందంగా సంక్షిప్తంగా వివరిస్తున్నారు.
ఇది పరాశర భట్టర్ రచించిన అష్టశ్లోకిలోని నాలుగవ శ్లోకానికి విపులమైన వ్యాఖ్యానంగా కూడా ఉపయోగపడుతుంది.
అంతేకాకుండా పరాశర భట్టర్ నంజీయరుకు స్వయంగా ఉపదేశించిన రహస్యార్థాల లోతైన భావాలను కూడా ఇందులో వివరించారు.
వార్తై 39
స్త్రీ శూద్రాదిగళుక్కు తిరుమన్త్ర పాఠత్తిల్ అధికారమ్ ఇల్లై, అర్థత్తిలే అధికారమ్ ఉళ్ళదు ఎన్ఱు నమ్పిళ్ళై అరుళిచ్చెయ్య అత్రుప్తరై పోలే, తిరుక్కురుగూర్ దాసర్ అత్రుప్తరైపోలే ఇరున్దవాఱే, ఇవర్కు పురుషార్థ సిద్ధిక్కు ఉఱుప్పాన అర్థత్తిల్ అధికారమ్ ఉణ్డాగిల్ అప్రయోజకమాన పాడత్తిల్ అధికారమ్ ఇల్లై. ఎన్ఱవిత్తాల్ ఇవర్కు వరుమదెన్? ఎన్ఱరుళిచ్చెయ్ తార్.
పంచసంస్కార సమయంలో ఆచార్యులు మూడు రహస్యార్థాలను ఉపదేశిస్తారు. అవి తిరుమంత్రం, ద్వయ మహామంత్రం, చరమ శ్లోకం.
మన సంప్రదాయంలోని పెద్దలు తిరుమంత్రాన్ని మంత్ర రహస్యం అని, ద్వయ మహామంత్రాన్ని అనుష్ఠాన రహస్యం అని, చరమ శ్లోకాన్ని విధి రహస్యం అని పేర్కొంటారు.
మంత్ర రహస్యం పదానికి, మనస్సులో ధ్యానించే వ్యక్తిని సంసార దుఃఖాల నుండి విముక్తునిగా చేసేది అని అర్థం.
మంత్రం అంటే మనస్సులో ధ్యానించేవారికి లేదా జపంగా ఉచ్చరించేవారికి దుఃఖాల నుండి విముక్తిని ప్రసాదించి, వారి కోరికలను నెరవేర్చేది. అందువల్ల తిరుమంత్రాన్ని (అష్టాక్షర మంత్రాన్ని) మంత్ర రహస్యం అని అంటారు.
ద్వయ మహామంత్రం ద్వారా పిరాట్టి పురుషకారంతో పెరుమాళ్ దివ్య పాదాలను ఉపాయంగా ఆశ్రయించి, వారిద్దరి దివ్య సమ్మేళనంలో వారి సంతోషం కోసం కైంకర్యాన్ని ప్రార్థిస్తాము.
చరమ శ్లోకం భగవానుని ప్రత్యక్ష ఆజ్ఞను (విధిని) కలిగి ఉంది. అది శ్రీభగవద్గీత 18.66లోని ఈ శ్లోకం:
“సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ||”
అన్ని ఇతర ధర్మాలను విడిచిపెట్టి నన్ను ఒక్కడినే శరణు పొందు. నేను నిన్ను సమస్త పాపాల నుండి విముక్తునిగా చేస్తాను. దుఃఖించకు.
ఇందులోని “దుఃఖించకు” మాట పెరుమాళ్ చేసిన ఆజ్ఞ. అంటే శ్రీవైష్ణవులు ఏ విషయానికీ దుఃఖించకూడదు.
ద్వయ మహామంత్రం అనుష్ఠాన రహస్యం. దీనిని మనం నిరంతరం జపిస్తూ ఉండాలి.
పిళ్ళై లోకాచార్యులు శ్రీవచనభూషణం 274వ సూత్రంలో ఇలా తెలియజేస్తున్నారు:
“జప్తవ్యం గురుపరంపరైయుం ద్వయముం”
అంటే నిరంతరం జపించవలసినవి గురుపరంపరా మంత్రం, ద్వయ మహామంత్రం.
జపించే గురుపరంపరా మంత్రాల క్రమం:
- అస్మద్ గురుభ్యో నమః
- అస్మద్ పరమగురుభ్యో నమః
- అస్మద్ సర్వగురుభ్యో నమః
- శ్రీమతే రామానుజాయ నమః
- శ్రీపరాంకుశ దాసాయ నమః
- శ్రీమద్ యామునమునయే నమః
- శ్రీరామమిశ్రాయ నమః
- శ్రీ పుండరీకాక్షాయ నమః
- శ్రీమన్నాథమునయే నమః
- శ్రీమతే శఠకోపాయ నమః
- శ్రీమతే విష్వక్సేనాయ నమః
- శ్రీయై నమః
- శ్రీధరాయ నమః
మన పెద్దలు తిరుమంత్రాన్ని పదేపదే జపించమని నిర్దేశించలేదు. తిరుమణ్ ధరించేటప్పుడు దాని అర్థాన్ని మనస్సులో ధ్యానించాలని, మిగిలిన సమయాలలో గురుపరంపరా మంత్రాన్ని, ద్వయ మహామంత్రాన్ని జపించాలని ఉపదేశించారు.
మణవాళ మామునుల ఆచరణను ఎరుంబియప్పా పూర్వదినచర్య 9వ శ్లోకంలో ఇలా వర్ణించారు:
“మంత్రరత్నానుసంధాన సంతత స్ఫురితాధరం”
అంటే మామునుల పెదవులు ఎల్లప్పుడూ మంత్రరత్నమైన ద్వయ మహామంత్రాన్ని జపిస్తూ కదులుతూ ఉండేవి.
ఈ విధంగా పూర్వాచార్యుల ఉపదేశం, ఆచరణ రెండూ ద్వయ మహామంత్రాన్ని నిరంతరం జపించడానికే ప్రాధాన్యతనిస్తున్నాయి. అష్టాక్షర మంత్రం మాత్రం దాని అర్థాన్ని గ్రహించి ధ్యానించడానికి ఉద్దేశించబడింది; పదేపదే జపించడానికి కాదు.
స్త్రీలు, యజ్ఞోపవీతం లేనివారు తిరుమంత్రంలోని అక్షరాలను శబ్దపూర్వకంగా ఉచ్చరించకూడదని శాస్త్రాలలో చెప్పబడిన విషయంపై ఒక సందేహం కలుగుతుంది.
ఈ విషయాన్ని నంపిళ్ళై వివరిస్తూ, వారికి తిరుమంత్రాన్ని శబ్దపూర్వకంగా ఉచ్చరించే అర్హత లేకపోయినా, దాని ప్రధానమైన అర్థాన్ని తెలుసుకోవడానికి సంపూర్ణమైన అర్హత ఉందని తెలియజేస్తున్నారు.
తిరుమంత్రం అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరికీ అర్హత ఉంది. ప్రణవం, నమః, నారాయణాయ పదాలు దేనిని సూచిస్తున్నాయో తెలుసుకోవడంలో ఎవరికీ నిషేధం లేదు.
అయితే యజ్ఞోపవీతం ధరించినవారికే మంత్రాన్ని శబ్దపూర్వకంగా ఉచ్చరించే అర్హత ఉంది.
నంపిళ్ళై ఒక కాలక్షేప గోష్ఠిలో ఈ విషయాన్ని ఉపదేశించినప్పుడు, తిరుక్కురుగూర్ దాసర్ శ్రీవైష్ణవుడు అసంతృప్తి చెందాడు. దీక్ష సమయంలో పొందిన తిరుమంత్రాన్ని స్త్రీలు, శూద్రులు జపించకూడదని స్వామి చెప్పినందుకు ఆయన మనస్సులో దుఃఖం కలిగింది.
మహానుభావులైన ఆచార్యులు శిష్యుల ముఖకవళికలను గమనించడం ద్వారానే వారి సందేహాలను గ్రహించగలరు. అలాగే నంపిళ్ళై ఆయన ముఖాన్ని గమనించి, ఆయన మనస్సులోని సందేహాన్ని తెలుసుకున్నారు.
అప్పుడు నంపిళ్ళై ఇలా తెలియజేశారు:
“పరమ పురుషార్థాన్ని పొందడానికి దారితీసే మంత్రార్థాన్ని తెలుసుకునే అర్హత ఆయనకు ఉన్నప్పుడు, ఆచరణలో ఉపయోగపడని మంత్రాక్షరాలను ఉచ్చరించే అర్హత లేకపోవడం వలన ఆయనకు ఏమి నష్టం కలుగుతుంది? అందువల్ల ఈ నిషేధం వలన ఆయన ఏమీ కోల్పోలేదు.”
మంత్రజపం ద్వారా పురుషార్థం సిద్ధించదు.
యజ్ఞోపవీతం ధరించి, కర్మయోగం, జ్ఞానయోగం లేదా భక్తియోగాన్ని అనుసరించేవారికి శాస్త్రాలు జపం, కర్మకాండలను విధిస్తాయి.
కానీ శరణాగతిని ఆశ్రయించిన భక్తులకు తిరుమంత్రంలోని అర్థాన్ని అనుసంధానం చేయడం ద్వారానే నిజమైన ఆత్మజ్ఞానం ప్రకాశిస్తుంది. మోక్షం మాత్రం ఆచార్య సంబంధం ద్వారా భగవానుని అనుగ్రహంతోనే లభిస్తుంది.
అందువల్ల మంత్రంలోని అక్షరాలను శబ్దపూర్వకంగా జపించినా, జపించకపోయినా వారికి ఎటువంటి భేదమూ ఉండదు.
పురుషార్థాన్ని ప్రసాదించే తిరుమంత్రార్థాన్ని తెలుసుకోవడానికి స్త్రీలకు, శూద్రులకు సంపూర్ణమైన అర్హత ఉన్నప్పుడు, మంత్రాక్షరాలను శబ్దపూర్వకంగా జపించడం వలన ప్రపన్నులకు ప్రత్యేకమైన ప్రయోజనం లేదని నంపిళ్ళై స్పష్టం చేస్తున్నారు.
దీనిని వివరించడానికి ఒక ఉదాహరణను చెబుతున్నారు.
ఒక వంద అంతస్తుల భవనం ఉందనుకుందాం. దానిని మెట్ల ద్వారా ఎక్కడం ఎవరికీ సాధ్యం కాదు. అటువంటప్పుడు ఒక వ్యక్తికి మెట్ల ద్వారా ఎక్కవలసిన అవసరం లేదని ఎవరైనా చెబితే, దాని వలన అతనికి ఏదైనా నష్టం లేదా కష్టం కలుగుతుందా? అసలు ఆ మెట్లను ఎక్కడం అతనికి సాధ్యమైనదీ కాదు, ప్రయోజనకరమైనదీ కాదు.
అదేవిధంగా ప్రపన్నులకు తిరుమంత్రాన్ని శబ్దపూర్వకంగా జపించడం వలన ఎటువంటి ప్రయోజనమూ లేదు. కాబట్టి దానిని ఉచ్చరించకూడదనే నియమం వలన వారికి ఎటువంటి నష్టమూ కలగదు.
అందువల్ల తిరుక్కురుగూర్ దాసర్ దుఃఖించవలసిన అవసరమే లేదు.
చివరగా, తిరుమంత్రం ఉద్దేశం దాని అర్థాన్ని తెలుసుకొని, మననం చేసి, మన సహజ స్వరూపాన్ని పోషించుకోవడమే తప్ప, జపం చేయడం కాదు.
పిళ్ళై లోకాచార్యులు ముముక్షుప్పడి ప్రారంభంలో ఈ విషయాన్ని వివరిస్తున్నారు.
ఉపాసకులు తాత్కాలికమైన ఫలితాలను పొందడానికి తిరుమంత్రంలోని పదాలను జపం, హోమాల కోసం ఉపయోగిస్తారు. అయితే ప్రపన్నులు తమ స్వరూపాన్ని పోషించుకోవడానికి తిరుమంత్రంలోని అర్థాన్నే ఆధారంగా చేసుకుంటారు.
అదేవిధంగా తిరువాయ్మొళి 1.2.10లోని,
“ఎణ్ పెరుక్కు అన్నలత్తు ఒణ్ పొరుళ్ ఈరిల వణ్ పుగళ్ నారణన్ తిణ్ కళల్ చేరే”
పాశురానికి నంపిళ్ళై ఇచ్చిన ఈడు వ్యాఖ్యానంలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.
ప్రపన్నులు తిరుమంత్రాన్ని జపం లేదా హోమాల కోసం ఉపయోగించరు. దాని అర్థాన్ని మననం చేయడం ద్వారానే పరమపురుషార్థాన్ని పొందుతారు.
ఇదే 39వ వార్తైలో సాయించిన ముఖ్యమైన విషయం.
ఆళ్వార్ ఎమ్పెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం
జీయర్ తిరువడిగళే శరణం
పిన్బళగియ పెరుమాళ్ జీయర్ తిరువడిగళే శరణం
అడియేన్ ఉషా రామానుజ దాసి
అడియేన్ శ్రీకాంత్ రామానుజ దాసన్
ఆడియో – https://1drv.ms/u/s!AhgMF0lZb6nnhXM2T4SORtavKQlX?e=70MLf7
వీడియో –https://www.youtube.com/watch?v=qSk-Y1UmsyA
ఆంగ్లంలో – https://granthams.koyil.org/2026/10/18/varthamalai-14-english/
పొందుపరచిన స్థలం: https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org